Aham
-
అహం బ్రహ్మాస్మి
దైవం ఒక నమ్మకం కాదు. సత్యమే, దైవం. నమ్మకాలన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు సత్యం కానే కాదు. నమ్మకాలేవీ నిజాలు కాదు. నమ్మకాలకు, విషయజ్ఞానానికి అతీతమైనదే సత్యం. దైవాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. సత్యాన్ని నీలోపల అన్వేషించాలి. భౌతికమైన ఆచారాలు, క్రతువులు ఏవీ కూడా నీకు దైవాన్ని తెలియజేయలేవు. అహం అనే అడ్డును తొలగించుకోనంత వరకు దైవాన్ని తెలుసుకోలేవు. నిన్ను దైవం నుండి వేరు చేసేది అహమే. అహం అనే భ్రమ వీడితే మిగిలేది దైవమే... దివ్యచైతన్యమే... అదే అసలైన నీవు... అదే నీ సహజస్థితి.. అదే దైవం. ప్రతిక్షణం చైతన్యంతో ఉండాలి. ఏపని చేస్తున్నా దానితో కలిసిపోకుండా ఒక సాక్షీ చైతన్యంగా ఉండాలి. చేసేవాడివి నీవు కాదు. అనుభవించేవాడివి కూడా నీవు కాదు. వీటిని చూస్తున్న ద్రష్టవే నీవు. అదే ఆత్మ, అదే దైవం, ఆ అద్వైతస్థితే దైవం. మనస్సు ‘నేను’ కాదు. మనస్సు వెనుక దాన్ని సాక్షిగా చూస్తున్న చైతన్యమే ‘నేను’. ఈ ‘నేను’ కి పుట్టుక లేదు చావు కూడా లేదు ద్వంద్వాలకు అతీతం. దాన్ని ఏదీ కలుషితం చేయలేదు. ఆ ఆత్మస్థితే నీ సహజస్థితి. విషయాలకు అంటని ఆ సాక్షివి కావాలి. అప్పుడే భ్రమలతో పుట్టిన ‘నేను’ అంతమై అసలైన ‘నేను’ (ఆత్మ) ప్రజ్వలిస్తుంది. ఆలోచనలన్నీ అంతమై ఆత్మ ప్రకాశిస్తుంది. ఏమి జరుగుతున్నా సరే నీవు ఈ అత్మస్థితిలోనే ఉండాలి. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, వింటున్నా, నిద్ర΄ోతున్నా... నీవు సాక్షిగా ఉండిపోవాలి. మనం ఇప్పుడు అనుకుంటున్నది మెలకువ కానే కాదు. కళ్ళు తెరిచినా నిద్రలోనే ఉంటున్నాం. మన నిజతత్వం పట్ల ఎరుకలేకుండా శరీరమే నేను, మనస్సే నేను అనే భ్రమలో ఉంటూ ఉన్నాం. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. అది తెలిసిన క్షణం ఆలోచనలు అగిపోతాయి. నీ నిజతత్వాన్ని ప్రతిబింబిస్తావు, నీవే ఆత్మగా ఉండి΄ోతావు. ఆ స్థితిలో సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరుగుతుంది. నమ్మవలసిన అవసరమే లేదు. నీవే సత్యం, నీవే దైవం. సత్యం అంటే ఆలోచనలు, నమ్మకాలు, సూత్రాలు, వర్ణనలు, విషయజ్ఞానం మొదలైనవేవీ కావు. సత్యం నీలోనే ఉంది. నీ నిజతత్వమే సత్యం. దైవం గురించిన వర్ణనలు, సిద్ధాంతాలు, పుస్తక జ్ఞానం మొదలైనవేవీ దైవాన్ని అనుభవంలోకి వచ్చేలా చేయలేవు. పైగా ఇంకా అడ్డుపడతాయి. అహాన్ని పెంచుతాయి. మనస్సును బలపరుస్తాయి. ఈ మనస్సు ఖాళీ ఐనపుడే సత్యం అనుభవమౌతుంది. ఈ సమాజమంతా మనస్సుతో నిర్మితమైదే. నీవు చూడాలనుకున్నదే కనబడుతుంది. మనస్సు భ్రమలతోనే నిర్మితం. దైవాన్ని కూడా వివిధ రూ΄ాల్లో ఊహించుకుంటుంది. అసలు మనస్సు, పదార్థం అనేవి కూడా లేవు. స్వచ్ఛమైన చైతన్యమే నీవు. అదే సత్యం... అదే దైవం.– స్వామి మైత్రేయ -
రాజశేఖర్‌తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న తేజ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ శుక్రవారం (11-08-2017) రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కొంత కాలం క్రితం తేజ సీనియర్ హీరో రాజశేఖర్ తో అహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆ సినిమా సెట్స్ మీదకు రాలేదు. తరువాత అదే కథను రానాతో నేనే రాజు నేనే మంత్రి గా మార్చి చేశారట. రాజశేఖర్ సినిమాను తీసుకున్నట్టుగా చెప్పకపోయినా.. అహం కథనే రానా కోసం కొన్ని మార్పులు చేసినట్టుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు. మరి రాజశేఖర్ అనుకున్న క్యారెక్టర్ కు రానా ఎంత వరకు సూట్ అవుతాడు. రానాకు తగ్గట్టుగా కథలో ఏం మార్పులు చేశారో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
తేజ దర్శకత్వంలో రానా
వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకులు స్టార్ ఇమేజ్ కోసం పోటీ పడుతుంటే యంగ్ హీరో రానా మాత్రం విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అతిథి పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించిన రానా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న రానా ఓ రిస్కీ ప్రాజెక్ట్ ను ఓకె చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆలోచనలో పడ్డాడు. కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇటీవల రాజశేఖర్ ప్రధాన పాత్రలో అహం సినిమాను ప్రారంభించాలని ప్రయత్నించాడు. అయితే ఈ సినిమా ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది. అహం సినిమా పట్టాలెక్కక ముందే రానా హీరోగా మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు తేజ. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ వారంలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి చాలా రోజులుగా అహం సినిమా కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ ఈ వార్త పై ఎలా స్పందిస్తాడో చూడాలి. My next film goes on floors this week. Look test completed. Director Teja and @MsKajaIAggarwaI !! More details soon!! — Rana Daggubati (@RanaDaggubati) 9 May 2016 -
తేజ సినిమా నుంచి రాజశేఖర్ అవుట్
కొద్ది రోజులుగా కెరీర్ పరంగా భారీ కష్టాల్లో ఉన్న రాజశేఖర్ ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవటంతో నెగెటివ్ రోల్స్‌కు కూడా రెడీ అయిన ఈ యాంగ్రీ హీరో, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం సినిమాలో విలన్‌గా నటించడానికి అంగీకరించాడు. అయితే ఈ సినిమా మొదలైన సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ముందుకెళుతుందా అన్న టాక్ వినిపించింది. అనుకున్నట్టుగానే తేజ తెరకెక్కిస్తున్న అహం నుంచి రాజశేఖర్ తప్పుకున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కారణాలేంటన్న విషయం తెలియకపోయినా రాజశేఖర్‌ను కాదని తేజ మరో స్టార్ హీరోని సంప్రదిస్తున్నాడట. ఒకప్పుడు యూత్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ కొద్ది రోజులుగా ఆ స్థాయి సినిమాను తెరకెక్కించలేకపోతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఉద్దేశంతో అహం సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. -
ఆ ముగ్గురికీ కీలకమే
దర్శకుడిగా ఒకప్పుడు టాప్ స్టార్ డమ్‌ను అందుకున్న తేజ, కొంత కాలంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు మినిమమ్ కలెక్షన్లు వసూళు చేసే సినిమాను కూడా ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఆలోచనలో ఓ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడు. తానే ఇంట్రడ్యూస్ చేసిన ఓ యువ నటుడు హీరోగా, మరో సీనియర్ హీరోను విలన్‌గా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన అహం సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు తేజ. ఈ సినిమాలో తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నవదీప్ హీరోగా నటిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం జై సినిమాతో తేజ డైరెక్షన్లో పరిచయం అయిన నవదీప్, ఇన్నేళ్ల తరువాత తిరిగి తన గురువుతో కలిసి నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో యాంగ్రీ హీరో రాజశేఖర్ తొలిసారిగా నెగెటివ్ రోల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజశేఖర్, తేజ, నవదీప్‌ల కెరీర్లు భారీ కష్టాల్లో ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురికి అహం సినిమా సక్సెస్ చాలా కీలకం కానుంది. మరి ఈ అహం ఆ ముగ్గురి కెరీర్లను గాడిలో పెడుతుందేమో చూడాలి. -
తేజ అహం...రాజశేఖర్ విలన్!
‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు పూర్తిస్థాయి విలన్‌గా కనిపించను న్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన తేజ దర్శకత్వంలో త్వరలో ‘అహం’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో విలన్‌గా రాజశేఖర్ నటించనున్నారు. తేజ చెప్పిన స్క్రిప్ట్‌కు ఇంప్రెసైన రాజశేఖర్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో ఓ యంగ్ హీరో చేయనున్నారు. రాజశేఖర్‌కు జోడీగా ప్రముఖ కథానాయికను ఎంపిక చేయనున్నారు. ఇటీవలి కాలంలో హీరో జగపతిబాబు కూడా విలన్‌గా మారి, వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై తెలుగు సినీ సీమలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్ళలో ‘తలంబ్రాలు’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. ‘అహం’లో రాజశేఖర్ పాత్రను విభిన్నంగా ఆవిష్కరించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలియనుంది.