తేజ సినిమా నుంచి రాజశేఖర్ అవుట్
తేజ సినిమా నుంచి రాజశేఖర్ అవుట్
Published Thu, Apr 7 2016 1:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
కొద్ది రోజులుగా కెరీర్ పరంగా భారీ కష్టాల్లో ఉన్న రాజశేఖర్ ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవటంతో నెగెటివ్ రోల్స్కు కూడా రెడీ అయిన ఈ యాంగ్రీ హీరో, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం సినిమాలో విలన్గా నటించడానికి అంగీకరించాడు. అయితే ఈ సినిమా మొదలైన సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ముందుకెళుతుందా అన్న టాక్ వినిపించింది.
అనుకున్నట్టుగానే తేజ తెరకెక్కిస్తున్న అహం నుంచి రాజశేఖర్ తప్పుకున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. కారణాలేంటన్న విషయం తెలియకపోయినా రాజశేఖర్ను కాదని తేజ మరో స్టార్ హీరోని సంప్రదిస్తున్నాడట. ఒకప్పుడు యూత్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ కొద్ది రోజులుగా ఆ స్థాయి సినిమాను తెరకెక్కించలేకపోతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఉద్దేశంతో అహం సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Advertisement
Advertisement