రాజశేఖర్తో అనుకున్న సినిమా రానాతో చేశారా..! | suresh babu clarity on nene raju nene mantri movie | Sakshi
Sakshi News home page

రాజశేఖర్తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!

Published Mon, Aug 7 2017 2:11 PM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

రాజశేఖర్తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!

రాజశేఖర్తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!

బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న తేజ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ శుక్రవారం (11-08-2017) రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

కొంత కాలం క్రితం తేజ సీనియర్ హీరో రాజశేఖర్ తో అహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆ సినిమా సెట్స్ మీదకు రాలేదు. తరువాత అదే కథను రానాతో నేనే రాజు నేనే మంత్రి గా మార్చి చేశారట. రాజశేఖర్ సినిమాను తీసుకున్నట్టుగా చెప్పకపోయినా.. అహం కథనే రానా కోసం కొన్ని మార్పులు చేసినట్టుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు. మరి రాజశేఖర్ అనుకున్న క్యారెక్టర్ కు రానా ఎంత వరకు సూట్ అవుతాడు. రానాకు తగ్గట్టుగా కథలో ఏం మార్పులు చేశారో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement