
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్‌ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్‌లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.
చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్
దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్‌కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట.
చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ
అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్‌కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్‌మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment