బావ బావమరిది? | RajaSekhar as Venkatesh Brother-in-law in Teja Film | Sakshi
Sakshi News home page

బావ బావమరిది?

Published Sun, Dec 3 2017 12:53 AM | Last Updated on Sun, Dec 3 2017 12:53 AM

RajaSekhar as Venkatesh Brother-in-law in Teja Film  - Sakshi

‘గరుడవేగ’ హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రాజశేఖర్‌. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్‌ జోష్‌లో ఉన్నారు తేజ. అదే జోష్‌తో వెంకటేశ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్‌ పరిశీలనలో ఉందట. ఈ నెల 13న వెంకీ బర్త్‌ డేకి ఈ సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో రాజశేఖర్‌ నటించనున్నారట.

‘‘కథ, పాత్ర నచ్చితే విలన్‌గా, ఇతర పాత్రల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని ఇటీవల రాజశేఖర్‌ చెప్పిన విషయం తెలిసిందే. తేజ చెప్పిన కథ రాజశేఖర్‌కు నచ్చిందట. క్యారెక్టర్‌ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇందులో రాజశేఖర్‌ విలన్‌గా చేయబోతున్నారట. వెంకీకి బావగా కనిపించనున్నారని మరో టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement