సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నరబలికి ముందు రోజు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, ఆయన భార్య శ్రీలత, రాజశేఖర్ అత్త చేర్యాల నరసింహస్వామి గుడిలో నిద్ర చేసినట్లు తెలుస్తోంది. అలాగే నరబలికి సలహా ఇచ్చిన పూజారితో రాజశేఖర్ గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నరబలి సమయంలో భార్య భర్తలు
ఇద్దరు ఉన్నారని...బలి ఇచ్చిన అనంతరం చిన్నారి మొండాన్నినాచారం లక్ష్మి ఇండస్ట్రీ లోపల పడేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 30 మంది విచారణ చేశారు. వారిలో ఇరవై మంది రాజశేఖర్ కుటుంబసభ్యులు కాగా, మరో పదిమంది పూజారులు ఉన్నారు. ఇక బలి ఇచ్చిన చిన్నారిని వరంగల్ జిల్లా భీమ్ దేవేరుపల్లి మండల్ హామ్లెట్ తండా నుంచి రాజశేఖర్ కొనుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు.
రాజశేఖర్ నోరు విప్పితేనే...
మరోవైపు నరబలి కేసులో రాజశేఖర్ నోరు విప్పితేనేగానీ మిస్టరీ వీడేలా లేదు. కేసు అతని చుట్టూనే తిరుగుతోంది. భార్య శ్రీలత ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చంద్ర గ్రహణం రోజు పసికందును బలి ఇచ్చి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అసలు విషయం చెబితే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందనే అతడు నోరు విప్పడం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment