chiluka nagar
-
నరబలి కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నరబలికి ముందు రోజు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, ఆయన భార్య శ్రీలత, రాజశేఖర్ అత్త చేర్యాల నరసింహస్వామి గుడిలో నిద్ర చేసినట్లు తెలుస్తోంది. అలాగే నరబలికి సలహా ఇచ్చిన పూజారితో రాజశేఖర్ గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నరబలి సమయంలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారని...బలి ఇచ్చిన అనంతరం చిన్నారి మొండాన్నినాచారం లక్ష్మి ఇండస్ట్రీ లోపల పడేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 30 మంది విచారణ చేశారు. వారిలో ఇరవై మంది రాజశేఖర్ కుటుంబసభ్యులు కాగా, మరో పదిమంది పూజారులు ఉన్నారు. ఇక బలి ఇచ్చిన చిన్నారిని వరంగల్ జిల్లా భీమ్ దేవేరుపల్లి మండల్ హామ్లెట్ తండా నుంచి రాజశేఖర్ కొనుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజశేఖర్ నోరు విప్పితేనే... మరోవైపు నరబలి కేసులో రాజశేఖర్ నోరు విప్పితేనేగానీ మిస్టరీ వీడేలా లేదు. కేసు అతని చుట్టూనే తిరుగుతోంది. భార్య శ్రీలత ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చంద్ర గ్రహణం రోజు పసికందును బలి ఇచ్చి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అసలు విషయం చెబితే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందనే అతడు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. -
క్షుద్రపూజల కోసమే చిన్నారి తల నరికేశారా?
-
ఉప్పల్లో దారుణం
-
ఉప్పల్లో దారుణం
హైదరాబాద్ : ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మూడు నెలల చిన్నారి చంపి అనంతరం తలను ఓ భవనంపై పడేశారు. హనుమంతు అనే వ్యక్తి తన ఇంటిపై చిన్నారి తలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి అడిషనల్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్ గిరి డీసీపి ఉమామహేశ్వర శర్మ తదితరులు చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ఎవరైందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి హైలెవెల్ ఎంక్వైరీ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
భార్య మరొకరితో వెళ్లిపోయిందని..
ఉప్పల్(హైదరాబాద్ సిటీ): భార్య మరొకరితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. చిలుకానగర్ కుమ్మరికుంట ప్రాంతానికి చెందిన కనికటి యాకయ్య(31)కు రవళి(22)తో నెల క్రితం వివాహం జరిగింది. కుమ్మరికుంటలో కాపురం పెట్టారు. కొద్దిరోజులు సాఫీగానే జరిగిన వీరి సంసారంలో చిచ్చు మొదలైంది. ఈ నెల 21వ తేదీన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన రవళి నగలను సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన భర్త ఈ నెల 22వ తేదీన ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్యలో భర్తకు ఫోన్ చేసిన భార్య రవళి తాను మరొకరితో వెళ్లిపోతున్నానని చెప్పడంతో జీర్ణించుకోలేక మనస్తాపం చెంది విషం తాగి ఉప్పల్ పోలీస్స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్లున్నాడు. మార్గమధ్యంలోనే నోట్లో నుంచి నురగలు కక్కుతూ రోడ్డు మీద పడిపోయాడు. స్థానికులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యాకయ్య మృతిచెందాడు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.