ఉప్పల్‌లో దారుణం | infant murdered in uppal | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో దారుణం

Published Thu, Feb 1 2018 3:10 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

infant murdered in uppal - Sakshi

చిన్నారి తలను స్వాధీనం చేసుకుని సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ : ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మూడు నెలల చిన్నారి చంపి అనంతరం తలను ఓ భవనంపై పడేశారు. హనుమంతు అనే వ్యక్తి తన ఇంటిపై చిన్నారి‌ తలను‌ గుర్తించి‌‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి అడిషనల్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్‌ గిరి డీసీపి ఉమామహేశ్వర  శర్మ తదితరులు చేరుకుని పరిశీలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ఎవరైందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి హైలెవెల్‌ ఎంక్వైరీ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement