child murdered
-
దారుణం: బాలిక పాశవిక హత్య
ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన బాలిక దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన స్థితిలో, ఒంటి మీద దుస్తులు లేకుండా డంపింగ్ యార్డులో ఆ బాలిక మృతదేహం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఇది సంచలనం సృష్టించింది. లైంగికదాడికి పాల్పడి హతమార్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, తొట్టంబేడు (చిత్తూరు) : తొట్టంబేడు పంచాయతీలోని క్రాస్ రోడ్డు పక్కన ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీచంద్ర, బూరీ దంపతులతో పాటు 20 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు పానీపూరీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాయి. శ్రీచంద్ర దంపతులకు కుమారుడు రింకూ(18), కుమార్తె పింకీ(16) ఉన్నారు. తమ పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి శ్రీచంద్ర తన భార్యతో కలిసి 10 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని తమ స్వగ్రామమైన పహరీ విహార్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం తమ ఇంట రింకూ, పింకీ పానీ పూరీ చేసే పనుల్లో పడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇప్పడే వస్తానంటూ తన అన్న రింకూకు చెప్పి పింకీ వెళ్లింది. సాయంకాలమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన రింకూ తమ బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో రాత్రంతా గాలించాడు. శుక్రవారం ఉదయం స్థానికులు చిలకా మహాలక్ష్మి ఆలయం వెనుక వైపున ఉన్న డంపింగ్ యార్డులో కాలిపోయిన పింకీ మృతదేహాన్ని గుర్తించి దిగ్భ్రాంతి గురయ్యారు. సమాచారమివ్వడంతో టూటౌన్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, డీఎస్పీ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణ ఘటనను తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్‌కు డీఎస్పీ తెలియజేయడంతో ఆయన కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ పింకీ మృతదేహం నుంచి కొంతదూరం వెళ్లి గోదాము వద్ద ఆగిపోయింది. పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహంపై గాయాలు పింకీ మృతదేహంపై గాయాలు ఉండడంతోపాటు, మృతదేహాన్ని కాల్చివేయడంతో లైంగికదాడి చేసి హతమార్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి పింకీని ఆగంతకులు హత్యచేసి డంపింగ్ యార్డులో మృతదేహానికి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. అయితే రాత్రి వర్షం కురవడంతో మృతదేహం పూర్తిగా కాలలేదు. ఇదలా ఉంచితే, పింకీ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెప్పారు. పింకీ దారుణ హత్యకు గురవడంతో ఇక్కడ పానీపూరీ వ్యాపారం చేసుకునే కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. -
ఉప్పల్‌లో దారుణం
-
ఉప్పల్‌లో దారుణం
హైదరాబాద్ : ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మూడు నెలల చిన్నారి చంపి అనంతరం తలను ఓ భవనంపై పడేశారు. హనుమంతు అనే వ్యక్తి తన ఇంటిపై చిన్నారి తలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి అడిషనల్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్ గిరి డీసీపి ఉమామహేశ్వర శర్మ తదితరులు చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ఎవరైందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి హైలెవెల్ ఎంక్వైరీ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
గొంతు కోసి చిన్నారి హత్య
బుక్కరాయసముద్రం : మండలంలోని హెచ్ఎల్సీ కాలువలో శనివారం గుర్తు తెలియని చిన్నారి(8) మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి తెలిపిన వివరాల మేరకు.. చిన్నారిని ఎక్కడో గొంతుకోసి హత్య చేసి రగ్గులో పెట్టి తాడుతో బిగించి కాలువలో పడేశారు. తాడిపత్రి రహదారి పక్కన హెచ్ఎల్సీలో మృతదేహం తేలి వస్తుండడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. చిన్నారి మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశామని ఆయన తెలిపారు. సుమారు ఐదు రోజుల క్రితం హత్య చేసి కాలువలో పడేయడంతో మృత దేహం బాగా ఉబ్బి ఉందన్నారు. చిన్నారి ఒంటిపై ఎర్రటి గౌను ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
నెలల పాపపై తండ్రి పంచ్‌ల వర్షం!
అల్లరి చేస్తుందని నెలల చిన్నారిని ఓ తండ్రి క్షణికావేశంలో హత్యచేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోరీ మోరిస్ దంపతులకు నాలుగు నెలల కూతురు ఎమర్సిన్ ఉంది. మోరిస్ భార్య పని నిమిత్తం బయటకు వెళ్లింది. కొంతసేపు మోరిస్(21) టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత కొందరితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే నాలుగు నెలల పాప కాస్త అరవడం మొదలుపెట్టింది. ఏదో శబ్ధం వస్తుందని అధికారులు తెలుపగా, తన కూతురిని మొదట వేరే రూములోకి ఫిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆ పాప పక్కన ఎవ్వరూ లేకపోవడంతో ఏడవటం మొదలుపెట్టింది. అప్పటికే విసిగిపోయిన ఆ తండ్రి ఆ గదిలోకి వెళ్లి నెలల పసికందు ముఖంపై బలంకొద్ది పంచ్‌ల వర్షం కురిపించాడు. అలా మొత్తంగా 15సార్లు ఎమర్సిన్ పై పంచ్‌లు ఇవ్వడంతో చిన్నారి చనిపోయింది. దాదాపు 7సార్లు ఛాతిపై కూడా కొట్టినట్లు ఒప్పుకున్నాడు. చిన్నారి ఏడుపు ఆగిపోవడం, మోరిస్ చేతికి రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దారుణ ఘటన వివరాలను పోలీసుల విచారణలో మోరిస్ వెల్లడించాడు. తాను జాబ్ చేయడానికి వెళ్లినప్పుడు కనీసం వారంలో మూడు రోజులు మోరిస్ పాప ఆలనాపాలనా చూసుకుంటాడని అతడి గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు వివరించింది. -
పాతబస్తీలో దారుణం..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపిన ఘటన చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందికల్లోని ఫ్లైఓవర్ కింద బుధవారం అర్ధరాత్రి పది నెలల చిన్నారి చంపి పడేశారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణశిక్ష
జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. తబిందా గని అనే అమ్మాయి 2007 సంవత్సరంలో స్కూలు నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించి దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబసభ్యులు ఎప్పటినుంచో కోరుతున్నారు. నిందితులు సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ ఇద్దరూ లాంగాటే ప్రాంతానికి చెందినవారు. మరో ఇద్దరు మోచి జహంగీర్ అన్సారీ పశ్చిమబెంగాల్‌కు చెందినవాడు కాగా, సురేష్ కుమార్ రాజస్థాన్ నివాసి.