నెలల పాపపై తండ్రి పంచ్ల వర్షం! | A father punched his infant daughter to death | Sakshi
Sakshi News home page

నెలల పాపపై తండ్రి పంచ్ల వర్షం!

Published Thu, Aug 18 2016 6:58 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM

నెలల పాపపై తండ్రి పంచ్ల వర్షం! - Sakshi

నెలల పాపపై తండ్రి పంచ్ల వర్షం!

అల్లరి చేస్తుందని నెలల చిన్నారిని ఓ తండ్రి క్షణికావేశంలో హత్యచేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోరీ మోరిస్ దంపతులకు నాలుగు నెలల కూతురు ఎమర్సిన్ ఉంది. మోరిస్ భార్య పని నిమిత్తం బయటకు వెళ్లింది. కొంతసేపు మోరిస్(21) టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత కొందరితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అయితే నాలుగు నెలల పాప కాస్త అరవడం మొదలుపెట్టింది. ఏదో శబ్ధం వస్తుందని అధికారులు తెలుపగా, తన కూతురిని మొదట వేరే రూములోకి ఫిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆ పాప పక్కన ఎవ్వరూ లేకపోవడంతో ఏడవటం మొదలుపెట్టింది. అప్పటికే విసిగిపోయిన ఆ తండ్రి ఆ గదిలోకి వెళ్లి నెలల పసికందు ముఖంపై బలంకొద్ది పంచ్ల వర్షం కురిపించాడు. అలా మొత్తంగా 15సార్లు ఎమర్సిన్ పై పంచ్లు ఇవ్వడంతో చిన్నారి చనిపోయింది.

దాదాపు 7సార్లు ఛాతిపై కూడా కొట్టినట్లు ఒప్పుకున్నాడు. చిన్నారి ఏడుపు ఆగిపోవడం, మోరిస్ చేతికి రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దారుణ ఘటన వివరాలను పోలీసుల విచారణలో మోరిస్ వెల్లడించాడు. తాను జాబ్ చేయడానికి వెళ్లినప్పుడు కనీసం వారంలో మూడు రోజులు మోరిస్ పాప ఆలనాపాలనా చూసుకుంటాడని అతడి గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement