
తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల సందడి బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్–రామ్‌చరణ్, Ðð ంకటేశ్– వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్–రానా.. ఇలా ఇద్దరు హీరోలు కలసి నటిస్తున్నారు. తాజాగా మరో మల్టీస్టారర్‌కి రంగం సిద్ధమవుతోందట. రాజశేఖర్–గోపీచంద్ కాంబినేషన్‌లో డైరెక్టర్ శ్రీవాస్ ఓ మల్టీస్టారర్‌కి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టేటర్’ వంటి సినిమాలతో శ్రీవాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గోపీచంద్–శ్రీవాస్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. కాగా రాజశేఖర్ చేతిలో ప్రస్తుతం ‘శేఖర్, ఆర్‌ఎస్ 92, మర్మాణువు’ సినిమాలుండగా, గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment