
భల్లాల దేవుడు రానా హీరోగా తెరకెక్కిన ’నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అయితే.. ఈ సినిమా మొదట రాజశేఖర్ వద్దకు వచ్చిందట. తేజ చెప్పిన ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని, కానీ, క్లైమాక్స్ విషయంలో ఇద్దరికీ విభేదాలు రావడంతో తాను ఆ సినిమాను చేయలేదని రాజ్‌శేఖర్ వెల్లడించారు. ఓ టీవీ చానెల్‌తో ముచ్చటించిన రాజశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘సినిమా కథ సూపర్‌గా వచ్చింది. కానీ క్లైమాక్స్‌లో నాకు తేజకు విభేదాలు వచ్చాయి. ఇలా ఉంటే బాగుంటుందని తేజ చెప్పారు. కాదు అలా ఉంటే బాగుంటుందని నేనన్నాను. తేజతో నాకు మొదటి సినిమా నుంచి పరిచయముంది. వందేమాతరం సినిమాకు తేజ అసిస్టెంట్ కెమెరామ్యాన్‌గా చేశాడు. అప్పటినుంచి తేజ తెలుసు. అంతేకాకుండా జీవితకు చిన్నప్పటి నుంచి తేజ క్లాస్‌మేట్ కూడా.. డైరెక్ట్ చేయమని తేజను ఫోర్స్ చేసింది కూడా నేనే. ఆ చనువు వల్ల క్లైమాక్స్ అలా ఉంటే చేయనని నేను చెప్పాను. దీంతో తను వెళ్లిపోయాడు. తర్వాత రానాతో చేశాడు’ అని రాజశేఖర్ వివరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రాజశేఖర్ తాజా సినిమా ’పీఎస్‌వీ గరుడవేగ’ నవంబర్ 3న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment