నేరస్తులు తప్పించుకోలేరు | Sneha Gupta at Raghava Reddy Movie Song Shooting | Sakshi
Sakshi News home page

నేరస్తులు తప్పించుకోలేరు

Published Sat, Dec 21 2019 2:54 AM | Last Updated on Sat, Dec 21 2019 2:54 AM

Sneha Gupta at Raghava Reddy Movie Song Shooting - Sakshi

స్నేహా గుప్తా

శివ కంఠమనేని హీరోగా తెరకెక్కు తోన్న చిత్రం ‘రాఘవరెడ్డి’. ‘క్రిమినల్స్‌ కాంట్‌ ఎస్కేప్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నందితా శ్వేతా కథానాయిక. రాశీ, అజయ్‌ఘోష్, అజయ్, రఘుబాబు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రధారులు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో జి. రాబాంబు యాదవ్, ఆర్‌. వెంకటేశ్వరరావు, కేఎస్‌ శంకర్‌రావు నిర్మిస్తున్నారు.  ‘ఆ... చదివిందే నే టెన్త్‌ రో.. అయ్యిందే డాక్టర్‌..’ అనే ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీలో స్నేహా గుప్తా ఈ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నారు.

సంజీవ్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగులో ‘అఘోరా, పౌరుషం’ చిత్రాలు చేశా. తర్వాత కన్నడంలో కొన్ని సినిమాలు తీశాను. తెలుగులో  ఇది నాకు మంచి కమ్‌బ్యాక్‌ అవుతుందనుకుంటున్నా. క్రిమినాలజీలో నేరపరిశోధన చేసే పాత్రలో హీరో శివ బాగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘కథని నమ్మి ఈ సినిమా తీస్తున్నాం. మా సినిమా నిర్మాణ సారథిగా ఉన్న గంటా శ్రీనివాసరావుగారికి థ్యాంక్స్‌’’ అన్నారు శివ. ‘‘చిత్రీకరణ దాదాపు పూర్తయింది’’ అన్నారు రాంబాబు యాదవ్‌. ఈ చిత్రానికి యశస్విని, సుధాకర్‌ స్వరకర్తలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement