నందితా శ్వేత, సుమంత్ అశ్విన్
హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు నవ్వుల్లో ముంచెత్తింది. జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్‌గా నటించారు. హరికిషన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్‌పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మొదటి భాగానికి దీటుగా ఉంటుంది. ఈ చిత్రం రావు రమేష్‌గారి వాయిస్ ఓవర్‌తో నడుస్తుంది. తాజాగా విడులైన మా సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లభించింది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. విద్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. పూర్తి సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు ఆయుష్ రెడ్డి, ఆర్‌పి అక్షిత్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment