premakathachitram
-
కారు సడన్‌గా ఆగింది!
‘‘ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ చాలా ముఖ్యమని భావిస్తాను. పాత్రల మధ్య వైవిధ్యం చూపేందుకు ఇష్టపడతాను’’ అని హీరోయిన్ సిద్ధీ ఇద్నాని అన్నారు. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధీ ఇద్నానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. హరి కిషన్ దర్శకత్వం వహించారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధీ ఇద్నాని చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో నా నిజజీవితానికి దగ్గరగా ఉండే బిందు అనే కాలేజీ అమ్మాయి పాత్రలో నటించాను. బిందుకి చాలా గర్వం. తను ఇష్టపడితే అవతలివారు ఇష్టపడాల్సిందే. ఈ చిత్రంలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ మంచి కో–స్టార్. అతనికి ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నప్పటికీ నిగర్వంగా ఉంటాడు. సెట్లో ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి మేం ఎక్కువగా మాట్లాడుకున్నాం. నందితాశ్వేతాతో నాకు మూడు, నాలుగు సీన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆమె నటించిన హారర్ సినిమాలు చూశాను. దర్శకుడు హరి సెట్లో సీన్స్‌ను బాగా వివరించడంతో ఈజీ అయింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద విజయం సాధించింది. రెండో పార్ట్ పై అంచనాలు ఉంటాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇందులో దెయ్యం ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ► కోపం, సంతోషం వంటి ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగానే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ లైఫ్‌లో భాగమే. కానీ పొసెస్డ్గా.. అంటే నాకే సొంతం అన్న ఫీలింగ్‌ను ఫేస్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడానికి కాస్త హోమ్‌వర్క్ చేశాను. ► అతీంద్రియ శక్తులను నమ్ముతాను. ఆత్మలు ఉన్నాయని నా నమ్మకం. ఓ సారి నేను కారులో వెళ్తుంటే సడన్‌గా ఆగింది. రెడ్ శారీలో ఓ లేడీ వచ్చి కారు ముందు నిలబడింది. ఈ అనుభవంతో భవిష్యత్‌లో నేను కచ్చితంగా సినిమా చేస్తాను. ► నేను తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి సినిమా ‘జంబలకిడిపంబ’(2018) ట్రైలర్ రిలీజైనప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ట్రైలర్లో నేను అబ్బాయిలా నటించడం చూసి నిర్మాత పిలిచి, ఆడిషన్ ఇవ్వమని అడగలేదు. ఇది కథ, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పారు. ‘జంబలకిడిపంబ’ చిత్రం మంచి హిట్ సాధించి ఉంటే నాకు మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి. ► సమంతకు నేను అభిమానిని. ఆమె ఎంపిక చేసుకుంటున్న తరహా పాత్రలు చేయాలని ఉంది. రాజమౌళిగారి దర్శకత్వంలో నటించాలని ఆశ. ప్రస్తుతం నేను నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ యాభై శాతం పూర్తయింది. జూన్‌లో విడుదల కావొచ్చు. మరో సినిమా కమిట్ అయ్యాను. ఈ నెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్తుంది. -
రావు రమేశ్ వాయిస్‌తో...
హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు నవ్వుల్లో ముంచెత్తింది. జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్గా నటించారు. హరికిషన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సూపర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మొదటి భాగానికి దీటుగా ఉంటుంది. ఈ చిత్రం రావు రమేష్‌గారి వాయిస్ ఓవర్‌తో నడుస్తుంది. తాజాగా విడులైన మా సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లభించింది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. విద్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. పూర్తి సర్ప్రైజింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి. -
సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది
సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నానీ జంటగా నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. హరికిషన్ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించారు. ఆయుష్ సహ నిర్మాత. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను నటుడు సప్తగిరి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథాచిత్రమ్’ మాకు జీవితాన్ని ప్రసాదించింది. ఆ సినిమా పేరును ఇంకా చెప్పుకుంటున్నాం. అంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన నేను ఈ ‘ప్రేమకథాచిత్రమ్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టోరీ పరంగా నేను అవసరం లేదనే నిర్మాత నన్ను ఈ సినిమాకు పిలవలేదు. పిలిచి ఉంటే వచ్చేవాడిని. సుమంత్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా ఉండిపోతుంది. నిర్మాతకు డబ్బులు రావాలి. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగభరితమైన సన్నివేశాలను హరికిషన్ చక్కగా తెరకెక్కించారు. హీరోయిన్ల పాత్రలు ఇతర పాత్రలను డామినేట్ చేసేలా ఉన్నాయి’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘కంటెంట్‌ని నమ్మి ఈ సినిమాను నిర్మించాను. స్క్రిప్ట్ పరంగా సప్తగిరి పాత్రకు అవకాశం లేదు. ఇప్పుడు ఆయన హీరో కూడా అయిపోయారు. కెమెరామేన్ రాంప్రసాద్ మంచి విజువల్స్ అందించారు. నందితా సింగిల్ టేక్ ఆర్టిస్టులా నటించారు. సుమంత్ అశ్విన్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సుదర్శన్‌రెడ్డి. ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత చాలా హారర్ కథలు విన్నాను. ఈ చిత్రానికి సైన్ చేసినప్పుడు... మళ్లీ హారరా? అన్నారు నా సన్నిహితులు. కానీ నా క్యారెక్టర్ బాగుంటుంది’’ అన్నారు నందితాశ్వేత. ‘‘ఈ సీక్వెల్ ‘ప్రేమకథాచిత్రమ్’కు దీటుగా ఉండాలని చాలా కష్టపడి తీశాం. సినిమా హిట్ సాధిస్తుంది’’ అన్నారు దర్శకుడు హరికిషన్. ‘‘ప్రేమకథాచిత్రమ్ 2’ నాకు స్పెషల్ మూవీ. ఇది తెలుగులో నా రెండో చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు సిద్ధీ ఇద్నానీ. నిర్మాతలు శ్రీధర్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ, కెమెరామేన్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా చాలా ఉంది
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందితా శ్వేత కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో హరి కిషన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్ అన్నది తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. టీజర్‌ను విడుదల చేశారు. సినిమాను జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. సీక్వెల్ కూడా అంతటి ఘనవిజయం సాధిస్తుందని టీజర్‌ని చూసిన వారు చెబుతుంటే హ్యాపీగా ఉంది. సుమంత్, సిద్ధి ఇద్నాని ప్లెజంట్‌గా నటిస్తే నందితా శ్వేత నటనలో తన విశ్వరూపం చూపించారు. ప్రేక్షకులు చూసింది టీజర్ మాత్రమే.. సినిమాలో ఇంకా చాలా ఉంది’’ అని అన్నారు. కృష్ణతేజ, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకు జేబీ సంగీతం అందించారు. -
లాయర్ కావాలనుకున్నా...
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : చిన్న సినిమాగా విడుదలైన ప్రేమ కథా చిత్రమ్ పెద్ద హిట్టు కొట్టింది. ఈ సినిమా హీరోయిన్ నందిత తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అమలాపురంలో ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్ నందిత విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ప్ర : సినీ రంగంలోకి ఎలా వచ్చారు? జ : అసలు నేను పెద్ద లాయర్ అవ్వాలనుకున్నా. అయితే సినిమాల మీద ఇంట్రస్ట్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హీరోయిన్గా మారాను. హీరోయిన్ కాకపోతే తప్పకుండా లాయరయ్యేదానిని. ప్రస్తుతం ప్రైవేటుగా బీకాం ఫైనలియర్ చదువుతున్నా. ప్ర : మీ తల్లిదండ్రుల గురించి ? జ : అమ్మ వసంత లీగల్ అడ్వయిజర్. నాన్న రాజ్‌కుమార్ మిలటరీలో కల్నల్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ప్ర : మీరు నటించిన తొలి చిత్రం? జ : నీకు.. నాకు మధ్య డాష్ డాష్.. ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాను. ప్రేమ కథాచిత్రమ్తో మంచి గుర్తింపు వచ్చింది. ప్ర : మీ కొత్త ప్రాజెక్టుల గురించి? జ : ప్రస్తుతం పృధ్వీరాజ్ దర్శకుడిగా తమిళంలో ఒక సినిమా, సుమంత్ అశ్విన్ దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు కొత్తచిత్రాలపై కూడా సైన్ చేశాను. ప్ర : పెద్ద హీరోలతో అవకాశాలు రాలేదా? జ : అందరు హీరోలతో నటించాలనుంది. పెద్ద హీరోలతో కూడా నటిస్తా.. త్వరలో మీరే చూస్తారు.. ప్ర : ఏ తరహా పాత్రలంటే ఇష్టపడతారు? జ : అన్ని కారెక్టర్లూ ఇష్టమే. ఏ పాత్ర అయినా అందులో లీనమై నటిస్తా... ప్ర : కోనసీమ నచ్చిందా.? జ : ఇక్కడికి తొలిసారిగా వచ్చాను. కొబ్బరిచెట్లు, పంటపొలాలు, కాలువలతో ఎంతో అందంగా ఉంది.