లాయర్ కావాలనుకున్నా... | If i would like a lawyer | Sakshi
Sakshi News home page

లాయర్ కావాలనుకున్నా...

Published Tue, Dec 17 2013 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

If i would like a lawyer

అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :  చిన్న సినిమాగా విడుదలైన ప్రేమ కథా చిత్రమ్  పెద్ద హిట్టు కొట్టింది. ఈ సినిమా హీరోయిన్ నందిత తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అమలాపురంలో ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్ నందిత విలేకరులతో కాసేపు ముచ్చటించారు.
 ప్ర : సినీ రంగంలోకి ఎలా వచ్చారు?
 జ : అసలు నేను పెద్ద లాయర్ అవ్వాలనుకున్నా. అయితే సినిమాల మీద ఇంట్రస్ట్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హీరోయిన్‌గా మారాను. హీరోయిన్ కాకపోతే తప్పకుండా లాయరయ్యేదానిని. ప్రస్తుతం ప్రైవేటుగా బీకాం ఫైనలియర్ చదువుతున్నా.
 ప్ర :  మీ తల్లిదండ్రుల గురించి ?
 జ : అమ్మ వసంత లీగల్ అడ్వయిజర్. నాన్న రాజ్‌కుమార్ మిలటరీలో కల్నల్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు.
 ప్ర :  మీరు నటించిన తొలి చిత్రం?
 జ : నీకు.. నాకు మధ్య డాష్ డాష్..  ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాను. ప్రేమ కథాచిత్రమ్‌తో మంచి గుర్తింపు వచ్చింది.
  ప్ర :  మీ కొత్త ప్రాజెక్టుల గురించి?
 జ : ప్రస్తుతం  పృధ్వీరాజ్ దర్శకుడిగా తమిళంలో ఒక సినిమా, సుమంత్ అశ్విన్  దర్శకత్వంలో తెలుగులో ఒక సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు కొత్తచిత్రాలపై కూడా సైన్ చేశాను.
 ప్ర :  పెద్ద హీరోలతో అవకాశాలు రాలేదా?
 జ : అందరు హీరోలతో నటించాలనుంది. పెద్ద హీరోలతో కూడా నటిస్తా.. త్వరలో మీరే చూస్తారు..
 ప్ర :  ఏ తరహా పాత్రలంటే ఇష్టపడతారు?
 జ :  అన్ని కారెక్టర్లూ ఇష్టమే. ఏ పాత్ర అయినా అందులో లీనమై నటిస్తా...
 ప్ర :  కోనసీమ నచ్చిందా.?
 జ : ఇక్కడికి తొలిసారిగా వచ్చాను. కొబ్బరిచెట్లు, పంటపొలాలు, కాలువలతో ఎంతో అందంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement