నందితా శ్వేత
‘‘అవకాశాలు వస్తే గ్లామర్ రోల్స్ చెయ్యాలని ఉంది. కానీ, ఎవ్వరూ నన్ను అలాంటి పాత్రలు చేయమని అడగటం లేదు. ఎవరైనా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తే.. ఆ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటే కచ్చితంగా చేస్తాను. ఇటీవల ఓ తమిళ సినిమాలో ప్రత్యేక పాట చేశాను’’ అని నందితా శ్వేత అన్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. హరికిషన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్‌పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ– ‘‘తెలుగులో నా మొదటి సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.
ఆ సినిమాలో నేను చేసిన అమల పాత్ర ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో చేసిన దెయ్యం పాత్ర కంటే ‘ప్రేమకథా చిత్రమ్ 2’లో చేసిన దెయ్యం పాత్ర చాలా కష్టం. పది సంవత్సరాల క్రితం ఓ రోజు రాత్రి గుడికి వెళ్తున్న సమయంలో ఏదో ఒక ఆకారం కనబడటంతో చాలా భయం వేసింది. అప్పుడు నిజంగా దెయ్యం ఉందేమోననిపించింది. కానీ, దేవుడు ఉన్నాడని కూడా నేను బాగా నమ్ముతాను. ‘ప్రేమకథా చిత్రమ్’ ఎండింగ్ నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఇప్పటివరకూ చేసిన సినిమాలకన్నా ఇందులో నా యాక్టింగ్‌లో పూర్తి వేరియేషన్స్ చూడొచ్చు. సమంత్ ఆశ్విన్ మంచి కో ఆర్టిస్ట్. చాలా బాగా సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం కన్నడలో యశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో ‘సెవెన్, అక్షర’ వంటి చిత్రాలున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment