
నందితా శ్వేతా
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందితా శ్వేతా ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరికిషన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంటే వేసవిలో మళ్లీ భయం మొదలు అన్నమాట. ‘‘ప్రేమకథాచిత్రమ్’ మంచి విజయం సాధించింది.
దీనికి సీక్వెల్‌గా వస్తుంది ‘ప్రేమకథాచిత్రమ్ 2’. నటుడు రావు రమేష్‌గారి వాయిర్ ఓవర్‌తో కథలో ప్రేక్షకులు లీనమవుతారు. సుమంత్, సిద్ధి, నందితాల నటన హైలైట్‌గా ఉంటుంది. విద్యుల్లేఖా, ప్రభాస్ శ్రీనుల మధ్య వచ్చే సన్నివేశాల నవ్విస్తాయి. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుదర్శన్‌రెడ్డి. ఈ సినిమాకు సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్‌పి అక్షిత్ రెడ్డి, సంగీతం: జెబి.
Comments
Please login to add a commentAdd a comment