Prema katha chithram
-
వేసవిలో భయం మొదలు
సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నందితా శ్వేతా ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరికిషన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంటే వేసవిలో మళ్లీ భయం మొదలు అన్నమాట. ‘‘ప్రేమకథాచిత్రమ్’ మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వస్తుంది ‘ప్రేమకథాచిత్రమ్ 2’. నటుడు రావు రమేష్‌గారి వాయిర్ ఓవర్‌తో కథలో ప్రేక్షకులు లీనమవుతారు. సుమంత్, సిద్ధి, నందితాల నటన హైలైట్‌గా ఉంటుంది. విద్యుల్లేఖా, ప్రభాస్ శ్రీనుల మధ్య వచ్చే సన్నివేశాల నవ్విస్తాయి. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుదర్శన్‌రెడ్డి. ఈ సినిమాకు సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి, సంగీతం: జెబి. -
భయం మళ్లీ మొదలు
సుధీర్‌బాబు, నందిత జంటగా వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. 2013లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ తెరకెక్కుతోంది. ‘బ్యాక్ టు ఫియర్’ అన్నది ఉపశీర్షిక. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత హీరోయిన్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో హరి కిషన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.పి.ఎ. క్రియేషన్స్‌పై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథ. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తయింది. ఈ నెల 22 నుంచి బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు, క్లయిమాక్స్‌ని చిత్రీకరించి, నవంబర్ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాం ప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి. -
హీరోగా మరో కమెడియన్
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రేమకథా చిత్రం లాంటి సినిమాలతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సప్తగిరి. ఒకప్పుడు వరుస సినిమాలతో యమా బిజీగా కనిపించిన సప్తగిరి కొద్ది రోజులుగా కనిపించటం మానేశాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా తరువాత చెప్పుకోదగ్గ పాత్రల్లో కనిపించలేదు. ప్రస్తుతం తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సప్తగిరి. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు భాషల్లో సప్తగిరి నటించటం విశేషం. అయితే ఈ సినిమాతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గా జరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే తన మిత్రుల కోసం హీరోగా నటిస్తున్న సప్తగిరి, ముందు ముందు కమెడియన్ గానే కొనసాగాలని భావిస్తున్నాడు. -
హీరోగా మరో కమెడియన్
అలీ, సునీల్, వేణుమాధవ్, ధనరాజ్ లాంటి కమెడియన్స్ హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు మరో కామెడీ స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ డిక్షన్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ కమెడియన్ సప్తగిరి కూడా త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఓ సీనియర్ డైరెక్టర్ సప్తగిరిని హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రేమ కథాచిత్రం, జ్యోతి లక్ష్మీ, సౌఖ్యం లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న సప్తగిరి, సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాగర్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వినాయక్, శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి, నాగేశ్వర్ రెడ్డిలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోగా మారిన చాలా మంది కమెడియన్స్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుండగా, సప్తగిరికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.