హీరోగా మరో కమెడియన్ | Comedian Sapthagiri all set to act as Hero | Sakshi
Sakshi News home page

హీరోగా మరో కమెడియన్

Published Fri, Jun 10 2016 9:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

హీరోగా మరో కమెడియన్

హీరోగా మరో కమెడియన్

వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రేమకథా చిత్రం లాంటి సినిమాలతో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సప్తగిరి. ఒకప్పుడు వరుస సినిమాలతో యమా బిజీగా కనిపించిన సప్తగిరి కొద్ది రోజులుగా కనిపించటం మానేశాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఎక్స్ప్రెస్ రాజా సినిమా తరువాత చెప్పుకోదగ్గ పాత్రల్లో కనిపించలేదు. ప్రస్తుతం తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సప్తగిరి.

తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు భాషల్లో సప్తగిరి నటించటం విశేషం. అయితే ఈ సినిమాతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా సైలెంట్గా జరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే తన మిత్రుల కోసం హీరోగా నటిస్తున్న సప్తగిరి, ముందు ముందు కమెడియన్ గానే కొనసాగాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement