Abhinetri
-
మిల్కీ బ్యూటీ వేదాంతం
నటి తమన్నా ఈ మధ్య వేదాంతం మాట్లాడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రలకు మాత్రమే ఓటు వేశారు తమన్నా. కాగా నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూసిన ఈ బ్యూటీకి బాహుబలి చిత్రం రూపంలో అలాంటి అవకాశం వచ్చింది. అందులో వీరనారి అవంతికగా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ తరువాత అలాంటి మరో అవకాశం తమన్నాకు ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. కాగా ఈ బ్యూటీ డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవాతో నటించిన దేవి 2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. హిందిలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదీ నటనకు అవకాశం ఉన్న పాత్రనేనని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఈ సినిమాలో తమన్నా ఒక పాటలో అందాలారబోయనుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈ మిల్కీబూటీ వేదాంతం గురించి మాట్లాడుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో దశాబ్ధానికి పైగా నటిస్తున్న తమన్నా షూటింగ్ లేని సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నారట. దీని గురించి ఇటీవల ఒక భేటీలో తెలుపుతూ పుస్తకాలు చదవడం అంటే తనకు చాలా ఆసక్తి అని చెప్పారు. అందులోనే వేదాంత పుస్తకాలను అధికంగా చదువుతానని తెలిపారు. కాగా అంతటితో ఆగకుండా ఈ బ్యూటీ మంచి తత్వంలో కూడిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో రోజుకొక్కటి చొప్పున పోస్ట్ చేస్తున్నారు. అయితే వాటిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదట. కారణం తమన్న వేదాంతపు వ్యాఖ్యలు హిందీలో ఉంటున్నాయి. కాబట్టి హిందీ భాష తెలిసిన వారే తమన్న తత్వాలను అర్థం చేసుకోగలుగుతారు. దీంతో ఎవరైనా తమన్నా వేదాంతపు వ్యాఖ్యలను తెలుగు, తమిళం భాషల్లోకి అనువదిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. కొందరైతే తమన్నకిప్పుడే ఈ వేదాంతం గొడవ ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఈ బ్యూటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. -
ప్రభుదేవా, తమన్నా రేర్ రికార్డ్!
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ అభినేత్రి 2. సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే జోడి కలిసి నటించిన మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ ఖామోషీ. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీ కూడా మే 31న ప్రేక్షకుల ముందు రానుంది. ఇలా ఒకే జంట కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావటం అరుదైన రికార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. అభినేత్రి 2 కూడా దేవీ 2 పేరుతో బాలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. ఇలా ఒకే రోజు ఒకే జంట నటించిన ఒకే జానర్ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు రావటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్‌హాసన్ సీక్వెల్స్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్‌లో ఫోర్త్ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్‌కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
వన్స్‌మోర్ విత్...!
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఎవరంటే... ప్రభుదేవా పేరు గుర్తొస్తుంది. మరి, హీరోయిన్లలో ఆ స్థాయిలో డ్యాన్స్ చేసేది ఎవరంటే వినిపించే ముగ్గురు నలుగురు కథానాయికల జాబితాలో తమన్నా పేరు తప్పకుండా ఉంటుంది. ఈ ఇద్దరూ డ్యాన్స్ బేస్డ్ హారర్ కామెడీ ‘అభినేత్రి’లో జంటగా నటించారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే... అందులో ప్రభుదేవా, తమన్నాల డ్యాన్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ జోడీ మరోసారి కలసి నటించడానికి సిద్ధమవుతుందని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. ప్రభుదేవా, తమన్నా జంటగా శీను రామసామి దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. గతేడాది నటిగా తమన్నాకి మంచి పేరు తెచ్చిన తమిళ సినిమా ‘ధర్మదురై’ దర్శకుడు శీను రామసామియే. ప్రస్తుతం తాజా చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయట. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
మా సినిమాలో ఆర్టిస్టుల కంటే నిర్మాతలు ఎక్కువ!
‘‘ఈ సినిమా ప్రారంభమవడానికి మెయిన్ పిల్లర్ తమిళ నిర్మాత గణేశ్ సర్. పేరు మాత్రమే నాది, డబ్బు ఆయనది. కోన వెంకట్ అండ్ ఫ్రెండ్స్ మరో పిల్లర్. ఈ సినిమాలో ఆర్టిస్టుల కంటే నిర్మాతలు ఎక్కువ. అందరూ కలసి చేయడం మంచిది. హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’’ అన్నారు ప్రభుదేవా. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ముఖ్య తారలుగా కోన ఫిల్మ్ కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమా సంస్థలు నిర్మించిన సినిమా ‘అభినేత్రి’. సాజిద్-వాజిద్, విశాల్ మిశ్రా సంగీత దర్శకులు. తెలుగు వెర్షన్ పాటల సీడీలను దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఏఎల్ విజయ్ మాట్లాడుతూ - ‘‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా స్టార్ట్ చేశా. ప్రభుదేవాగారి రాకతో హీరో సినిమా అయ్యింది. తమిళ నిర్మాత ఆయనే. ప్రభుదేవా లేకుంటే ‘అభినేత్రి’ లేదు. స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి కోన వెంకట్ ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘ప్రభుదేవాపై నా అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. డ్యాన్స్‌లో ఆయనే నా గురువు. ‘అభినేత్రి’ తర్వాత సోనూని బొమ్మాళీ అని పిలవడం మానేసి హీరోలా చూస్తారు’’ అన్నారు తమన్నా. కోన వెంకట్ మాట్లాడుతూ - ‘‘ప్రభుదేవా, విజయ్‌లు హార్డ్ వర్క్ చేశారు. ‘చంద్రముఖి’లా ‘అభినేత్రి’ టైటిల్ బాగుంటుందని ప్రభుదేవా చెప్పారు’’ అన్నారు. నిర్మాతలు అరుణ్, శివ మాట్లాడారు. దర్శకులు క్రిష్, కల్యాణ్ కృష్ణ, నందినీ రెడ్డి, నిర్మాతలు పీవీపీ, అభిషేక్ నామా, హీరోలు నాని, రాజ్‌తరుణ్ పాల్గొన్నారు. -
‘అభినేత్రి’ ఆడియో విడుదల వేడుక
-
‘అభినేత్రి ’ మూవీ స్టిల్స్
-
నిర్మాత వీపుపై తమన్నా సుఖాసనం
ఒక హీరో వీపుపై సుఖాసనంలో కూర్చున్న తమన్నా.. అదే వీపును కుర్చీగా చేసుకున్న మరో హీరోతో ముచ్చటిస్తున్న ఈ ఆసక్తికర సన్నివేశం ..' ఇదీ 'టు ఇన్ వన్' సినిమాలోది. తమన్నాను కూర్చోబెట్టుకుని వీపు నలగ్గొట్టుకున్నా.. నవ్వుతూ ఫోజిచ్చిన సోనూ సూదే ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం. తెలుగులో 'అభినేత్రి'గా , హిందీలో 'టు ఇన్ వన్'గా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ లో తమన్నా ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆమె సరసన సోనూసూద్, ప్రభుదేవాలు నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మరో మూడు భాషల్లో అక్టోబర్ 7న విడుదల కానుంది. (తమన్నా 'కొత్త' సినిమా చూస్తారా?) నిర్మాతగా తొలిసినిమా కావడంతో సోనూసూద్.. 'టు ఇన్ వన్' ప్రమోషన్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫొటోను వదిలారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన తండ్రి శక్తి సాగర్ సూద్ పేరుమీద 'శక్తి సాగర్ ప్రొడక్షన్స్'ను ప్రారంభించిన సోనూ తొలిసినిమాపై బోలెడు ఆశలుపెట్టుకున్నాడు. All set for my 1st home production "2in 1". releasing on 7th October @tamannaahspeaks @PDdancing . Need ur wishes 🙏🙏 pic.twitter.com/6QHoG2HBuB — sonu sood (@SonuSood) 22 August 2016 -
తమన్నా 'అభినేత్రి' టీజర్ విడుదల
-
విజయవాడలో అభినేత్రి ఆడియో
ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో అలరించిన తమన్నా, తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా అభినేత్రి. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా మంచి విజయాలు సాధించిన ప్రభుదేవా.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు వర్షన్‌కు కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ, బ్లూ సర్కిల్ కార్పొరేషన్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అభినేత్రి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఆగస్టు 15న విజయవాడ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిలోక సుందరి శ్రీదేవి హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోగా మరో కమెడియన్
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రేమకథా చిత్రం లాంటి సినిమాలతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సప్తగిరి. ఒకప్పుడు వరుస సినిమాలతో యమా బిజీగా కనిపించిన సప్తగిరి కొద్ది రోజులుగా కనిపించటం మానేశాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా తరువాత చెప్పుకోదగ్గ పాత్రల్లో కనిపించలేదు. ప్రస్తుతం తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సప్తగిరి. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు భాషల్లో సప్తగిరి నటించటం విశేషం. అయితే ఈ సినిమాతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కూడా సైలెంట్‌గా జరిగిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే తన మిత్రుల కోసం హీరోగా నటిస్తున్న సప్తగిరి, ముందు ముందు కమెడియన్ గానే కొనసాగాలని భావిస్తున్నాడు. -
అభినేత్రిగా అదరగొడుతోంది
తన గ్లామర్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. సక్సెస్ మాత్రం సాధించలేకపోయిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా. స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసిన ఈ బ్యూటీ భారీ బ్లాక్ బస్టర్లు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇటీవల బాహుబలి, ఊపిరి సినిమాలతో వరుస విజయాలు సాధించి మంచి ఫాంలో ఉంది ఈ బ్యూటీ. అదే జోరులో ఇప్పుడో ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా కనిపించే తమన్నా, పూర్తి డీగ్లామర్ రోల్ లో మెప్పించేందుకు రెడీ అవుతోంది. అభినేత్రి పేరుతో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఈ ప్రయోగం చేస్తుంది మిల్కీబ్యూటీ. ప్రభుదేవా, సోనూ సూద్ లు ఇరత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ అతిథి పాత్రలో అలరించనుంది. ఈ సినిమాతో విజయ్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. -
భయపెట్టే అభినేత్రి
మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగులో ‘అభినేత్రి’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా టైటిల్ రోల్లో, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బిఎల్ఎన్ సినిమాతో కలిసి ఎంవీవీ సత్యనారా యణ తెలుగులో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తమిళ్, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘ఫస్ట్‌టైం హారర్, కామెడీ చిత్రంలో నటిస్తున్నా. ‘బాహుబలి’, ‘బెంగాల్ టైగర్’, ‘ఊపిరి’ చిత్రాలతో ప్రేక్షకులు నాకు హ్యాట్రిక్ విజయాలు అందించారు. ఒకేసారి మూడు భాషల్లో నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని అన్నారు. ‘‘టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను తెలుగులో సమర్పించడం ఆనందంగా ఉంది’’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. ‘‘ఇప్పటికే రెండు షెడ్యూళ్లు అయిపోయి. ఈ నెల 15 నుంచి వైజాగ్‌లో మూడో షెడ్యూల్ చేస్తాం. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, సంగీతం: ఎస్ఎస్ తమన్, జీవీ ప్రకాష్‌కుమార్, కెమేరా: మనీష్ నందన్. -
అభినేత్రి..
-
వెండితెర వెనుక జీవితం!
వెండితెర మీద వెలిగినపోయిన జీవితాల వెనక వున్న చీకటి కోణాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా శాండిల్‌వుడ్‌లో ఓకథానాయిక జీవిత చరిత్ర తెరెకెక్కి సంచలనం సృష్టిస్తోంది. చాలా రోజులుగా కన్నడ ఇండస్టీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'అభినేత్రి' శుక్రవారం విడుదలైంది. 70వ దశకంలో శాండిల్‌వుడ్‌లో కథానాయికగా వెలిగిన నటి కల్పన. అభినేత్రి చిత్రకథ ఆమె జీవితం ఆధారంగానే రూపొందుతుందన్న వార్తలు ప్రారంభంనాటి నుండి వెలువడుతూనే వున్నాయి. పైగా అభినేత్రి టైటిల్ రోల్ దండుపాళ్యంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూజాగాంధీ పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆరు నెలలకు ముందే విడుదలకావాల్సిన ఈ సినిమా వివాదాలతో కావాల్సినంత పబ్లిసిటీని వెంటపెట్టుకుని విడుదలైంది. విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. కన్నడ నాట స్టార్ హీరోయిన్గా వెలిగి, వ్యక్తిగత వ్యవహారాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్న గ్లామర్ హీరోయిన్ కల్పన పాత్రలో పూజాగాంధీ మెప్పించింది. అలనాటి వాతావరణం, లోకేషన్స్ లాంటి విషయాలలో దర్శకుడు సతీష్ పార్తీబన్ శక్తి వంచన లేకుండా కృషిచేశారు. అయితే వెండి తెరకు సంబంధించిన సినిమా అంటేనే అన్నీ ఒకే రకంగా వుంటున్నాయి. స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్షర్ విజయం సాధించడంతో చాలా మంది కథానాయికలు, ఇలాంటి కథలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాను చూస్తుంటే విద్యాబాలన్ డర్టీ పిక్షర్, మాధూర్ బండార్కర్ హీరోయిన్, వీణామాలిక్ సిల్క్ సక్కత్ మగ, సనాఖాన్ గజ్జెల గుర్రం లాంటి సినిమాలు గుర్తుకు రాకమానవు.