వన్స్‌మోర్‌ విత్‌...! | Prabhu Deva, Tamanna will do another movie! | Sakshi
Sakshi News home page

వన్స్‌మోర్‌ విత్‌...!

Published Mon, Jan 30 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

వన్స్‌మోర్‌ విత్‌...!

వన్స్‌మోర్‌ విత్‌...!

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ఎవరంటే... ప్రభుదేవా పేరు గుర్తొస్తుంది. మరి, హీరోయిన్లలో ఆ స్థాయిలో డ్యాన్స్‌ చేసేది ఎవరంటే వినిపించే ముగ్గురు నలుగురు కథానాయికల జాబితాలో తమన్నా పేరు తప్పకుండా ఉంటుంది. ఈ ఇద్దరూ డ్యాన్స్‌ బేస్డ్‌ హారర్‌ కామెడీ ‘అభినేత్రి’లో జంటగా నటించారు. సినిమా రిజల్ట్‌ పక్కన పెడితే... అందులో ప్రభుదేవా, తమన్నాల డ్యాన్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడీ జోడీ మరోసారి కలసి నటించడానికి సిద్ధమవుతుందని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల సమాచారం.

ప్రభుదేవా, తమన్నా జంటగా శీను రామసామి దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్‌ సంస్థ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. గతేడాది నటిగా తమన్నాకి మంచి పేరు తెచ్చిన తమిళ సినిమా ‘ధర్మదురై’ దర్శకుడు శీను రామసామియే. ప్రస్తుతం తాజా చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయట. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement