
మా సినిమాలో ఆర్టిస్టుల కంటే నిర్మాతలు ఎక్కువ!
‘‘ఈ సినిమా ప్రారంభమవడానికి మెయిన్ పిల్లర్ తమిళ నిర్మాత గణేశ్ సర్. పేరు మాత్రమే నాది, డబ్బు ఆయనది. కోన వెంకట్ అండ్ ఫ్రెండ్స్ మరో పిల్లర్. ఈ సినిమాలో ఆర్టిస్టుల కంటే నిర్మాతలు ఎక్కువ. అందరూ కలసి చేయడం మంచిది. హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది’’ అన్నారు ప్రభుదేవా. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ముఖ్య తారలుగా కోన ఫిల్మ్ కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమా సంస్థలు నిర్మించిన సినిమా ‘అభినేత్రి’. సాజిద్-వాజిద్, విశాల్ మిశ్రా సంగీత దర్శకులు.
తెలుగు వెర్షన్ పాటల సీడీలను దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఏఎల్ విజయ్ మాట్లాడుతూ - ‘‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా స్టార్ట్ చేశా. ప్రభుదేవాగారి రాకతో హీరో సినిమా అయ్యింది. తమిళ నిర్మాత ఆయనే. ప్రభుదేవా లేకుంటే ‘అభినేత్రి’ లేదు. స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి కోన వెంకట్ ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు’’ అన్నారు.
‘‘ప్రభుదేవాపై నా అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. డ్యాన్స్‌లో ఆయనే నా గురువు. ‘అభినేత్రి’ తర్వాత సోనూని బొమ్మాళీ అని పిలవడం మానేసి హీరోలా చూస్తారు’’ అన్నారు తమన్నా. కోన వెంకట్ మాట్లాడుతూ - ‘‘ప్రభుదేవా, విజయ్‌లు హార్డ్ వర్క్ చేశారు. ‘చంద్రముఖి’లా ‘అభినేత్రి’ టైటిల్ బాగుంటుందని ప్రభుదేవా చెప్పారు’’ అన్నారు. నిర్మాతలు అరుణ్, శివ మాట్లాడారు. దర్శకులు క్రిష్, కల్యాణ్ కృష్ణ, నందినీ రెడ్డి, నిర్మాతలు పీవీపీ, అభిషేక్ నామా, హీరోలు నాని, రాజ్‌తరుణ్ పాల్గొన్నారు.