
ఈతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్న నటి రకుల్‌ప్రీత్‌సింగ్(Rakul Preet Singh ). ఇంతకుముందు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఈ బ్యూటీ తమిళంలో తడైయరతాక్క చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఎన్నమో ఎదో, ధీరన్ అధికారం ఒండ్రు, దేవ్, ఇండియన్ 2, అయలాన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అదేవిధంగా తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు పొందారు. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే పూర్తి దృష్టి పెడుతున్న ఈ భామ తాజాగా అజయ్‌దేవగన్, మాధవన్‌లతో కలిసి దే దే ప్రాయ్ దే–2 చిత్రంలో నటిస్తున్నారు.
ఇక తమిళంలో కమలహాసన్‌తో కలిసి నటించిన ఇండియన్–3 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్‌సింగ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో అలవాటైన పనుల నుంచి, ప్రాంతాల నుంచి బయటకు రండి. సౌకర్యంగా అలవాటైన ప్రాంతమే మీకు విరోధి. అలవాటైన ప్రాంతం అందంగా ఉంటుంది. అయితే అది మిమ్మల్ని ఏ విషయంలోనూ ఎదగనీయదు అని ఎవరో చెప్పారు.
ప్రజలు సోంబేరితనంగా మారడానికి కారణం వారికి అన్నీ రేపే కావాలి భావించడమే. ఎందుకంటే వారు తాము ఉన్న ప్రాంతాల్లో సౌకర్యంగా ఉండడమే. ఒక పనిచేయడం నుంచి మారాలనుకోవడం లేదు. నిత్యం చేసే పని మీకు సులభంగా ఉండవచ్చు. అయితే అది మిమ్మల్ని ఎదగనీయదు. ఎదగాలంటే మీరు అలవాటైన ప్రాంతం నుంచి బయటకు రావాలి. కఠినమైన విషయాలను చేయాలి. నా స్వభావం చాలా బలమైనది. అధికంగా నేను ప్రేమించుకుంటాను. కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తిని నేను అని రకుల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment