నిర్మాత వీపుపై తమన్నా సుఖాసనం | Sonu sood shares still from 'two in one', goes viral | Sakshi
Sakshi News home page

నిర్మాత వీపుపై తమన్నా సుఖాసనం

Published Mon, Aug 22 2016 5:57 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

Sonu sood shares still from 'two in one', goes viral

ఒక హీరో వీపుపై సుఖాసనంలో కూర్చున్న తమన్నా.. అదే వీపును కుర్చీగా చేసుకున్న మరో హీరోతో ముచ్చటిస్తున్న ఈ ఆసక్తికర సన్నివేశం ..' ఇదీ 'టు ఇన్ వన్' సినిమాలోది. తమన్నాను కూర్చోబెట్టుకుని వీపు నలగ్గొట్టుకున్నా.. నవ్వుతూ ఫోజిచ్చిన సోనూ సూదే ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం.

తెలుగులో 'అభినేత్రి'గా , హిందీలో 'టు ఇన్ వన్'గా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ లో తమన్నా ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆమె సరసన సోనూసూద్, ప్రభుదేవాలు నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మరో మూడు భాషల్లో అక్టోబర్ 7న విడుదల కానుంది. (తమన్నా 'కొత్త' సినిమా చూస్తారా?) నిర్మాతగా తొలిసినిమా కావడంతో సోనూసూద్.. 'టు ఇన్ వన్' ప్రమోషన్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫొటోను వదిలారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన తండ్రి శక్తి సాగర్ సూద్ పేరుమీద 'శక్తి సాగర్ ప్రొడక్షన్స్'ను ప్రారంభించిన సోనూ తొలిసినిమాపై బోలెడు ఆశలుపెట్టుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement