ప్రభుదేవా డ్యాన్స్‌పై ఏమన్నా డౌటుందా!
ప్రభుదేవా దేశంలోనే ఉత్తమ డ్యాన్సర్. ఆయనకు పోటీగా ఇటీవల హృత్తిక్ రోషన్, షాహీద్ కపూర్.. ఇంకా చాలాచాలామంది వచ్చారు. కానీ ఆయనే బెస్ట్ డ్యాన్సర్. అదే విషయాన్ని తాజాగా 'తుటక్ తుటక్ తుటియా' టీజర్ ద్వారా మరోసారి చాటుడు ప్రభుదేవా.
ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'తుటక్ తుటక్ తుటియా'. తెలుగులో ఈ సినిమా అభినేత్రిగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా అదిరిపోయే స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా రూపొందించిన ఈ టీజర్‌లో సోనూ సూద్ కొత్త అవతారంలో కనిపిస్తుండగా.. తమన్నా హాట్‌లుక్‌తో అదరగొట్టింది.