ఫాంటసీ ప్రేమకథ | Nikhil Siddharth Upcoming Movie Ekkadiki Potavu Chinnavada | Sakshi
Sakshi News home page

ఫాంటసీ ప్రేమకథ

Published Sun, Oct 16 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

ఫాంటసీ ప్రేమకథ

ఫాంటసీ ప్రేమకథ

‘‘సాధారణంగా నేను మంచి కథలు చేస్తున్నానని అంటారందరూ. ఆనంద్‌గారు చెప్పిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా అటువంటిదే. ఏడు నెలల నుంచి షూటింగ్ జరుగుతోంది. మంచి లవ్‌స్టోరీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ మూవీ చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అని హీరో నిఖిల్ అన్నారు. నిఖిల్, హెబ్బా పటేల్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల కింద నా ఫ్రెండ్ చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా.

నా మనసుకు నచ్చిన స్క్రిప్ట్ ఇది. కథ వినగానే నిఖిల్ చేయడానికి ఒప్పుకున్నాడు. టీజర్ చూసిన వాళ్లందరూ బాగుందని అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో పాటలను, నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథానాయిక నందితా శ్వేత పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement