Ekkadiki Potavu Chinnavada
-
ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి
- సురేష్ బాబు ‘‘చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో విడుదలైనా కూడా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి విజయం సాధించింది. ఈ టైమ్‌లో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నిఖిల్, హెబ్బా బాగా చేశారు. చిత్ర దర్శకుడు ఆనంద్కి మంచి భవిష్యత్ ఉంటుంది’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు. నిఖిల్, హెబ్బా పటేల్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ నవంబర్ 18న విడుదలైంది. ఈ చిత్రం 30 రోజుల సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నోట్ల రద్దు వల్ల చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ టైమ్‌లో సినిమా విడుదల చేయడం నిర్మాతల సాహసమే. ఈ చిత్రం పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘యాక్టర్స్, టెక్నీషియన్స్ వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. నోట్ల రద్దు ఇబ్బందుల్లో కూడా మా చిత్రం విజయం సాధించడంతో చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నాం’’ అని నిఖిల్ అన్నారు. ఐవీ ఆనంద్, హెబ్బా పటేల్, నటుడు రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అప్పటి నుంచి నా సినిమాలు చూడడం మానేశా!
‘‘వైవిధ్యమైన, మంచి చిత్రాల్లో నటిస్తాననే గుర్తింపు వచ్చింది. ప్రేక్షకుల్లో నాకున్న మంచి పేరు నిలబెట్టే చిత్రాలు చేయాలనుకుంటున్నా. సాధారణ కమర్షియల్ చిత్రాల్లో నటించాలంటే భయం, రిస్క్ కూడా. యంగ్ హీరోలు ప్రేక్షకులను ఆకర్షించాలంటే కథలో కొత్తదనం ఉండాల్సిందేనని నా అభిప్రాయం’’ అన్నారు నిఖిల్. ఆయన హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో పి. వెంకటేశ్వరరావు నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేపు రిలీజవుతోంది. నిఖిల్ చెప్పిన విశేషాలు... ఓ సీసాతో మొదలైన కథ, ఆ సీసాతోనే ముగుస్తుంది. అందులో ఏముందనేది సస్పెన్స్. మరణించిన మనిషి 21 గ్రాములు బరువు తగ్గుతాడని సైన్స్ చెబుతోంది. ఆ 21 గ్రాములు ఏమైనట్టు? ఆత్మలు ఉన్నాయా? లేవా?.. ఇలా అంతు చిక్కని అంశాలు బోలెడున్నాయి. హారర్ కామెడీతో కూడిన ఫ్యాంటసీ ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో ‘బాహుబలి’ చిత్రం గ్రాఫిక్ డిజైనర్‌గా కనిపిస్తా. రాజమౌళిగారితో ఫోనులో మాట్లాడే సీన్లు కామెడీగా ఉంటాయి. ఓ కథ అంగీకరించాక దర్శక- నిర్మాతల పనుల్లో జోక్యం చేసుకోను. అవసరమైతే నా ఖర్చుల్లో కోత విధిస్తా. నిర్మాతకు లాభాలొస్తేనే నేను విజయం సాధించి నట్టు. ప్రచార కార్యక్రమాల్లో మాత్రం రాజీపడను. ‘స్వామి రారా’ నుంచి సెంటిమెంట్‌గా నా చిత్రాల్ని చూడడం మానేశా. ఈ చిత్రాన్ని చూడలేదు. చూసినోళ్లంతా బాగుందన్నారు. ఫెయిల్యూర్స్ సహజమే. అయితే, ఎవరి ఒత్తిడి వల్లో సినిమా లు చేయకూడదనేది ‘శంకరాభరణం’తో అర్థమైంది. ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. చందూ మొండేటి ‘కార్తికేయ-2’ స్క్రిప్ట్ రెడీ చేశాడు. -
గెట్ రెడీ టు థ్రిల్
‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. టీజర్ చూసినవారు చాలా ఆసక్తిగా ఉందంటున్నారు. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది’’ అన్నారు హీరో నిఖిల్. ఆయన హీరోగా, హెబ్బా పటేల్, నందిత శ్వేత కథానాయికలుగా ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. శేఖర్‌చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. నిఖిల్ మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం నవ్వులు పంచే చిత్రం ఇది. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ‘వెన్నెల’ కిశోర్‌గారు బాగా నవ్విస్తారు. నా గత చిత్రాల్లాగా ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గెట్ రెడీ టు థ్రిల్’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల కిందట నా స్నేహితుడు చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. మేం అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. ఈ నెల 18న సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేశ్, జోష్ రవి, అపూర్వ శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్. -
ఫాంటసీ ప్రేమకథ
‘‘సాధారణంగా నేను మంచి కథలు చేస్తున్నానని అంటారందరూ. ఆనంద్‌గారు చెప్పిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా అటువంటిదే. ఏడు నెలల నుంచి షూటింగ్ జరుగుతోంది. మంచి లవ్‌స్టోరీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ మూవీ చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అని హీరో నిఖిల్ అన్నారు. నిఖిల్, హెబ్బా పటేల్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల కింద నా ఫ్రెండ్ చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. నా మనసుకు నచ్చిన స్క్రిప్ట్ ఇది. కథ వినగానే నిఖిల్ చేయడానికి ఒప్పుకున్నాడు. టీజర్ చూసిన వాళ్లందరూ బాగుందని అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో పాటలను, నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథానాయిక నందితా శ్వేత పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర.