ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి | 30-Day celebrations of ekkadiki potavu chinnavada movie | Sakshi

ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి

Dec 21 2016 12:20 AM | Updated on Sep 4 2017 11:12 PM

ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి

ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి

‘‘చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో విడుదలైనా కూడా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి విజయం సాధించింది.

- సురేష్ బాబు
‘‘చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో విడుదలైనా కూడా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి విజయం సాధించింది. ఈ టైమ్‌లో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నిఖిల్, హెబ్బా బాగా చేశారు. చిత్ర దర్శకుడు ఆనంద్‌కి మంచి భవిష్యత్‌ ఉంటుంది’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌ బాబు. నిఖిల్, హెబ్బా పటేల్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో ఐవీ ఆనంద్‌ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్‌ నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ నవంబర్‌ 18న విడుదలైంది.

ఈ చిత్రం 30 రోజుల సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘నోట్ల రద్దు వల్ల చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ టైమ్‌లో సినిమా విడుదల చేయడం నిర్మాతల సాహసమే. ఈ చిత్రం పెద్ద హిట్‌ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘యాక్టర్స్, టెక్నీషియన్స్‌ వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. నోట్ల రద్దు ఇబ్బందుల్లో కూడా మా చిత్రం విజయం సాధించడంతో చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరూ సంతోషంగా ఉన్నాం’’ అని నిఖిల్‌ అన్నారు. ఐవీ ఆనంద్, హెబ్బా పటేల్, నటుడు రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement