
తమిళంలో హిట్ సాధించిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మి, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందితా శ్వేత కథానాయికగా నటిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మిస్తున్నారు. 75 శాతం షూటింగ్ కంప్లీటైంది. రమేష్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌పై తమిళ చిత్రం ‘శివలింగ’ను తెలుగులో అనువదించి, మంచి విజయం సాధించాము.
ఇప్పుడు ‘చతురంగ వేటై్ట’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 15 కల్లా పూర్తి చేసి, జూన్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం.’’ అన్నారు. ‘‘ధనం మూలం ఇదమ్ జగత్ అంటారు. ‘చతురంగ వేటై్ట’ డబ్బు, మానవతా విలువలకు సంబంధించిన సినిమా. ఆశ అత్యాశగా మారితే ఎలా ఉంటుందో చూపించాం. పాటలు, డైలాగ్స్ ఆకట్టుకునేలా
ఉంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్.
Comments
Please login to add a commentAdd a comment