నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్‌గారు స్టోరీ నరేట్ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను.
హారర్, కామెడీ జానర్స్ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్‌లో సాయం చేసిన దర్శకుడు రితేష్ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్ మార్తాండ్. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్’’ అన్నారు అబినికా ఇనాబతుని.
Comments
Please login to add a commentAdd a comment