O Manchi Ghost Movie
-
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఈసారి ఆగస్టు 15, శ్రావణ శుక్రవారం లాంటివి కలిసి రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇందుకు తగ్గట్లే థియేటర్లలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఆయ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిపై బజ్ బాగానే ఉంది. కానీ ఓటీటీల్లో కూడా ఈ వారాంతంలో దాదాపు 18 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: పేపర్ టీ కప్ కాంట్రవర్సీలో 'తంగలాన్' డైరెక్టర్)ఓటీటీల్లో ఈ వీకెండ్ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. చాలావరకు ఇంగ్లీష్ హిందీ సినిమాలే కనిపిస్తున్నాయి. ఎవోల్, ఓ మంచి ఘోస్ట్ లాంటి తెలుగు మూవీస్ ఉన్నాయి. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ అందరూ కలిసి నటించిన 'మనో రథంగల్' అనే ఆంథాలజీ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. దిగువన లిస్టులో ఉన్న సినిమాలన్నీ గురువారం రిలీజ్ కాబోతున్నాయి. శుక్రవారం, శనివారం వచ్చేవాటికి ఆయా తేదీలు ఉన్నాయి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్నెట్ఫ్లిక్స్ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 - ఇంగ్లీష్ సిరీస్కెంగన్ అసుర సీజన్ 2 - జపనీస్ సిరీస్ద యూనియన్ - ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 16)లవ్ నెక్స్ట్ డోర్ - కొరియన్ సిరీస్ (ఆగస్టు 17)ఆహాఓ మంచి ఘోస్ట్ - తెలుగు మూవీవేర మారి ఆఫీస్ 2 - తమిళ వెబ్ సిరీస్ఎవోల్ - తెలుగు సినిమా (ఆగస్టు 16)కొంజమ్ పెసినాల్ ఎన్న - తమిళ మూవీ (ఆగస్టు 16)అమెజాన్ ప్రైమ్జాక్ పాట్ - ఇంగ్లీష్ సినిమాఫెర్ఫెక్ట్ వెర్పాస్ట్ - జర్మన్ సిరీస్వాస్కోడి గామా - తమిళ మూవీ (ఆగస్టు 16)యే మేరీ ఫ్యామిలీ సీజన్ 4 - హిందీ సిరీస్ (ఆగస్టు 16)హాట్స్టార్మై ఫర్ఫెక్ట్ హస్బెండ్- ఆగస్టు 16జియో సినిమాబెల్ ఎయిర్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (ఆగస్టు 16)జీ5మనో రథంగల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్కంటాయే కంటాయే -హిందీ సినిమాసోనీ లివ్చమక్: ది కంక్లూజన్- హిందీ మూవీ (ఆగస్టు 16)బుక్ మై షోడిస్పకబుల్ మీ 4 - ఇంగ్లీష్ సినిమా (ఆగస్టు 16)(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ) -
ఓటీటీలోకి దెయ్యం కామెడీ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
హారర్ కామెడీ కథలతో తెలుగులో ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనాలకు బోర్ కొట్టేస్తున్నాయ్ గానీ దర్శకులు మాత్రం ఈ తరహా చిత్రాల్ని వదలడం లేదు. అలా దెయ్యంతో కామెడీ అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు మూవీ 'ఓ మంచి ఘోస్ట్'. జూన్ 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత నాకు గిఫ్ట్ కావాలి: వేణుస్వామి భార్య)వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. రెగ్యులర్ రొటీన్ హారర్ కథ కావడంతో జనాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓటీటీలో కాబట్టి టైమ్ పాస్ చేయొచ్చు. ఆహాలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు.'ఓ మంచి ఘోస్ట్' విషయానికొస్తే.. డబ్బు కావాల్సిన నలుగురు కుర్రాళ్లు.. ఎమ్మెల్యే కూతురిని కిడ్నాప్ చేస్తారు. ఊరి చివరి బంగ్లాలో తీసుకొచ్చి పెడతారు. ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. చివరకు ఏమైంది బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది స్టోరీ.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
నా పక్కన రెండు దెయ్యాలు కూర్చున్నాయి.
-
OMG Review: ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: OMG (ఓ మంచి ఘోస్ట్)నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.నిర్మాత: డా.అబినికా ఇనాబతునిదర్శకుడు: శంకర్ మార్తాండ్సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూఎడిటర్: ఎం.ఆర్.వర్మవిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్).. ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన తన మేన మరదలు, స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు(నాగినీడు) కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కిర్తీకి కూడా ఓ సమస్య ఉంటుంది? అటు దెయ్యం, ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసినవాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ, ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఓ మంచి ఘోస్ట్ కూడా ఆ జానర్లో తెరకెక్కిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే.. భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా..ప్రతీది పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో.. రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కిడ్నాప్ డ్రామ అంతగా ఆకట్టుకోదు. నలుగురి గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ.. అతన్ని దెయ్యం అనుకొని ఆ నలుగు భయపడే సన్నివేశాలు.. ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు.. ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే.. మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. -
మంచి కామెడీ దెయ్యం
నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్‌గారు స్టోరీ నరేట్ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్స్ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్‌లో సాయం చేసిన దర్శకుడు రితేష్ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్ మార్తాండ్. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్’’ అన్నారు అబినికా ఇనాబతుని. -
‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నవ్విస్తూ భయపెట్టేస్తున్న 'ఓ మై గాడ్' ట్రైలర్
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. ఇందులో నందితా శ్వేత, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. హారర్, కామెడీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకుడు. జూన్ 21న మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఇది ఎలా ఉందో తెలుసా?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)ఓ గ్యాంగ్, పిశాచీపురం అనే ఊరిలోకి ఎంటర్ కావడం, అక్కడ ఓ బంగ్లా, అందులోని దెయ్యంతో కామెడీ.. ఇలా ట్రైలర్ చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడుతోంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్) -
‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తోంది
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రాన్ని మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. ప్రేక్షకులు నవ్వుతూనే భయపడతారు? అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది.