నవ్విస్తూ భయపెట్టేస్తున్న 'ఓ మై గాడ్' ట్రైలర్ | O Manchi Ghost Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

OMG 2 Trailer: నవ్విస్తూ భయపెట్టేస్తున్న 'ఓ మై గాడ్' ట్రైలర్

Published Sat, Jun 15 2024 9:29 PM | Last Updated on Sun, Jun 16 2024 3:05 PM

O Manchi Ghost Movie Telugu Trailer

ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. ఇందులో నందితా శ్వేత, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. హారర్, కామెడీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకుడు. జూన్ 21న మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఇది ఎలా ఉందో తెలుసా?

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)

ఓ గ్యాంగ్, పిశాచీపురం అనే ఊరిలోకి ఎంటర్ కావడం, అక్కడ ఓ బంగ్లా, అందులోని దెయ్యంతో కామెడీ.. ఇలా ట్రైలర్ చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడుతోంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement