‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తోంది | OMG (O Manchi Ghost) Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తోంది

Published Thu, Jun 13 2024 11:04 AM | Last Updated on Thu, Jun 13 2024 11:34 AM

OMG (O Manchi Ghost) Movie Release Date Out

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ హారర్‌ చిత్రాన్ని మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై  డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు.  షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

‘ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్‌’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. ప్రేక్షకులు నవ్వుతూనే భయపడతారు? అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement