
నందితా శ్వేతా
తెలుగులో నందితా శ్వేతా చేసింది రెండు సినిమాలే. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, శ్రీనివాస కల్యాణం’. ఈ రెండు సినిమాలూ నందితకు మంచి పేరు తెచ్చాయి. తమిళంలో అయితే ఇంకా మంచి గుర్తింపు ఉంది. అక్కడ ఆమె సినిమాల స్కోర్ దాదాపు 15. అప్పుడప్పుడూ కన్నడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటారు. ఇప్పటివరకూ హీరోయిన్‌గా మాత్రమే చేసిన నందితా శ్వేత ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ రోల్ చేయనున్నారు. నూతన సంస్థ ‘సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్’ నిర్మించనున్న ఈ చిత్రానికి చిన్నికృష్ణ దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, సురేశ్ వర్మ అల్లూరి నిర్మాతలు. ‘‘త్వరలో ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం. అదే రోజున టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నాం. మిగిలిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘సమ్‌థింగ్ స్పెషల్ రోల్ చేయబోతున్నా. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నందితా శ్వేత. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి.
Comments
Please login to add a commentAdd a comment