‘‘స్టార్ అవ్వడం కన్నా ప్రేక్షకుల దగ్గర నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా తపన. నాలో యాక్టర్‌ని గుర్తించి నాకు విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాన్ని ఇస్తున్న దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు నందితా శ్వేత. గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కి తెలుగు రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందితా శ్వేత చెప్పిన విశేషాలు.
నేను మైసూర్‌లో పుట్టినప్పటికీ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. నా స్కూల్ టైమ్‌లో ‘నంద లవ్స్ నందిత’ అనే కన్నడ చిత్రం చేశాను. సినిమా విజయం సాధించింది. కానీ నటనలో నా నైపుణ్యత ఇంకా పెరగాలని నాకు అనిపించింది. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని యాక్టింగ్ కోర్స్ చేశాను. అలాగే నా స్టడీస్‌పై దృష్టి పెట్టి ఎమ్‌బీఏ కూడా పూర్తి చేశాను. నెక్ట్స్ పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన ఉంది.ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాను. తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ చేశాను. ‘బ్లఫ్ మాస్టర్’ నా మూడో సినిమా. ఇందులో అవని అనే క్యారెక్టర్ చేశాను. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చూడకుండానే గోపీగారు నన్ను ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. సత్యదేవ్ మంచి నటుడు. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. తమిళ చిత్రంతో పోలిస్తే చాలా మార్పులు చేశాం.ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. సినిమాను సినిమాగానే చూస్తున్నారు. కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు.
పాత్ర పర్‌ఫెక్షన్ కోసం ఎంతైనా కష్టపడతాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఇప్పటివరకు 22 సినిమాలు చేశాను. ఒక్క ఈ ఏడాదే తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 11 సినిమాల్లో భాగమవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ 3 రిలీజయ్యాయి. మరో ఎనిమిది సినిమాలు వరుసగా రిలీజవుతాయి.తెలుగు, కన్నడ, తమిళంలలో దేనికి ప్రియారిటీ అంటే చెప్పలేను. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను. తెలుగులో ‘కల్కి’ చిత్రంలో ముస్లిం యువతిగా కనిపిస్తాను. ‘అక్షర’ చిత్రంలో లెక్చరర్ పాత్ర చేస్తున్నాను. అలాగే ప్రేమకథా చిత్రమ్ 2, అభినేత్రి 2, 7’ చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక తమిళంలో ‘నర్మద’ అనే చిత్రంలో తల్లి పాత్ర పోషిస్తున్నాను. సెల్వ దరక్శత్వంలో అరవిందస్వామి హీరోగా రూపొందుతున్న ‘వణంగాముడి’ చిత్రంలో నాది పోలీస్ పాత్ర. కన్నడంలో ‘కేజీఎఫ్’ హీరో యశ్‌తో ‘కిరాతక’ అనే సినిమా చేస్తున్నా. ఇంకా చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఎగై్జటింగ్‌గా ఉంటేనే ఓకే చెబుతున్నాను.
Comments
Please login to add a commentAdd a comment