clean shave
-
మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్‌తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్‌తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్‌తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?
తెలంగాణకు చెందిన ఆ కాంగ్రెస్ నేత స్టైలే వేరు. రాజకీయాలపై మాట్లాడితే మాటల తూటాలే. చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేక హెయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు ఉంటుంది. ఎప్పుడూ బారెడు గడ్డం, పొడవాటి మీసంతో జనాల్లో కనిపించే ఆ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా మారిపోయారు. నిత్యం గడ్డం, మీసాలు పెంచుతూ ఉండే ఆయన ఉన్నట్టుండి క్లీన్‌షేవ్‌తో దర్శనమిచ్చారు .దీంతో ఆయనను గుర్తుపట్టడం కొందరికి కష్టమైపోయింది. తిరుపతి వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు.. మన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. దీంతో జగ్గారెడ్డిని గడ్డం మీసాలు లేకుండా గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. అసలు ఆయనేనా అని పరీక్షించి చూస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ పూజల్లో పాల్గొంటారు. పండుగల సందర్భంగా చందాల కోసం వచ్చిన భక్తులకు తనకు తోచిన సాయాన్ని చేస్తూనే ఉంటారు.. ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్ర ఆయన నియోజకవర్గంలో (సంగారెడ్డి) ప్రవేశించిన సందర్భంగా జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులను అనుకరించిన విషయం తెలిసిందే. చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన -
కుమార్తె చాలెంజ్.. మంచు విష్ణు కొత్త అవతారం
దేశాన్ని ఏలే రాజైనా తల్లికి బిడ్డే అనేది పెద్దలు చెప్పే మాట. అలానే ఎంత గొప్ప స్థితిలో ఉన్న వారైనా సరే తమ కడుపున పుట్టిన బిడ్డల దగ్గర సామాన్యులే. బయట వీరి మాటకు ఎదురు చెప్పే వారుండరు.. ఇక ఇంట్లో కడుపున పుట్టిన బిడ్డల మాటకు వీరు కట్టు బానిసలు. హీరో మంచు విష్ణు కూడా ఇదే కోవలోకి వస్తారు. బిడ్డల కోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. గతేడాది లాక్డౌన్ విధించిన నాటి నుంచి విష్ణు గడ్డం పెంచుతున్నారు. అయితే ఈ గడ్డం ఆయన పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను కూడా తెగ విసిగిస్తుందట. దాంతో విష్టు కుమార్తె అరియాన ఈ సమస్య గురించి తన తాత మోహన్‌బాబుకు ఫిర్యాదు చేసింది. మా నాన్న గడ్డం తీస్తే.. నేను నెల రోజుల పాటు తన మాట వింటాను అని తన తాతయ్య సమక్షంలో విష్ణుకు చాలెంజ్ చేసింది. కుమార్తె విసిరిన చాలెంజ్‌ని స్వీకరించారు విష్ణు. ‘‘నా కుమార్తె ఇంత వరకు నా మట వినలేదు.. అలాంటిది నెల రోజుల పాటు నేను ఏం చెప్తే అది వింటానని ప్రామిస్ చేసింది. తనకే కాదు.. ఇంట్లో వాళ్లందరికి నా గడ్డం తెగ చిరాకు తెప్పిస్తుంది. అందుకే తన చాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను’’ అంటూ క్లీన్షేవ్ చేసుకున్నారు. ఇక ఈ మొత్తం సీన్‌ని ఆయన అక్క మంచు లక్ష్మి వీడియో తీశారు. షేవ్ చేసుకున్న తర్వాత విష్ణు తన చిన్న కుమార్తె కొత్త అవతారంలో ఉన్న తండ్రిని చూసి షాకవుతుంది. చివరకు పిల్లలందరు తండ్రి మీద ముద్దుల వర్షం కురిపిస్తారు. ఇక పిల్లల కోసం పొడుగాటి గడ్డం త్యాగం చేసిన విష్ణుని మోహన్‌బాబు దంపతులు అభినందిస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చదవండి: ఈ అవార్డు ఉత్సాహాన్నిచ్చింది: మంచు విష్ణు View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ఏదో సరదాగా...
‘‘లాక్డౌన్లో మా బాస్ ఏజ్ డౌన్ అయిపోయింది’’ అంటూ చిరంజీవి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దానికి కారణం రెండు రోజుల క్రితం బయటికొచ్చిన ఫొటో. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి, ‘బాగుంది’ అంటూ ఆ చిత్రదర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలిపించి, అభినందించారు చిరంజీవి. అప్పుడు చిరు, గోపీ గణేష్ దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మీసాలు లేకుండా మెగాస్టార్ క్లీన్ షేవ్‌తో కనిపించారు. లాక్డౌన్లో చిరంజీవి మేకోవర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూసినవాళ్లు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో ఒక గెటప్ ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం గురించి చిరంజీవిని ‘సాక్షి’ అడిగితే – ‘‘ఆ సినిమాకి, ఈ లుక్‌కి సంబంధం లేదు. ఏదో సరదాగా’’ అంటూ, బుధవారం దిగిన లేటెస్ట్ ఫొటోను కూడా షేర్ చేశారు. మామూలుగా షూటింగ్స్ ఉన్నప్పుడు స్టార్స్ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తారు. షూటింగ్స్ లేని సమయంలో.. ముఖ్యంగా ఇలా నెలల తరబడి షూటింగ్స్ లేకపోతే మాత్రం కొందరు వర్కవుట్స్‌కి కాస్త బ్రేక్ ఇస్తారు. బట్.. ఈ లాక్డౌన్ బ్రేక్‌లోనూ ‘వర్కవుట్స్‌కి నో బ్రేక్’ అంటున్నారు చిరంజీవి. -
గుండుతో వార్నర్....
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న అలజడి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీస్, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం ప్రజల్ని కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి సేవకు ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా మద్దతు తెలిపాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తోన్న వారికి సంఘీభావంగా వార్నర్ ట్రిమ్మర్ సహాయంతో స్వయంగా గుండు గీసుకున్నాడు. జుట్టును షేవ్ చేసుకుంటున్న వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వార్నర్... మరో ఎనిమిది మందికి ఈ చాలెంజ్‌ను విసిరాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కమిన్స్, జో బర్న్స్, స్టొయినిస్, జంపా కూడా ఉన్నారు. -
ధోని క్లీన్ షేవ్.. ఫ్యాన్స్ రియాక్షన్..!
ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తెల్ల గడ్డంతో కనిపించాడు. కానీ, వన్డే సిరీస్ అనంతరం ధోని క్లీన్ షేవ్‌తో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత స్పీనర్ అక్షర్ పటేల్ ధోనితో కలిసి దిగిన ఫొటోను తన ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశాడు. కానీ, ధోని తెల్లగడ్డం మాత్రం అభిమానులకు అంతగా నచ్చలేదని చెప్పవచ్చు. ఈ విషయంపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ధోని గడ్డంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాక తెల్లగడ్డాన్ని తొలగించండి అని ఇటీవల సలహా ఇచ్చాడు గౌతమ్. టీ20, వన్డే సిరీస్ తర్వాత ధోని ఇండియాకు చేరుకున్నాడు. గతంలోనే ధోని టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం విదితమే. సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసిన టెస్టు జట్టులో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్‌లకు స్థానం దక్కకపోవడంతో వారు కూడా ఇండియాకు వచ్చేశారు. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లు ధోనితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలో ధోని క్లీన్ షేవ్‌తో ఉన్నాడు. దీంతో అభిమానులు సంతోషంతో తెల్లగడ్డం తీసేశాడని కామెంట్స్ పెడుతున్నారు. గుడ్ లుక్.. నైస్ ఫోటో అని ఫ్యాన్స్ ఫొటోపై స్పందించారు. ఇటీవల ధోనికి సంబంధించిన రిటైర్మెంట్ ఊహగానాలకు తెరదీస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేసింది. Taking all the positivity and happiness shared with these beautiful people along with me. Adios England, until next time 👋 pic.twitter.com/boRrriKB0w — Akshar patel (@akshar2026) July 18, 2018 -
గెడ్డం గీసుకో.. లేకపోతే చచ్చిపోతా!
గెడ్డం గీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానంటూ భర్తను ఓ భార్య బెదిరించింది. అయితే, సదరు వ్యక్తి ముస్లిం మత గురువు కావడం ఇక్కడ విశేషం. దీంతో ఏం చేయాలో తెలియక యూపీలోని మీరట్ ప్రాంతానికి చెందిన అర్షద్ బద్రుద్దీన్ (36) తల పట్టుకున్నారు. తాను ఎంత చెబుతున్నా వినకుండా వేరే మగాళ్లతో స్మార్ట్ఫోన్లలో చాటింగ్ కూడా చేస్తోందని ఆయన అంటున్నారు. తన భార్యకు కౌన్సెలింగ్ ఇప్పించాలని మీరట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఒకవేళ తన భార్య ఆత్మహత్య చేసుకుంటే తనపై ఆరోపణలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్నానని, ఇస్లాం మతాన్ని పూర్తిగా పాటిస్తానని, 2001 సంవత్సరంలో పిల్ఖువా పట్టణానికి చెందిన సహానా అనే మహిళను పెళ్లి చేసుకున్నానని తన ఫిర్యాదులో బద్రుద్దీన్ చెప్పారు. గెడ్డం పెంచుకోకూడదని, బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లలా క్లీన్ షేవ్ చేసుకోవాలని తన భార్య తనను డిమాండ్ చేస్తోందని అన్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కుని వేరే మగాళ్లతో పగలు, రాత్రి అని తేడా లేకుండా చాటింగ్ చేస్తూనే ఉందని వాపోయారు. తనలాంటి మత గురువులు తప్పనిసరిగా గెడ్డం పెంచుకోవాలని నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె మాత్రం వినిపించుకోవడం లేదట. తమకు నలుగురు పిల్లులన్నారని, అయినా ఆమె మాత్రం తన పట్టు వీడటం లేదని తెలిపారు. సెల్‌ఫోన్ చాటింగ్ వద్దని తాను గట్టిగా చెబితే ఆమె ఏడుస్తోందని.. పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బద్రుద్దీన్ తెలిపారు. ఈద్ సందర్భంగా పిల్లలకు, తనకు ఆమె పాశ్చాత్య దుస్తులు కొనిస్తానందని, వద్దంటే మళ్లీ గొడవ పెట్టుకుందని చెప్పారు. ఈద్ మర్నాడు గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుందని, తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే ఆమె ఉరేసుకోడానికి ప్రయత్నిస్తోందని.. అదృష్టవశాత్తు ఆమెను కాపాడగలిగామని చెప్పారు.