హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్‌తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్‌తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.
దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్‌తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్‌స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment