moustache
-
మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్‌తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్‌తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్‌తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటి వరకు అయిదు రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రోజుకీ సగటున 20-25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. భిన్న నేపథ్యాలు, భిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం 12 రాష్ట్రల్లో యాత్ర కొనసాగనుంది. 150 రోజుల్లో ఆయన 3,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు పాల్గొని జోడో యాత్రలో జోష్ నింపుతున్నారు. వీరే కాక వేలాది మంది విద్యార్థులు, యువత, మధ్య వయస్కులు, మహిళలు, ఉద్యమకారులు.. ఇలా ఎందరో రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఒలంపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ జోడో యాత్రలో జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో కాంగ్రెస్ నాయకుడితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్‌తో మాట్లాడుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో ఇద్దరూ హర్యాన్వీ స్టైల్లో తమ మీసాలు తిప్పారు. బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్లు కూడా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహుల్, విజేందర్ సింగ్‌తో పాటు పక్కన ప్రియాంక కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है। शुक्रिया आपका...🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9 — Congress (@INCIndia) November 25, 2022 హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా నలిచారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ బాక్సర్‌గా రాణిస్తూ అనేక దేశాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు. -
Moustache Woman: నా మీసం నాకెంతో ఇష్టం.. అవే నాకు అందం!
తిరువనంతపురం: ముఖంపై అవాంఛిత రోమాలుంటేనే అసౌకర్యంగా ఫీలవుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు తొలగించేస్తుంటారు. మహిళలు నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ, కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళ తాను మాత్రం అందుకు భిన్నం అంటోంది. తన పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరిగి.. కోరమీసంలా మారిపోయింది. అయితే.. వాటిని తొలగించలేనంటోంది శైజ. మీసం లేకుండా జీవితాన్ని ఊహించలేనంటూ సమాధానమిస్తోంది. ప్రస్తుతం మీసంతో ఉన్న శైజ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేరళ కన్నూర్‌లోని కుతుపరంబకు చెందిన 35 ఏళ్ల శైజ.. తన మీసాన్ని ఎంతో ఇష్టపడుతున్నట్లు పేర్కొంటోంది. తన వాట్సాప్ స్టేటస్లలోనూ తన కోరమీసం ఫోటోలతో అలరిస్తోంది. శైజ తన ఐబ్రోస్‌ను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయిస్తున్నా.. పైపెదవి పైభాగంలో పెరిగిన మీసాన్ని మాత్రం తొలగించలేదు. ఐదేళ్ల క్రితం పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరిగి నల్లగా దట్టంగా మారాయి. అయితే.. వాటిని తొలగించకుండా అలాగే కొనసాగించాలని నిర్ణయించుకుంది శైజ. ‘మీసం లేకుండా ఉండటాన్ని ఊహించుకోలేను. కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ నేను మాస్క్ పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే అది నా ముఖాన్ని కప్పివేస్తుంది. మీసం ఉన్నందుకు అందంగా లేనని నేనెప్పుడూ బాధపడలేదు. నాకు నచ్చిందే చేస్తాను.’ అని ఓ వార్తా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీసక్కరి పేరుతో.. మీసంతో ఉన్న శైజకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతుగా నిలిచారు. ఆమె కూతురు సైతం మీసాన్ని ఎంతో ఇష్టపడుతోంది. తనపై కొందరు జోకులు వేస్తున్నారని, అలాంటి వాటిని తాను పట్టించుకోనని చెబుతున్నారు శైజ. కొందరు తనకు మీసక్కరి(మీసంతో ఉన్న మహిళ) అని పేరుపెట్టారని, అందుకే అదే పేరుతో సోషల్ మీడియాలో తన ఖాతాలు క్రియోట్ చేసినట్లు చెప్పారు శైజ. View this post on Instagram A post shared by മീശക്കാരി മീശക്കാരി (@meesakkari_) ఇదీ చదవండి: ఇంటికి రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
తన ఛాలెంజ్‌ను అధిగమిస్తే, సగం మీసంతో బరిలోకి దిగుతా..
చెన్నై: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన సహచర ఆటగాడు 'నయా వాల్' ఛతేశ్వర్ పుజారాకు ఓ ఛాలెంజ్ విసిరాడు. త్వరలో జరుగబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో పుజారా గనక ప్రత్యర్ధి స్పిన్ బౌలింగ్‌లో క్రీజ్ వదిలి బయటకు వచ్చి సిక్స్ బాదితే తాను ఆ మ్యాచ్‌లో సగం మీసంతో బరిలోకి దిగుతానని ఛాలెంజ్ విసిరాడు. తన యూట్యూబ్ ఛానల్లో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా అశ్విన్ ఈ ప్రతిపాదన తెచ్చాడు. ఒక ఆఫ్ స్పిన్నర్‌పై పుజారా ఎదురుదాడి చేయడాన్ని మనమెప్పుడైనా చూడగలమా అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు, రాథోడ్ బదులిస్తూ.. ఈ విషయంలో నేను పుజారాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని, అతని పైపు నుంచి స్పందన మాత్రం లేదని చమత్కరించాడు. వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో మొయిన్ అలీ లేదా వేరెవరైనా స్పిన్నర్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి బయటకు వచ్చి సిక్స్ బాదితే తాను సగం మీసంతో బరిలోకి దిగుతానని నవ్వుతూ ఛాలెంజ్ విసిరాడు. ఇందుకు రాథోడ్ స్పందిస్తూ..ఈ విషయాన్ని పుజారా అంత సీరియస్‌గా తీసుకుంటాడని నేనుకోను అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. -
ఎట్టకేలకు ఆయన మీసం కత్తిరించేశారు!
సియోల్: దక్షిణ కొరియాలో వివాదాలకు దారి తీసిన ‘మీసం’ బ్లేడ్ కత్తిరింపునకు బలైంది. అనేక సందర్భాల్లో విమర్శల పాలైన యూఎస్ రాయబారి హ్యారీ హారిస్ ఎట్టకేలకు తన మీసాన్ని కత్తిరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన ఆయన.. ‘‘సంతోషం. ఇప్పటికైనా ఇది పూర్తైంది’’ అని పేర్కొన్నారు. రాజధాని సియోల్‌లో నమోదయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేశానని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడానికి వీలుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా జపనీస్ మూలాలు(తల్లి తరఫున) ఉన్న రిటైర్డ్ నేవీ అడ్మిరల్ అయిన హ్యారీ హారిస్ 2018 నుంచి దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన మీసకట్టుతో అనేకసార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 1910 నుంచి 1945 వరకు కొరియా ద్వీపకల్పంలో కొనసాగిన జపాన్ వలస పాలనలోని గవర్నర్ల స్టైల్‌ను గుర్తు చేసేలా ఉన్న మీసకట్టు కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే ఏడాదిలోనే అందరికీ వ్యాక్సిన్ Glad I did this. For me it was either keep the 'stache or lose the mask. Summer in Seoul is way too hot & humid for both. #COVID guidelines matter & I'm a masked man! Enjoyed getting to know Mr. Oh & appreciated his heartfelt words about how much he values the #USROKAlliance. https://t.co/ja2WMD49Fr — Harry Harris (@USAmbROK) July 25, 2020 అయితే ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని హ్యారీ.. తన వ్యక్తిగత నిర్ణయాన్ని, శైలిని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. అదే విధంగా... ఇరు దేశాల మధ్య(జపాన్- కొరియా) ఉన్న చారిత్రాత్మక శత్రుత్వం గురించి తనకు తెలుసునని, అయితే తానిప్పుడు జపనీస్ అంబాసిడర్‌గా దక్షిణ కొరియాలో పదవి చేపట్టలేదని, అమెరికా రాయబారిగా మాత్రమే ఉన్నానంటూ వివాదానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిర్ణయం మార్చుకున్న ఆయన ఇటీవల తన మీసాన్ని కత్తిరించుకోవడం విశేషం. కాగా దక్షిణ కొరియా, జపాన్ రెండూ అమెరికా ప్రధాన మిత్ర దేశాలన్న సంగతి తెలిసిందే. అయితే చైనా, ఉత్తర కొరియాను ఎదుర్కొనే క్రమంలో ఈ రెండూ అమెరికాతో దోస్తీ కట్టినప్పటికీ.. గతంలో తమ మధ్య ఉన్న శత్రుత్వం దృష్ట్యా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ఆయన మీసాన్ని విమర్శిస్తూ కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు. (ఆంత్రాక్స్‌పై పాక్, చైనా పరిశోధనలు?) 잘한 결정이라고 생각합니다. 콧수염을 기르고 마스크까지 착용하기엔 서울의 여름은 매우 덥고 습합니다. 코로나 지침이 중요하니 마스크는 필수죠! 오 사장님을 뵙게 되어 반가웠고 #한미동맹 을 중요하게 생각해주셔서 매우 감사했습니다. https://t.co/pqfIQshM2g — Harry Harris (@USAmbROK) July 25, 2020 -
650మందికి ఉచితంగా ‘అభినందన్ హెయిర్‌కట్’
బెంగళూరు : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హెయిర్ డిజైనర్ ననేష్ ఠాకూర్ ఏకంగా 650 మందికి ఉచితంగా అభినందన్‌ను పోలిన జుట్టు, మీసాలు కత్తిరించి సంచలనం సృష్టించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది. ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని నా సెలూన్లో ఒక రోజంతా ఉచితంగా అభినందన్ హెయిర్‌స్టైల్ చేయాలని భావించాను. యువతలో దేశ భక్తిని పెంపొందించి.. వారిని డిఫెన్స్ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సాహించేందుకుగాను ఇలా చేశాను’ అంటూ చెపుకొచ్చారు. ఇదిలా ఉండగా బొమ్మనహళ్లికి చెందిన ఓ సేల్స్‌మెన్ చాంద్ మహ్మద్ అభినందన్‌కు వీరాభిమాగా మారాడు. దాంతో ఆయన లాగా మీసాలను సెట్ చేయించుకున్నాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘అభినందన్ రియల్ హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయనలాగా నా మీసాలు సెట్ చేయించుకున్నాను’ అని తెలిపారు. Wing Commander #AbhinandanVarthaman's moustache style getting popular. A Bengaluru local Mohammed Chand says,' I'm his fan, we follow him. I like his style. He is the real hero; I'm happy.' pic.twitter.com/cT7QGXntMs — ANI (@ANI) March 3, 2019 -
అభి మీసం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలకు ఇప్పుడు బాగా ప్రాచుర్యం ఏర్పడింది. అదొక ‘అభినందన్ బ్రాండ్’గా, భూషణంగా మారిపోయింది. దేశంలోని అనేక మంది యువకులు ఆ తరహా గడ్డం, మీసాలను ఇష్టపడుతున్నారు. తాము కూడా ఆయనలా మీసకట్టు పెంచుతామని అంటున్నారు. అభినందన్ గడ్డం, మీసాల స్టైల్‌పై సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాఖ్యలు, చర్చలు నడుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్–21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం, ఆయనను ఆ దేశ ఆర్మీ తొలుత బంధించి అనంతరం శుక్రవారం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉన్న అభినందన్ తన క్షేమ వివరాలు చెబుతున్న వీడియో గత బుధవారం బయటకొచ్చినప్పటి నుంచి ఆయనకు దేశంలో క్రేజ్ పెరిగిపోయింది. అభినందన్ గురించి, పాకిస్తాన్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ఒక్కో వివరం బయటకొచ్చే కొద్దీ అందరిలో ఆసక్తి ఎక్కువైంది. ఆయన తెగువను మెచ్చిన భారత ప్రజలు ఇప్పుడు ఆయన ‘తమిళ’ స్టైల్‌ను అనుసరించాలనుకుంటున్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ఓ పోస్ట్ చేస్తూ ‘అభినందన్‌కు ఉన్నటువంటి మీసాలు నాకూ కావాలి. జయహో’ అని పేర్కొన్నారు. ‘మొత్తం భారత దేశంలో తర్వాతి స్టైల్ సంచలనంగా అభినందన్ మీసాలు ఉండబోతున్నాయి. ఈసారి మీరు క్షౌ ర శాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యక్తి మిమ్మల్ని అభినందన్ స్టైల్ కావాలా? అని అడిగితే ఆశ్చర్యపోకండి’ అని మరొకరు ట్విట్టర్లో రాశారు. ముందుగా గుర్తొచ్చేది మీసాలే.. అభినందన్‌ను ఎవరైనా గుర్తుపట్టేది ముందుగా ఆయన మీసాలతోనేనని బ్రాండ్ వ్యూహకర్త రమేశ్ తహిలియాని అంటున్నారు. ‘దేశభక్తి, ఇతర ఉద్రేకాలు ప్రస్తుతం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్ల్లో అభినందన్‌ను చూసిన వారిని మీరు అడగండి. ఆయనను తలచుకుంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే అత్యధిక శాతం మంది ఆయన గడ్డం, మీసాలేనంటారు. ఆయన చూపిన ధైర్య సాహసాలే ఇప్పుడు ఆ స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఇదంతా తాత్కాలిక హాంగామానేననీ, ఆయన స్టైల్ ఇకపై ఫ్యాషన్‌గా మారుతుందా, లేదా అనే విషయాన్ని కాలమే చెబుతుందని తహిలియాని పేర్కొన్నారు. మరో బ్రాండ్ నిపుణుడు మాట్లాడుతూ ‘అభినందన్ మీసాలు ఆయన చెక్కిళ్లపైకి వ్యాపించి ఉంటాయి. ఆకాశంలో ఎంతో నైపుణ్యంతో విమానం విన్యాసాలు చేసిన గుర్తుల్లా అది ఉంటుంది. ఆ స్టైల్‌ను ఇప్పుడు ఎంతోమంది కావాలనుకుంటున్నారు’ అని అన్నారు. -
ప్రపంచ గడ్డాలు,మీసాల ఛాంపియన్షిప్
-
నిరూపిస్తే సగం మీసం తీసుకుంటా...
-
మీసం తీసేస్తా!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేస్తా అని డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం సవాల్ చేశారు. న్యాయమూర్తి తీర్పును తప్పుబట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ తన నియోజకవర్గం రిషి వందియంలో గురువారం పర్యటించారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, పనులను పరిశీలించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పోలీసు శాఖకు, అన్నాడీఎంకే వర్గాలకు సవాళ్ల మీద సవాళ్లను విసిరారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్ట పడి పనిచేసి, ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. బతికేందుకు తనకు అనేక మార్గాలు ఉన్నాయని వివరించారు. అయితే, ఇక్కడ పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలను నీచాతి నీచంగా చూసినందుకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ఓ మారు గుర్తు చేసుకోండంటూ పరోక్షంగా అన్నాడీఎంకే వర్గాలకు చురకలంటించారు. ధర్మం గెలిచిందని, అందుకే బెయిల్ రావడం లేదని వ్యాఖ్యలు చేస్తూ, ఇక జయలలితకు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి జైలు శిక్ష తప్పదని, ఇందుకు జయలలిత కేసు ఓ హెచ్చరికగా పేర్కొన్నారు. తమ అమ్మ జైల్లో ఉందని మంత్రులందరూ తెగ ఏడ్చేస్తున్నారని, అలాంటప్పుడు అమ్మ బయటకు వచ్చాకే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కారుస్తూనే పదవుల్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే నా సవాల్: పాలకుల తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత, విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయన్నారు. అయితే,ప్రతి పక్షాల గొంతు నొక్కే విధంగా కేసుల మోతలు మోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలు ద్విముఖాలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయో సరి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం లక్ష్యంగా వ్యవహరిస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవర్నీ దోచుకోలేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేయలేదని పేర్కొంటూ, ఇవన్నీ చేసిన వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇది వరకు ఉన్న పాలకులు టీవీలను ఇచ్చారని, ఇప్పుడున్న వాళ్లు కంప్యూటర్లు ఇచ్చారని గుర్తు చేస్తూ, వాటిలో మైకెల్ డీ గున్హ ఇచ్చిన తీర్పును ప్రజలు చూసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. పోలీసు యంత్రాంగం మనస్సాక్షితో పనిచేయాలని, వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పాత కాలపు చట్టాలు చేతిలో పెట్టుకుని ప్రతి పక్షాల్ని బెదిరించడం మానుకుని నిబద్ధత, నిజాయితీతో పనిచేయాలని కోరారు. జయలలిత ఏ తప్పూ చేయలేదని, ఆమె నిర్దోషి అంటూ మైకెల్ డీ గున్హ తీర్పును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వేళ ఆమె తప్పు చేయకుంటే, బెయిల్ వచ్చి ఉండేదిగా అని ప్రశ్నించారు. ఆమె తప్పూ చేయలేదని పోలీసు యంత్రాంగం కానీ, అన్నాడీఎంకే నాయకులు కానీ నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేసి తిరుగుతాననని సవాల్ చేశారు. -
మీసం కోసం.. చెవి పోగొట్టుకున్నాడు!!
మీసం గురించి జరిగిన గొడవలో.. ఓ మాజీ సైనికుడు తన చెవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన పాట్నా జిల్లాలో జరిగింది. నంకు, బీనాయాదవ్ అనే ఇద్దరు సోదరులు, స్నేహితులు, ఇరుగుపొరుగులు కలిసి రామానుజ్ వర్మ ఎడమ చెవిని కోసేశారని పోలీసులు తెలిపారు. ముందురోజు రాత్రి వాళ్లంతా కలిసి మద్యం సేవించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి ఎన్నాళ్లుగానో రామానుజ్ వర్మ ఇష్టంగా పెంచుకుంటున్న మీసం గురించి అతడిని ఏడిపించారు. ఆర్మీలో రిటైరైన తర్వాత తాను చేస్తున్న పని నుంచి తిరిగి కౌరియా గ్రామంలోని ఇంటికి వెళ్లతుండగా మళ్లీ సోదరుల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇద్దరు సోదరులు కలిసి రామానుజ్ ఎడమచెవిని పదునైన ఆయుధంతో కోసేశారు. దీనిపై వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు. అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులిద్దరూ సంఘటన జరిగినప్పటినుంచి పరారీలో ఉన్నారు. వాళ్లకోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మీసాలా.. గోపాలా..
-
హృదయం: మృతుడికో లేఖ
మీసాలు మొలిచి, ఆరోగ్యంగా ఉన్న యువకుడు ఎవరైనా యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోతే, వింతగా చూసిన కాలమది. ఒక్క ఇంగ్లండ్‌లోనే కాదు, యూరప్ ఖండమంతటా ఇదే ధోరణి కనిపించింది. అందుకే మార్టిన్ అనివార్యంగా యుద్ధరంగానికి వెళ్లిపోయాడు. యుద్ధభూమిలో ఒలికిన ప్రతి రక్తపు బిందువుకు ఓ కథ ఉంటుంది. ఇంకెక్కడో జారిన కన్నీటి బిందువులో ఆ కథ నిక్షిప్తమై ఉంటుంది. విలియం మార్టిన్, ఎమిలీ చిట్టిక్స్ కథ ఇందుకు ఉదాహరణ. మొదటి ప్రపంచ యుద్ధంలో చిందిన ఓ నెత్తుటి బిందువు మార్టిన్. ఎమిలీ కనుకొనలలోని బాష్పకణం ఆ జ్ఞాపకాన్ని కొన్ని దశాబ్దాల పాటు బాధగా, భద్రంగా దాచుకుంది. ‘వృద్ధులు యుద్ధం ప్రకటిస్తారు. అందులో యువకులు మరణిస్తారు’ అన్నది పాశ్చాత్యుల నానుడి. గ్రేట్‌వార్ అని పిలిచే మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన పది లక్షల మందిలో నూనూగు మీసాల యువకులే ఎక్కువ. చరిత్రకారులు ఈ మహా యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలను చెప్పారు. ఇంకా చెప్పవలసి ఉంది- యుద్ధంతో అర్ధంతరంగా ముగిసిపోయిన ప్రేమగాథల గురించి కూడా. విలియం మార్టిన్ ఇంగ్లండ్ తరఫున డెవన్షైర్ రెజిమెంట్‌లో చేరిన ప్రైవేటు సైనికుడు. యుద్ధమంత్రి కిష్నర్ పిలుపును అందుకుని అనేక మంది స్వచ్ఛందంగా యుద్ధం చేయడానికి వెళ్లారు. వాళ్లే ప్రైవేటు సైనికులు. ఎమిలీ చిట్టిక్స్ అనే ఒక యువతిని మార్టిన్ మొదటిసారి యుద్ధ సమయంలోనే 1916 ఆగస్టులో కలుసుకున్నాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం మేరకే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఆ సంవత్సరం అక్టోబర్‌లో ఆ వేడుక జరుపుకోవాలని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇంతలోనే మార్టిన్ యుద్ధంలో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లవలసి వచ్చింది. మీసాలు మొలిచి, ఆరోగ్యంగా ఉన్న యువకుడు ఎవరైనా యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోతే, వింతగా చూసిన కాలమది. ఒక్క ఇంగ్లండ్‌లోనే కాదు, యూరప్ ఖండమంతటా ఇదే ధోరణి కనిపించింది. అందుకే మార్టిన్ అనివార్యంగా యుద్ధరంగానికి వెళ్లిపోయాడు. మార్టిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్, బెల్జియం మధ్య ఉన్న పశ్చిమ యుద్ధరంగానికి వెళ్లాడు. యుద్ధరంగం నుంచి తమ తమ కుటుంబ సభ్యులకి సైనికులు ఉత్తరాలు రాసేవారు. ఇవే కొన్ని లక్షలు ఉన్నాయి. ఇంపీరియల్ వార్ మ్యూజియం వీటిలో చాలా వాటిని ఇప్పటికీ భద్రపరిచి ఉంచింది. భార్యలకు రాసిన ఉత్తరాలు కొన్నయితే, ప్రేయసులకు రాసుకున్న ఉత్తరాలు కొన్ని. మార్టిన్, ఎమిలీ మధ్య కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఎమిలీ, మార్టిన్ మధ్య ఎలాంటి ప్రేమ ఉండేదో ఆ ఉత్తరాలు చెబుతాయి. యుద్ధం కలిగించే భయం, యుద్ధవార్తలు రేపిన కలవరం, యుద్ధం తరువాత రాబోయే కల్యాణ ఘడియల మీద ఆశ ఆ లేఖల నిండా కనిపిస్తాయి. ‘నా ప్రియమైన ఎమిలీ! నీ కోసం ఈ కొన్ని వాక్యాలు రాస్తున్నాను. నేను ప్రస్తుతానికి సురక్షితమైన చోటే, క్షేమంగా ఉన్నాను. నా ఎమిలీ! నీవూ క్షేమమని తలుస్తాను. నీవు రాసిన ఉత్తరం ఇప్పుడే అందుకున్నాను. అది ఎంత సంతోషం నింపిందో తెలుసా! ఈ లేఖ ఎంత తొందరగా వచ్చేసిందో! నాకు చేరడానికి ఐదు రోజులే పట్టింది. నీవు అక్కడ, నేను ఇక్కడ... నిజానికి ఈ ఎడబాటు ఎక్కువ కాలం ఉండదు. హృదయ పూర్వక ప్రేమతో, ముద్దులతో నీ మధుర ప్రేమ మూర్తి విల్’ (విలియం). అని ఫ్రాన్స్ నుంచి, 24 మార్చి, 1917న రాశాడు. ఈ లేఖకి ఎమిలీ మార్చి 29, 1917న జవాబు రాసింది. క్షేమ సమచారాలు అయ్యాక ఆమె ఈ వాక్యాలు రాసింది. ‘నీవు తరుచు ఉత్తరాలు రాయగలిగే స్థితిలో లేవని నేను అర్థం చేసుకోగలను. ఇకపై నీవు రాసే ఉత్తరాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడవలసి ఉంటుందని కూడా తెలుసు.....కానీ నీ దగ్గర నుంచి ఉత్తరం వస్తే అదే నాకు గొప్ప సాంత్వన... నీ ప్రేమకు నోచుకున్న చిన్న అమ్మాయి (అప్పటికి ఎమిలీ వయసు ఇరవై). కానీ ఈ ఉత్తరానికి ఎంతకాల ం ఎదురు చూసినా జవాబు రాలేదు. మళ్లీ ఒక ఉత్తరం రాసిందామె. నెలలు గడచిపోతున్నా జవాబు రాలేదు. ఆ నిరీక్షణలోనే ఐదు ఉత్తరాలు రాసి పోస్టు చేసింది. ఎందుకో మరి మార్చిలో అందుకున్న లేఖ తరువాత ఎమిలీ ఎర్ర సిరాతో ఉత్తరాలు రాయడం మొదలు పెట్టింది. ఒకరోజు హఠాత్తుగా ఐదు ఉత్తరాలు వచ్చాయి. అయితే అవన్నీ తాను మార్టిన్‌కు రాసినవే. తిరిగి వచ్చేశాయి. అందులో చివరి ఉత్తరం మీద ఒక వివరణ- ‘మార్టిన్ యుద్ధంలో చనిపోయాడు’. ఫ్రాన్స్ నుంచి మార్టిన్ మార్చి 24న ఉత్తరం రాసిన మూడో రోజునే యుద్ధంలో స్నైపర్ గన్‌కు బలయ్యాడు. మార్టిన్ యుద్ధంలో చనిపోయినా, అతడిని ఎక్కడ సమాధి చేసినదీ తెలియలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇదొక విషాదం. చాలామందికి తమ కుటుంబ సభ్యుల మరణ వివరాలు కూడా సకాలంలో అందలేదు. మార్టిన్ మరణవార్త ఎమిలీని కలచివేసింది. ఆమె మరో వివాహం చేసుకోలేదు. 1974 వరకు మార్టిన్ జ్ఞాపకాలతోనే ఉండిపోయింది. ఆ సంవత్సరం ఆమె మరణించిన తరువాత ఆమె కాగితాలు వెతికితే మార్టిన్ రాసినవీ, తిరిగొచ్చిన లేఖలూ దొరికాయి. ఈ ఉత్తరాలతో మరో చిన్న ఉత్తరం కూడా ఉంది. తనను ఖననం చేసే సమయంలో ఆ ఉత్తరాలన్నీ తన శవ పేటికలో వేయవలసిందని ఆమె తుది కోరిక కోరింది. కుటుంబ సభ్యులు అలాగే చేశారు. కాలం మీద యుద్ధం మిగిల్చే విషాద ఛాయ ఎంత దీర్ఘమో! - గోపరాజు నారాయణరావు -
రికార్డ్ : మీసాల రాయుడి సలహాలు!
రామ్‌సింగ్ చౌహాన్.. తన మీసం పొడవుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న వ్యక్తి. 4.29 మీటర్లు లేదా 14 అడుగుల పొడవున్న మీసంతో చౌహాన్ గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. దాంతో మీడియా చౌహాన్ వెంట వెంటే తిరుగుతోంది. మీసాలు అంత పొడవుగా పెంచడం ఎలా? అని అడుగుతోంది. టెక్నిక్స్ చెప్పమని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతానికి మీసం పొడవు విషయంలో చౌహాన్‌ను బీట్ చేసే వారు కూడా ఎవరూ దరిదాపుల్లో లేకపోవడంతో చౌహాన్ కూడా ‘మీసం పెంచడం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశం గురించి విపులంగా చెబుతున్నాడు. ముందుగా పొడవాటి మీసం పెంచాలని అనుకునే వారు టీనేజీ నుంచే మీసం మీద ప్రత్యేక దృష్టిపెట్టి ఉండాలట. యవ్వనంలో ఉన్నప్పుడు హార్మోన్లకు మంచి శక్తి ఉంటుందని, మీసం సులభంగా పెరిగే అవకాశాలుంటాయని చౌహాన్ అంటున్నాడు. ఇక తరచూ మీసాలకు మసాజ్ అవసరమని.. ఈ విషయంపై చాలా శ్రద్ధ వహించాలని సూచించాడు. అన్నింటికీ మించి మీసం ఇంట్లో వాళ్లకు అడ్డం కాకూడదని.. ప్రత్యేకించి పెళ్లైన వారు తమ భార్య పర్మిషన్ తీసుకొని, ఆమె ఇష్టపడితేనే మీసం పెంచితే పద్ధతిగా ఉంటుందని ఈ మీసాల రాయుడు సూచిస్తున్నాడు. చౌహాన్ సూచనలను ప్రఖ్యాత వార్త సంస్థ బీబీసీ కూడా తన వెబ్సైట్లో ఉంచడం విశేషం !