
చెన్నై: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన సహచర ఆటగాడు 'నయా వాల్' ఛతేశ్వర్ పుజారాకు ఓ ఛాలెంజ్ విసిరాడు. త్వరలో జరుగబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో పుజారా గనక ప్రత్యర్ధి స్పిన్ బౌలింగ్‌లో క్రీజ్ వదిలి బయటకు వచ్చి సిక్స్ బాదితే తాను ఆ మ్యాచ్‌లో సగం మీసంతో బరిలోకి దిగుతానని ఛాలెంజ్ విసిరాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా అశ్విన్ ఈ ప్రతిపాదన తెచ్చాడు.
ఒక ఆఫ్ స్పిన్నర్‌పై పుజారా ఎదురుదాడి చేయడాన్ని మనమెప్పుడైనా చూడగలమా అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు, రాథోడ్ బదులిస్తూ.. ఈ విషయంలో నేను పుజారాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని, అతని పైపు నుంచి స్పందన మాత్రం లేదని చమత్కరించాడు. వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో మొయిన్ అలీ లేదా వేరెవరైనా స్పిన్నర్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి బయటకు వచ్చి సిక్స్ బాదితే తాను సగం మీసంతో బరిలోకి దిగుతానని నవ్వుతూ ఛాలెంజ్ విసిరాడు. ఇందుకు రాథోడ్ స్పందిస్తూ..ఈ విషయాన్ని పుజారా అంత సీరియస్‌గా తీసుకుంటాడని నేనుకోను అంటూ నవ్వుతూ బదులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment