
బెంగళూరు : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హెయిర్ డిజైనర్ ననేష్ ఠాకూర్ ఏకంగా 650 మందికి ఉచితంగా అభినందన్‌ను పోలిన జుట్టు, మీసాలు కత్తిరించి సంచలనం సృష్టించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తుంది. ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని నా సెలూన్‌లో ఒక రోజంతా ఉచితంగా అభినందన్ హెయిర్‌స్టైల్ చేయాలని భావించాను. యువతలో దేశ భక్తిని పెంపొందించి.. వారిని డిఫెన్స్ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సాహించేందుకుగాను ఇలా చేశాను’ అంటూ చెపుకొచ్చారు.
ఇదిలా ఉండగా బొమ్మనహళ్లికి చెందిన ఓ సేల్స్‌మెన్ చాంద్ మహ్మద్ అభినందన్‌కు వీరాభిమాగా మారాడు. దాంతో ఆయన లాగా మీసాలను సెట్ చేయించుకున్నాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘అభినందన్ రియల్ హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయనలాగా నా మీసాలు సెట్ చేయించుకున్నాను’ అని తెలిపారు.
Wing Commander #AbhinandanVarthaman's moustache style getting popular. A Bengaluru local Mohammed Chand says,' I'm his fan, we follow him. I like his style. He is the real hero; I'm happy.' pic.twitter.com/cT7QGXntMs
— ANI (@ANI) March 3, 2019
Comments
Please login to add a commentAdd a comment