laborers
-
చి‘వరి’కి పొరుగు కూలీలే దిక్కు
సాక్షి, పెద్దపల్లి: యాసంగి సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పల్లెల్లో కూలీల కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వలస కూలీలను తీసుకొస్తున్నారు. స్థానిక కూలీలకు రెట్టింపు కూలి చెల్లిస్తేనే వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ మేరకు స్థానిక మహిళలకు రూ.500 నుంచి రూ.600, పురుషులకు రూ.1,000 వరకు కూలి చెల్లిస్తున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు కూలి చెల్లించాల్సి రావడంతో అన్నదాతలపై పెట్టుబడి పెరుగుతోంది.పొలాలు దూరంగా ఉండడంతో.. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం, అదనంగా అల్పాహారం, టీ సమకూర్చడం రైతులపై ఆర్థిక భారానికి కారణమవుతోంది. మరికొన్నిచోట్ల పురుషులకు ఇతర ఖర్చుల కింద రూ.100 చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎకరాలో వరి నాట్లు వేసేందుకు రూ.4,000 – రూ.4,500 వరకు ఖర్చు ఉండేది. ప్రస్తుతం రూ.6 వేలకు పైగా అవుతోంది. అదికూడా కేవలం కూలీలకు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. స్థానిక మహిళలకు రూ.5,500 చొప్పున.. ఎకరాలో వరి నాట్లు వేసేందుకు గంపగుత్తకు ఇస్తున్నా.. అదనంగా నారు పంచేందుకు రూ.1,000తో పురుషులను ఏర్పాటు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అదే వలస కూలీలకు.. వరి నాట్ల బాధ్యత గంపగుత్తకు ఇస్తే.. ఎకరాకు రూ.5,500తోనే మొత్తం పనులు చూసుకుంటున్నారు. దీంతో అదనపు భారం తగ్గడంతోపాటు, తక్కువ సమయంలోనే నాట్లు పూర్తవుతున్నాయి. ఫలితంగా రైతులు పక్కరాష్ట్రాల కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.యంత్రాలు, వలస కూలీలే ఆధారం..కూలీల కొరతతో రైతులు వరినాట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు అన్నదాతలు కొన్నేళ్లుగా వలస కూలీలు, యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాల కొరతతోపాటు కొన్ని నేలల్లో నాట్లు వేసే పరిస్థితి లేక.. మనుషులతో నాట్లు వేయిస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులు వలస కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. కోల్‌కతా, మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు జిల్లాకు వలస వస్తున్నారు. కొంతమంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకొని.. రైతుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు.వలస కూలీలకు డిమాండ్జిల్లాలో ఈ యాసంగిలో 2,04,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, 1,91,351 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా సిద్ధం చేశారు. వలస కూలీల గ్రూపులుగా వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తుండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. నాట్లు వేసేందుకు ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న గ్రామాల్లో రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క తేదీ ఇస్తూ బుక్ చేసుకొని వరి నాట్లు వేస్తున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రోజూ రూ.2 వేలు వస్తాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తాం. నాకు రోజూ రూ.2 వేల కూలి గిట్టుబాటవుతుంది. ప్రతీ సీజన్లో రెండునెలలు ఇక్కడే మాకు పనులు దొరకుతాయి. రైతులు బాగా చూసుకుంటున్నారు.– బబుల్, కూలీ, కోల్కత్తాపది రోజులైంది వచ్చి..నేను కోల్కత్తా నుంచి వచ్చి పదిరోజులైంది. తెల్లారగానే పంట పొలాల్లోకి వెళ్తాం. రాత్రి వరకూ నాట్లు వేస్తాం. అందరం కలసికట్టుగానే ఉంటాం. ఇక్కడి వారికంటే మంచిగా నాట్లు వేస్తాం. మా రాష్ట్రంలో పనులు లేవు. –మంగళ్, కూలీ, కోల్కత్తామంది కూలీలను తీసుకొస్తా.. యాసంగి, వానాకాలంలో వరినాట్ల కోసం ఏటా పశ్చిమబెంగాల్, కోల్కత్తా నుంచి సుమారు 560 మందికి కూలీలను తీసుకొస్తా. రైతులకు ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ఎనిమిదేళ్లుగా ఏటా ఇలాగే చేస్తున్నా.– కసిరెడ్డి మల్లారెడ్డి, ఏజెంట్, గుండ్లపల్లి -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
మహిళా కూలీలకు నోటీసులు
రామచంద్రపురం రూరల్ : వ్యవసాయ కూలీలకు అందులోనూ మహిళలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ అంశం రామచంద్రపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజువారీ కూలిపని చేసుకునే మహిళలకు మంత్రి నోటీసులు పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉందని.. మంత్రి చేసిన పని సరైంది కాదని వారంటున్నారు. వివరాలివీ..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని తాళ్లపొలెం గ్రామ సర్పంచ్ కట్టా గోవిందుకు, ఆయన ఆడపడుచులకు కొంతకాలంగా 2.40 ఎకరాల పంట భూమి విషయమై కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టులో వివాదం సాగుతున్నప్పటికీ సర్పంచ్ కట్టా గోవిందు స్వాధీనంలోనే భూమి ఉంది. ఆయనే పంటలు పండించుకుంటున్నారు. అదే భూమిలో కొంతభాగం ఇటీవల మంత్రి అనుచరుడు దొంగల శ్రీధర్, అతని భార్య దొంగల సునీత పేరున రిజిస్టర్ అయ్యింది. ఇటీవల సర్పంచ్ గోవిందు పంట కోసుకోగా దానిపై ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కట్టా గోవిందు, అతని సోదరి జానకమ్మ, మేడిశెట్టి ఇజ్రాయేలుతో పాటు 8 మంది వ్యవసాయ కూలీలు అందులోనూ మహిళలపై అక్రమంగా పంట కోసుకుపోయారని ఒక కేసు నమోదైంది. దీనిపై గతనెల 24న రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమక్షంలో అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎవరైతే పోలీసు కేసులో ఉన్నారో అదే వ్యవసాయ కూలీలకు మంత్రి సుభాష్ లీగల్ నోటీసులు పంపారు. వారు మీడియాతో మాట్లాడటంవల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ఇచ్చిన ఆ నోటీసులను చూసి కూలీలు లబోదిబోమంటున్నారు. తమను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సుభాష్‌ను వారు కోరుతున్నారు. -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
ఉసురు తీసిన ముసురు
చేతిలో కొడవలి.. నెత్తిన కండువా.. ముఖంలో ఆందోళనతో 9 మంది కూలీలు ఏ చేలోనైనా చిన్న పని దొరుకుతుందేమోనన్న ఆశతో సోమవారం కృష్ణా జిల్లా చోడవరం–పెనమలూరు రోడ్డు పక్కనున్న పొలాల వైపు ఆశగా చూస్తూ వెళ్తున్నారు. ఎటు చూసినా వర్షాలు, వరదలకు దెబ్బ తిన్న పొలాలే కనిపిస్తున్నాయి. రైతే దెబ్బ తిన్నాక కూలీలకు పనిచ్చేదెవరు? ఆ కూలీల కుటుంబాల కడుపు నింపేదెవరు? ఆ ఆవేదనే వారి మాటల్లో ప్రతిధ్వనించింది. పది రోజులుగా పని లేదని, ఇంటిల్లిపాదీ ఆకలితో ఆలమటిస్తున్నామని వారు ‘సాక్షి’ ప్రతినిధి వద్ద బోరుమన్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఉపాధిని దెబ్బతీశాయని, ప్రభుత్వమూ ఆదుకోవడంలేదని, ఎన్నెన్నో అవస్థలు పడుతున్నామని వివరించారు. దాదాపు ఐదు వేల జనాభా కలిగిన చోడవరం గ్రామంలో 750 మంది వ్యవసాయ కూలీలు, 60 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వీరే కాదు.. రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలకు లక్షలాది బడుగు జీవులు బతుకుదెరువు కోల్పోయారు. పనుల్లేక ఇంటికే పరిమితమైన వ్యవసాయ కూలీలు.. ఇసుక లేక, వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు.. మగ్గం గుంటల్లోకి నీరు చేరి నేతన్నల అగచాట్లు.. తాటి చెట్లు తడిసిపోయి దెబ్బతిన్న గీత కార్మికులు.. పల్లె కన్నీరు పెడుతున్న తీరుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది..పది లక్షల మందికి పనుల్లేవువిజయవాడలో వరదలతోపాటు గుంటూరు, బాపట్ల, ఎనీ్టఆర్, కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు వ్యవసాయ కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, మిర్చి, పసుపు, కంద పంటలు, ఆక్వా కల్చర్ç పనులపై ఆధారపడిన లక్షలాది వ్యవసాయ కార్మికులు రోజువారీ పనులను కోల్పోయారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.10 కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. వారిలో 10 లక్షల మందికిపైగా కార్మికులు వర్షాల వల్ల పనుల్లేక పస్తులుంటున్నారు. రోజూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే కానీ గడవని ఈ కుటుంబాల్లో ఇప్పుడు ఒక్కరికి కూడ పని దొరకడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూలీల ఉపాధి దెబ్బతింది. పది రోజులుగా పనుల్లేక అవస్థలు పడుతున్న ప్రతి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు సాయం అందించాలని, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత వృత్తికి చేటురాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షలకుపైగా కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడ్డాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన తాటి చెట్లు ఎక్కేందుకు వీలు కాకపోవడంతో గీత వృత్తి నిలిచిపోయింది. వేలాది గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు.భవన నిర్మాణ రంగం కుదేలుకూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అస్తవ్యస్థంగా మారడంతో భవన నిర్మాణ రంగం దెబ్బ తింది. దీనికితోడు ఇప్పుడొచి్చన వర్షాలు, వరదలకు ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగం మరింతగా కుదేలైంది. రాష్ట్రంలో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 31 లక్షల మందికిపైగా కార్మికుల జీవనాన్ని దెబ్బతీసింది. విజయవాడలో వరద తాకిడికి అతలాకుతలమైన ప్రాంతాల్లోనే 20 వేల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు కట్టుబట్టలతో మిగిలి, ఆహారం కోసం అలమటిస్తున్నారు.నేతన్న అగచాట్లు.. వర్షాలు, వరదలకు చేనేత కుటుంబాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో సుమారు 1.60 లక్షల మగ్గాలు ఉన్నట్టు అంచనా. పది రోజులుగా పడుతున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని నేత మగ్గాల కుంటల్లోకి నీరు చేరింది. దీంతో చేనేత కార్మికుల జీవనం స్తంభించింది. వేలాది నేతన్నల కుటుంబాలు అవస్థల పాలయ్యాయి.శ్రీకాకుళం నుంచి వలసొచ్చాం కొన్నేళ్ల క్రితమే 450 కుటుంబాల వాళ్లం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వలసొచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాయి. ఎక్కడ కూలి పని ఉంటే అక్కడకు వెళ్తుంటాం. నేను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చాను. మేస్త్రీగా పది మందిని పనులకు తీసుకెళ్తున్నాను. వర్షాల వల్ల పది రోజులుగా పనుల్లేవు. మా కుటుంబాలన్నీ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. – వడ్డేపల్లి భాస్కరరావు, మేస్త్రీకూలికెళితేనే రోజు గడిచేది వ్యవసాయ పనులకు వెళితేనే మాకు రోజు గడిచేది. ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహా్నం 1గంటకు వస్తాం. రోజు కూలీ రూ.450 ఇస్తారు. ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు చెల్లించాలి. ఇద్దరు ఆడ పిల్లలు. నేను, నా భార్య ఇద్దరం కష్టపడితేనే మాకు నెల భారంగా గడుస్తుంది. అలాంటిది పది రోజులుగా పనుల్లేకఅవస్థలు పడుతున్నాం. – మడల సీతారామయ్య, చోడవరంవర్షాలతో మగ్గం నేతకు ఇబ్బందులే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేనేత మగ్గాల కుంటల్లో వర్షం నీరు చేరి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మగ్గాల కుంటల్లో నీరు చేరితో దాన్ని బయటకు తోడి ఆరిన తర్వాతే మళ్లీ పని మొదలు పెట్టాలి. ఇందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఇన్ని రోజులూ చేనేత కార్మికులు పస్తులుండాల్సిందే. మగ్గం కుంటల్లో నీరు చేరి కొందరు, పడుగు తడిసి పాడైపోయి మరికొందరు, నేత నూలు మొత్తబడిపోయి ఇంకొందరు నేత నేసేందుకు అవకాశం లేక ఉపాధి కోల్పోయారు. – పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత నాయకుడు -
మోదీ ప్రమాణ స్వీకారానికి ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులు, కూలీలు
న్యూఢిల్లీ: మోదీ ప్రమాణ స్వీకారానికి భిన్న వర్గాల ప్రజలు హాజరయ్యారు. ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులతోపాటు నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు సైతం హాజరుకావడం విశేషం. ప్రమాణ స్వీకారం కంటే ముందు ట్రాన్స్జెండర్లను కేంద్ర మాజీ మంత్రి వీరేంద్ర కుమార్, పారిశుధ్య కార్మికులను బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెకావత్ ఘనంగా సత్కరించారు. ‘సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అంటూ ప్రధాని మోదీ ఇచి్చన పిలుపును అందిపుచ్చుకుంటూ ట్రాన్స్జెండర్లను సత్కరించినట్లు వీరేంద్ర కుమార్ తెలిపారు. -
మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్‌తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్‌తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్‌తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాట్లేస్తాం.. వరి నాట్లేస్తాం..
నిర్మల్: జిల్లాలో వ్యవసాయ మండలంగా పేరున్న లక్ష్మణచాందలో ఈ ఏడాది యాసంగి సీజన్ వరినాట్లు జోరందుకున్నాయి. కూలీలు దొరకకపోవడంతో రైతులు బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో రెండో పంట సమయంలో ఉపాధి లభించకపోవడంతో కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఇక్కడ నాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు. అన్నిపనులూ వారే.. బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వరి నారు తీయడం, తీసిన నారును మడులలో పంచుకోవడం, మందు చల్లడం, నాటు వేయడం.. ఇలా అన్నిపనులూ వారే చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే పొలం వద్దకు చేరుకున్న కూలీలు ముందుగా వరినారు తీస్తున్నారు. ఆతర్వాత ఎరువులు చల్లిన అనంతరం నాటు వేయడం ప్రారంభిస్తున్నారు. 12 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో వరి నాటు వేస్తున్నారు. ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500 మండలంలోని మునిపెల్లి, చామన్‌పెల్లి, లక్ష్మణచాంద, తదితర గ్రామాల్లో 12 మంది కలిసి గ్రూపుగా ఏర్పడిన కూలీలు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500ల చొప్పున తీసుకుని నాట్లు వేస్తున్నారు. ఒక్కో గ్రూపుకు రోజుకు రూ.16 వేల చొప్పున, ఒక్కో కూలీకి రోజుకు రూ.900 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. రోజుకు నాలుగెకరాల్లో.. 12 మంది సభ్యులం కలిసి గ్రూపుగా ఏర్పడ్డాం. రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నాం. దీంతో రోజుకు కూలి రూ.900 నుంచి వెయ్యి వరకు సంపాదిస్తున్నాం. – సికిందర్, కూలీ, బిహార్ -
ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు?
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే సహయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. ప్రస్తుతం సొరంగంలోని శిధిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఉత్తరకాశీ పోలీసు సూపరింటెండెంట్ అర్పణ్ యదువంశీ తమ బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ 108, సొరంగం నిర్మిస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఉద్యోగులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది. ఇది కూడా చదవండి: నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు? -
ఉపాధి కెళ్లినా డబ్బులు రావడంలే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించి కూలీలకు స్థానికంగా పని కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రంలో నీరుగారి పోతోంది. ఈ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య భారీగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. గతేడాదితో పోల్చితే ఈ పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య 25 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది 2022 జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల సంఖ్య 3,23,028 మంది కాగా, మంగళవారం (2023 జనవరి 3న) రోజు పనులకు హాజరైన కూలీల సంఖ్య కేవలం 72,371 అంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పనులు చేసేందుకు కూలీల్లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజు వారీ కూలీ సగటున రూ.211 ఉపాధి హామీ పనులు చేసిన వారికి సకాలంలో కూలీ డబ్బులు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా కూలీలకు 15 రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలి. కానీ నెలల తరబడి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ►కొందరు కూలీలకు గతేడాది ఆగస్టు నుంచి డబ్బులు రాలేదు. ఈ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ►ఉపాధి పనులకు వెళితే కూలీ గిట్టుబాటు కాకపోవడము కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి కూలీలకు రోజుకు సగటున రూ.211లు వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు డిమాండ్ అధికంగా ఉంది. రబీ పంటలు.. వరి నాట్లు, పత్తి తీయడం వంటి పనులకు వెళితే ఇంతకు రెండింతలు కూలీ గిట్టుబాటు అవుతోంది. ►మారుతున్న నిబంధనలు కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు ప్రత్యేక యాప్‌లో రెండు పూటలా ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్‌ఫోన్ నెట్వర్క్ లేని చోట్ల ఈ ప్రక్రియ వీలు కావడం లేదు. 66 లక్షల మంది కూలీలు.. రూ.2,841 కోట్ల పనులు.. రాష్ట్ర వ్యాప్తంగా 56.74 లక్షల జాబ్‌కార్డులుండగా, మొత్తం 1.18 కోట్ల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 37.09 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు కార్డుదారులు కాగా, 66.44 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022–23లో ఇప్పటి వరకు రూ. 2,841.17 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో కూలీలకు చెల్లించిన వేతనం రూ.1,791.10 కోట్లు కాగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.875.35 కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్‌లో చేసిన పనికి ఇంకా డబ్బులు రాలే.. గతేడాది సెప్టెంబర్‌లో గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాను. ఇప్పటికీ కూలీ డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నాను. అధికారులను ఎన్నిమార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. – భూమయ్య, ఉపాధి కూలీ, జంబిగి, సంగారెడ్డి జిల్లా ఇతర పనులకు వెళ్తున్నాం.. సరిగ్గా డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లడం లేదు. ఇతర వ్యవసాయ పనులకు వెళుతున్నాం. సెప్టెంబర్‌లో చేసిన పనులకే ఇంకా కూలీ డబ్బులు రాలేదు. పనులు చేసుకుంటేనే పూట గడిచే మాకు వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి. – మణెమ్మ, ఉపాధి కూలీ,జంబిగి, సంగారెడ్డి జిల్లా -
‘ఉపాధి’లో ఆన్లైన్ హాజరు! జనవరి 1 నుంచి కేంద్రం కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ (ఎన్ఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉపాధి పనుల్లో కూలీల ‘మాన్యువల్ అటెండెన్స్’కు చెల్లుచీటీ పలికింది. ఇకపై లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారానే అన్నిరకాల పనులకు సంబంధించిన పనుల వివరాలు, కూలీల హాజరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ తదితర వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు, ఉపాధి హామీ పథకం కమిషనర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం అమలు డైరెక్టర్ ధర్మవీర్ ఝా ఉత్తర్వులను పంపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడం, పౌర సమాజం పర్యవేక్షణకు వీలుగా కొత్త నిబంధనలు తెచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే మొదలు.. ఉపాధి హామీ కూలీల హాజరును రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం ఈ ఏడాది మే నెలలోనే తీసుకొచ్చింది. కూలీల అటెండెన్స్ రోజుకు రెండుసార్లు సమయంతో సహా నమోదయ్యేలా, కూలీల ఫొటోలను జియోట్యాగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇరవై మందికిపైగా కూలీలు పనిచేసే సైట్లలో మాత్రమే వాటిని అమలు చేశారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చేపట్టే అన్ని పనుల్లో (వ్యక్తిగత ప్రయోజన పనులు మినహా) ఎన్ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు నమోదు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ వి«ధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆన్లైన్ నమోదులో ఇబ్బందులెన్నో.. ఉపాధి హామీ పనులు జరిగే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్య ఉండటం, అందరికీ స్మార్ట్ఫోన్లు, డేటా లేకపోవడం వంటి సమస్యల వల్ల ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ నమోదు ఇబ్బందికరమేనని క్షేత్రస్థాయిలో ఈ పథకం పరిశీలకులు చెప్తున్నారు. కూలీలు చేసే పనుల కొలతలు, పరిమాణం ప్రకారమే కూలి డబ్బు ఇస్తున్నపుడు కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరిగా పని, కూలి సొమ్ము అందక ఉపాధి హామీ పథకానికి గ్రామీణ పేదలు దూరమవుతున్నారని అంటున్నారు. లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు వంటి చర్యలు మరింత ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
-
పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి
-
వరదలో చిక్కుకుపోయిన 21 మంది కూలీలు.. రాత్రంతా అక్కడే!
సాక్షి, మహబూబాబాద్/మరిపెడ రూరల్/మద్దిరాల: వాళ్లంతా రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కూలీలు. కూలికోసం ఏరు దాటి వెళ్లారు. రోజువారీగా పనిచేస్తుండగానే ఒక్కసారిగా వచ్చిన వరద చుట్టుముట్టింది. రెండు పాయలుగా ఉన్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం శివారులో పాలేరు వాగులో మధ్యలో కూలీలు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమించి కూలీలను శనివారం ఉదయం బయటకు తీసుకొచ్చింది. నీళ్ల మధ్య చిక్కుకున్న కూలీలు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని కోట్యాతండా, వాల్యతండా గ్రామ పంచాయతీల పరిధిలోని చౌళతండాకు చెందిన 17 మంది, వాల్యతండాకు చెందిన నలుగురు.. మొత్తం 21 మంది కూలీలు సరిహద్దు ప్రాంతంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన తిరుమలయ్య వ్యవసాయ క్షేత్రంలోని వరి నాటు వేయడానికి ఆటోలో శుక్రవారం ఉదయం వెళ్లారు. అక్కడ వాగు 2 పాయలుగా చీలిన ప్రదేశంలో రైతు వ్యవసాయ భూమి ఉంది. ఉదయం నాటు వేయడానికి వెళ్లినప్పుడు మాములుగానే ఉండటంతో కూలీలు వెళ్లి నాటు వేశారు. తిరిగివస్తుండగా వాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఎటుచూసినా నీరు.. మధ్యలో కూలీలు ఉండిపోయారు. బయటికొచ్చే మార్గం లేకపోవడంతో ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పారు. వారు అధికారులకు సమాచారం అందించారు. ఉదయం సురక్షితంగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూలీలను బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి డ్రోన్ ద్వారా కూలీలకు ఆహారం అందజేశారు. రాత్రి 2గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకున్నా వర్షం కురుస్తుండటంతో కూలీలను ఒడ్డుకు చేర్చడం సాధ్యం కాలేదు. దీంతో శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఎన్డీఆర్ఎఫ్ బృంద ఇన్చార్జి మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో శ్రమించి బోటు సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో కూలీలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ శశాంక్ రక్షణ చర్యలను పర్యవేక్షించారు. చీకట్లో గడిపాం పాలేరు వాగు మధ్యలో ఉండిపోయి రాత్రంతా కారు చీకట్లో ఉండిపోయాం. అధికారులు ధైర్యం చెప్పినా భయం వేసింది. తాగేందుకు నీళ్లు కూడా లేవు. రాత్రి మొత్తం బురదలో నిలబడే ఉన్నాం. –తేజావత్ దేవి నా కొడుకు గుర్తుకొచ్చాడు వాగులో చిక్కుకున్న. నా రెండేళ్ల కొడుకు గుర్తుకు వచ్చి ఏడ్చా. తోటి కూలీలు ధైర్యం చెప్పి నన్ను ఓదార్చారు. అయినప్పటికి కొడుకును చూస్తాను అనుకోలేదు. –ఆంగోతు కవిత, చంటి బిడ్డతల్లి ఇదీ చదవండి: Telangana: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ -
భారంగా బతుకు‘పాఠం’
పై ఫోటోలో పత్తి ఏరుతున్న ఈయన పేరు లింగమయ్య. కల్వకుర్తికి చెందిన ఈయన ఎంఎస్సీ బీఈడీ చేశారు. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న లింగమయ్య.. కరోనా దెబ్బతో ఉద్యోగం కోల్పోయారు. సొంతూరుకు వెళ్లి జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీగా మారారు. సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పో యిన లక్షన్నర మంది టీచర్లు, అధ్యాపకుల జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. 6 నెలలుగా పని లేక.. జీవనం గడిచే దారిలేక కొంత మంది వ్యవసాయ, దినసరి వేతన కూలీలుగా మారితే.. మరికొంతమందిపరువు కోసం కడుపు మాడ్చు కొని ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. అర్ధాకలితో అవస్థలు పడుతూ ఎప్పుడు పరిస్థితులు చక్క బడుతాయో నని ఎదురుచూస్తున్నారు. ఇపుడు 75% స్కూళ్లు ఆన్లైన్ తరగ తులను ప్రారంభించి, ఫీజులూ వసూలు చేసుకుంటున్నాయి. ఫీజులు చెల్లించని వారి పిల్లలకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వకుండా వేధిస్తూ ఫీజులను పెంచి మరీ దండుకుంటున్నాయి. అయినా టీచర్లను స్కూళ్లకు రమ్మని పిలవడం లేదు. వెళ్లి అడిగినా పట్టించు కోవడం లేదు. చివ రకు గత విద్యా సంవత్సరపు వేతన బకాయి లను, కోత పెట్టినవేతనాలను చెల్లించడంలే దని, పీఎఫ్ డబ్బులు విడిపించు కునేందుకు అవకాశమివ్వట్లేదని వాపోతున్నారు. మళ్లీ వస్తామన్నా... తీసుకొనే వారేరీ? డిగ్రీ, పీజీలు, పీహెచ్‌డీలు చేసి పట్నం వచ్చి టీచర్లు, లెక్చరర్లుగా బతుకీడుస్తున్న అనేక మంది కరోనా వల్ల బతుకుదెరువు కోల్పోయారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వక, పట్టణాల్లోనే ఉండేందుకు డబ్బులు లేక, ఏదో ఒక పని చేసుకొని బతికేం దుకు ఏప్రిల్, మే నెలల్లోనే అనేక మంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి వద్దామని యాజమాన్యాలను సంప్ర దిస్తున్నా... అటు నుంచి స్పందన లేదు. చివరకు సగం జీతానికైనా పనిచేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని, తామెలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్ తరగతుల్లో 40 శాతం మందే.. విద్యాశాఖ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 10,912 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 1,27,790 మంది టీచర్లు పని చేస్తున్నారు. మరోవైపు 15 వేల మంది వరకు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇక 1,496 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 20 వేల మంది వరకు లెక్చరర్లు ఉన్నారు. మరోవైపు 187 ఇంజనీరింగ్ కాలేజీల్లో 90 వేల మందికి పైగా అధ్యాపకులు పని చేస్తున్నారు. అయితే వీరిలో ఇపుడు 40 శాతం మంది కూడా స్కూళ్లు, కాలేజీల్లో లేరు. మెజారిటీ స్కూళ్లు ఆన్లైన్ తరగతులు ప్రారంభించినా టీచర్లను వెనక్కి తిరిగి తీసుకోలేదు. 20–25 మంది టీచర్లు ఉన్న స్కూళ్లలో 10 మందిలోపు టీచర్లతోనే ఆన్లైన్ బోధనను కొనసాగిస్తున్నాయి. చాలా పాఠశాలలైతే ప్రైవేటు ఆన్లైన్ లెర్నింగ్ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకొని రికార్డెడ్ పాఠాలను ప్రసారం చేస్తున్నాయి. దీంతో వాటిని మానిటర్ చేసేందుకు ముగ్గురు నలుగురు టీచర్లను మాత్రమే స్కూళ్లకు రమ్మన్నాయి. అదీ సగం జీతాలతోనే పని చేయించుకుంటున్నాయి. మిగతా లక్షన్నర మందికి పైగా టీచర్లకైతే ఆ సగం జీతంతో కూడిన జీవితం కూడా లేకుండా పోయింది. క్లాసుకు ఇంతని దినసరి కూలీ స్కూళ్లకు వెళ్లి ఆన్లైన్ పాఠాలు చెబుతున్న వారి పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. చెప్పినా సగం జీతం కూడా ఇవ్వడం లేదు. వారికి వారంలో నాలుగు తరగతులను ఇచ్చి, ఒక్కో క్లాస్ రూ. 100 చొప్పున 400 చెల్లిస్తున్నారు. నెలకు రూ. 2 వేలు కూడా పొందని టీచర్లు అనేక మంది ఉన్నారు. మరోవైపు చాలా మంది టీచర్లకు స్కూళ్లు ఫీజుల వసూలు టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, ఫీజులు చెల్లించేలా చేస్తే ఒక్కో ట్రాన్జాక్షన్పై రూ. 300 చొప్పున కూలీగా చెల్లిస్తున్నాయి. రూల్సా... లైట్ తీస్కో! విద్యాశాఖ జీవో 1 ప్రకారం ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతం టీచర్ల వేతనాలకు, మరో 15 శాతం స్కూల్ అభివృద్ధికి, ఇంకో 15 శాతం పాఠశాల నిర్వహణకు, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చించాలి. మిగతా 5 శాతం డబ్బునే యాజమాన్యాలు లాభంగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అయినా విద్యాశాఖకు పట్టదు. ఈమె పేరు లావణ్య. లాక్డౌన్ ముందు వరకు ఓ ప్రైవేటు స్కూళ్లో టీచర్. ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యో గి. వీరికి ఇద్దరు పిల్లలు. చెరో ఉద్యోగం చేసుకుంటేనే ఇళ్లు గడిచే పరిస్థితి. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల స్కూల్ బంద్ అయింది. ఆమె ఉద్యోగం పోయింది. ఆర్నెల్లు అవుతోంది. భర్తకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నా: మహదేవ్ ఏప్రిల్ నుంచి జీతం లేదు. అడిగితే బెదిరిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామంటున్నారు. మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంది. మీ డాటా వాళ్లకు పంపించి మీకు ఎక్కడా పని దొరక్కుండా చేస్తామని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నా. -
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో పాటు చిన్నారి ఉన్నారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది.(కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం) బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ వలసకూలీలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి కూడా పోయే వీలు లేక వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురి మృతదేహలు గుర్తించారు. (తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు: ఐఎండీ హెచ్చరిక) -
తాడిపత్రి ఎంపీడీఓ కార్యలయంలో ఉపాధి కూలీలు ఆందోళన
-
మట్టిపెళ్లలు కూలి విషాదం..
సాక్షి, విశాఖ పట్నం : తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పార గూడెం సమీపంలో తాండవ నది ఒడ్డున మట్టిని తవ్వుతుండగా మట్టిపెళ్లలు విగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తుని ఆస్పత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వేతన కష్టాలు
కర్నూలు(అర్బన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు అందడం లేదు. దాదాపు రెండున్నర నెలలుగా వేతనాలు ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం ఆరు గంటలకే పనులకు వెళుతూ.. చెమటోడ్చి కష్టిస్తున్నారు. అయినప్పటికీ కనీసం వారానికి ఒక సారి కూడా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు సరిగా అందకపోవడంతో చాలా ప్రాంతాల్లోని కూలీలు ఉపాధి పనులకు స్వస్తి పలికి, సుదూర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. ఇప్పటికే పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు తదితర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఉన్న వారు కూడా తమ ప్రాంతాల్లో జరుగుతున్న రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. వ్యవసాయ పనులు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. రెగ్యులర్‌గా వేతనాలు విడుదల కాకపోవడంతో కూలీలతో పనులు చేయించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. చేసిన పనులకు వేతనాలు ఇవ్వాలని కూలీలు మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. రూ.50 కోట్ల పెండింగ్ జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల మేర వేతనాలను చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నవంబర్ ఏడో తేదీ నుంచి బకాయిలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో విడుదలైన రూ.39 కోట్ల నిధులతో అక్టోబర్ వరకు సర్దుబాటు చేశారు. తర్వాత నిధులు విడుదల కాలేదు. వేతనాలు అందకపోవడంతో కూలీల హాజరు క్రమేణా తగ్గిపోతోంది. గతంలో 60 వేల దాకా ఉన్న కూలీల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. వారానికి ఒకసారైనా ఇవ్వకపోతే ఎలా? చేసిన పనులకు కనీసం వారానికి ఒకసారైనా కూలి ఇవ్వకపోతే ఎలా బతకాలి? ఇప్పటికే రెండున్నర నెలలుగా వేతనాలు అందించకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. గ్రామాల్లో ఇతర పనులకు వెళ్లే వారిని ఉపాధి పనులకు రావాలని చెబుతున్నారు. అయితే..వేతనం మాత్రం నెలల తరబడి ఇవ్వడం లేదు. – ఆంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం నెలాఖరుకు విడుదల కానున్నాయి ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల వరకు వేతన బకాయిలున్న మాట వాస్తవమే. నవంబర్ ఏడో తేదీ నుంచి ఇప్పటి వరకు వేతనాలను అందించాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పెండింగ్ ఉన్నాయి. బకాయి పడిన వేతనాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఎం.వెంకటసుబ్బయ్య, డ్వామా పీడీ -
ఛత్తీస్‌గఢ్ కూలీలకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న కూలీలకు అధికారులు విముక్తి కల్పించారు. బట్టీల్లో కూలీలను వేధింపులకు గురిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్కుమార్ను అప్రమత్తం చేశారు. కలెక్టర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ కూలీలను గుర్తించారు. ఈ నెల 24, 25ల్లో దాడులు నిర్వహించారు. మహేశ్వరంలోని రావిర్యాల, కొంగరఖుర్దూ, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఆదిభట్ల, ఎల్మినేడు, చర్లపటేల్‌గూడల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 140 మంది పెద్దలు, 37 మంది చిన్నారులను అధికారుల సమక్షంలో వారి రాష్ట్రానికి పంపించారు. -
'కూలి'పోయారు
కూలీల జీవనం కూలిపోయింది. బతుకు కోసం పయనం కన్నీరే మిగిల్చింది. తమకు దిక్కెవరు దేవుడా..! అంటూ మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆదివారం చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరారు. 22 మంది క్షతగాత్రులు ఆస్పత్రిపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా కల్నరసంబట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కండీషన్ లేని లారీనే దీనికంతటికి కారణంగా తేలింది. కుప్పం రూరల్, కుప్పం: పొట్టకూటి కోసం కూలి కొచ్చిన 9 మంది తమిళనాడు వాసులు.. శని వారం రాత్రి కుప్పం మండలం నాయనూరు పెద్దవంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే ఊరికి చెందడం, అందరూ బంధువులు కావడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా నాట్రంపల్లె తాలూకా కల్లర్సంపట్టి గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం నాయనూరు గ్రామానికి శనివారం లారీలో వచ్చారు. అదే గ్రామానికి చెందిన దిలీప్ కూలీలను పనుల కోసం నాయనూరుకు తరలించాడు. కాయలు కోసిన తరువాత ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యా రు. ఈ క్రమంలో పెద్దవంక సమీపంలోని అనపబావి మలుపు లోయలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 22 మంది గాయపడ్డారు. కాగా రాత్రికి రాత్రే మృతదేహాలను కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, నాట్రంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మృతులందరిదీ ఒకే గ్రామం.. కల్లర్సంపట్టి గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరు తప్పనిసరిగా కూలీపై ఆధారపడిన వారే. ఈ క్రమంలో మామిడి కాయలు కోసేందుకు ఆంధ్రాకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కుప్పం వంద పడకల ఆస్పత్రి వద్దకు ఆదివారం మృతుల బంధువులు పెద్దఎత్తున చేరుకున్నారు. తమ వారి జాడకోసం అధికారులను వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన జిల్లా అధికారగణం.. రోడ్డు ప్రమాదం సంఘటన సమాచారం తెలియడంతో ఆంధ్రా, తమిళనాడు అధికారులు వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ ప్రద్యు మ్న, ఎస్పీ రాజశేఖర్, డీఎస్పీ చౌడేశ్వరితో పాటు రెవెన్యూ శాఖ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పంచనామా అనంతరం తమిళనాడు ప్రభుత్వ అంబులెన్స్‌లలో మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించారు. -
పట్టణ 'హోదా'తో 'ఉపాధి' హుష్
సాక్షి, హైదరాబాద్ : అది జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ గ్రామ పంచాయతీ.. సుమారు 6,357 కుటుంబాలకు ఉపాధి హామీ పథకమే దిక్కు.. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉపాధి కూలీలుగా ఉన్నారు.. జూలై తర్వాత ఈ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 12 వేల మంది కూలీలు ఉపాధికి దూరమవనున్నారు! అలంపూర్‌కు మున్సిపాలిటీ హోదా కల్పించనుండటమే ఇందుకు కారణం!! ఇలా ఒక్క అలంపూరే కాదు.. రాష్ట్రం లోని 309 గ్రామ పంచాయతీలు/గ్రామాల పరిధిలో ఆగస్టు నుంచి ఉపాధి హామీ పథకం అమలు నిలిచిపోనుంది. ఫలితంగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది పేద కూలీలు జీవనోపాధిని కోల్పోనున్నారు. అనధికార అంచనాల ప్రకారం వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండనుంది. 8,755 గ్రామాలు.. 50 లక్షల కుటుంబాలు.. రాష్ట్రంలోని 173 గ్రామ పంచాయతీలు/గ్రామాల విలీనంతో ప్రభుత్వం కొత్తగా 71 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తోంది. వీటితోడు ఇప్పటికే ఉన్న 41 మున్సిపాలిటీల్లో మరో 136 గ్రామాలను విలీనం చేసింది. అంటే మొత్తం 309 గ్రామ పంచాయతీలు/గ్రామాలు మున్సిలిటీల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. జూలైతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆ వెంటనే అంటే.. ఆగస్టు 1 నుంచి ఈ 309 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోనుంది. దీంతో ఈ గ్రామాల్లో కనీసం 5 లక్షల మంది కూలీలు అకస్మాత్తుగా జీవనోపాధికి దూరం కానున్నారు. ఇందులో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. రాష్ట్రంలోని 8,755 గ్రామ పంచాయతీల పరిధిలో 50,82,970 కుటుంబాలు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి. పురుషులు, మహిళలు కలిపి 1,12,11,923 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పించేందుకు కేంద్రం 2017–18లో రూ.2,930 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో కూలీకి గరిష్టంగా రూ.205 వేతనం అందిస్తున్నారు. సగటున ఒక్కో వ్యక్తి రోజుకు రూ.140 వేతనాన్ని అందుకుంటున్నాడు. వ్యవసాయేతర ఉపాధి లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పనికి హామీ కల్పిస్తూ 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉన్న ఊరిలోనే పని లభిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు 309 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పథకం నిలిచిపోనుండటంతో కూలీలకు పని లేకుండా పోతుంది. వాస్తవానికి రాష్ట్ర పురపాలికల చట్టంలోని నిబంధనల ప్రకారం 20 వేల కనీస జనాభా ఉండి, జనాభాలో సగానికి పైగా వ్యవసాయేతర పనులపై ఆధారపడి ఉన్న గ్రామాన్ని మాత్రమే మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలి. అయితే పేరుకు పట్టణ హోదా వస్తున్నా ఈ 309 గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు, పట్టణ ప్రాంత ఛాయలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వ్యాపార, వాణిజ్య సదుపాయాల్లేవు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలు తప్ప ప్రజలకు మరే ఇతర ఉపాధి అవకాశాలు లేవు. నిబంధనల ప్రకారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం.. చట్ట సవరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జీహెచ్ఎంసీతోసహా రాష్ట్రంలో 73 పురపాలికలు ఉండగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 71 మున్సిపాలిటీలతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1.24 కోట్లు కాగా.. కొత్త పురపాలికల ఏర్పాటు తర్వాత ఈ సంఖ్య 1.50 కోట్లకు పెరగనుంది. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 నుంచి 45 శాతానికి పెరగనుంది. దాదాపు 25 లక్షల మంది గ్రామీణ జనాభా పట్టణ జనాభా పరిధిలోకి రానున్నారు. అందులో కనీసం 5 లక్షల మంది ఉపాధి హామీకి అనర్హులుగా మారనున్నారు. -
హైటెక్ సిటీలో వంద గుడిసెలు దగ్ధం
హైదరాబాద్: హైటెక్ సిటీలో వంద గుడిసెలు కాలి బూడిదయ్యాయి. పొయ్యిలో పడ్డ ప్లాస్టిక్ కవర్‌తో చెలరేగిన మంటలు వలస కూలీలకు బూడిదను మిగిల్చాయి. గుడిసెలతోపాటు వాటిలో నిల్వ చేసుకున్న నిత్యావసరాలు, బట్టలు కాలిపోవడంతో వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో గురువారం ఉదయం 9.30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెం దిన వలస కూలీల బృందం ఓ గుడిసెలో వంట చేస్తుండగా ప్లాస్టిక్ కవర్ అంటుకోవడంతో మంటలు చేలరేగాయి. మాదాపూర్ ఫైర్‌స్టేషన్ అధికారి పర్యవేక్షణలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తినష్టం దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని, వందకు పైగా గుడిసెలు కాలిపోయాయని తెలిపారు. ఉలిక్కిపడ్డ పత్రికానగర్ ఐటీ కారిడార్ నడిబొడ్డులో, పెద్ద పెద్ద కంపెనీలు, భవనాల మధ్యలో మంటలు భారీస్థాయిలో చెలరేగడంతో స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. గాలి వాటానికి మం టలు తమవైపు వస్తాయోనని కార్యాలయాలు, అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుం దోనని ఆలోచించేలోపే 100 గుడిసెలకు పైగా కాలి బూడిద కావడంతో ఆ ప్రాంతం పొగమయంగా మారిపోయింది. నిరాశ్రయులైన 300 మంది కూలీలు ఒడిశా, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఆరేళ్ల నుంచి గుడిసెలను ఏర్పాటు చేసుకొని మాదాపూర్ పరిసరాల్లో రోజు కూలి పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో వారు దాచుకున్న నగదు, చిన్న చిన్న బంగారు, వెండి ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఉదయమే అందరూ కూలీ పనులకు వెళ్లడంతో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా గుడిసెలు తగలబడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పునరావాసం కల్పించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. -
బలూచిస్తాన్‌లో కూలీలపై కాల్పులు
-
ఉపాధి పేరిట శేషాచలం అడవుల్లోకి!
► గ్రామీణులే ‘ఎర్ర’ కూలీలుగా టార్గెట్ ► ఇప్పటికే పలువురిని తరలించిన వైనం ► ముందస్తు బయానా, రోజుకు రూ.500 కూలి ► కూలీల సేకరణకు ప్రత్యేక ఏజెంట్లు పలమనేరు: బెంగళూరు, చెన్నె తదితర నగరాల్లో పనులు కల్పిస్తామంటూ పలమనేరు, కుప్పం నియోజకవర్గం లోని గ్రామీణులకు మాయమాటలు చెప్పి శేషాచలం అడవుల్లో ఎర్రదుంగలు నరికివేత పనులకు వారిని ఓ ముఠా చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. పనులు లేని పలువురు నిరక్షరాస్యులను ఇప్పటికే ఈ ఊబిలోకి దించిన ట్టు సమాచారం. ఏజెంట్లు ముందుగా చెల్లించిన డబ్బును అవసరాలకు వాడుకున్న కూలీలు విధిలేక ఈ పనులకు వెళుతున్నట్టు తెలిసింది. అటవీప్రాంత గిరిజనులే టార్గెట్ పలమనేరు నియోజకవర్గంలోని మండిపేట కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాది కాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటతో పాటు పెద్దపంజాణి, వీకోట మండలాలో్లని అటవీ ప్రాంతాల సమీపంలో పలు గ్రామాలున్నాయి. ఈ గ్రామాలో్లని గిరిజనులు గతంలో అటవీ ఉత్పతు్తలను సేకరించి పొట్టపోసుకునేవారు. మరికొందరు అడవుల్లో పశువులను కాయడం, ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లేవారు. కొంతకాలంగా వీరికి ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. ఇది అవకాశంగా తీసుకున్న ఎర్రచందనం ముఠాలు వీరికి గాలం వేస్తున్నాయి. బెంగళూరులో పనులని చెప్పి... బెంగళూరులో కేబుల్ పనులు, టేకు చెట్ల కోత పనులకు కూలీలు కావాలంటూ ఏజెంట్లు నమ్మబలుకుతారు. యువకులకు ఎంపిక చేసుకుని గ్రామంలోని పెద్దమనిషి ముందు వారికి బయానాగా రూ.పదివేల దాకా అందిస్తారు. తాము చెప్పినపుడు పనికిరావాలని చెప్పి వెళ్తారు. ఈ వ్యవధిలోనే ఏజెంట్లు ఇచ్చిన సొమ్ము ఖర్చు చేసిన యువకులు తీరా ఏజెంట్లు పంపిన చోట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో కూలీలు గత కొన్నేళ్లు ఇళ్లకే రాకుండా పోయారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వ్యకు్తలు అదృశ్యవైునా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇదో ఊబి అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేందుకు కూలీలుగా వెళ్లిన యువకులు ఆ తర్వాత ఇతర పనులకు వెళ్లడం లేదు. గ్రామాల్లో తిరిగితే పోలీసులు పట్టుకుంటారని వారిని బెదిరించి, మరలా ఇవే పనుల్లో కొనసాగేలా చేస్తున్నట్టు గతంలో ఈ పనులకు వెళ్లిన వారు చెబుతున్నారు. దీనికి తోడు కూలీలకు రోజుకు రూ.500 ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేస్తుంటారని తెలిసింది. తక్కువ కాలంలోనే ఇలా ఎకు్కవ మొత్తంలో సంపాదించి, డాబుగా జీవిస్తుండడం చూసి మరికొందరు ఆకర్షితులైన ఇదే ‘ఎర్ర’బాట పడుతున్నారు. ఈ కూలీల్లో చదువుకున్న వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కూలీల కోసం ప్రత్యేక ఏజెంట్లు శేషాచలం అడవులో్లకి కూలీలను సరఫరా చేసేందుకు పలమనేరు, వీ.కోటలో పలువురు ఏజెంట్లు ఉన్నట్టు సమాచారం. స్మగ్లర్లకు కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు ఆర్సీలున్న వాహనాలను ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎర్రకూలీల వ్యవహారాన్ని గుట్టురట్టు చేయాలంటే కీలకవైున ఏజెంట్లను పట్టుకోవాల్సిన అవరసం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మరెందరో ఈ ఊబిలో కూరుకుపోవడం తథ్యమని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.