తీపి కబురు | Given the price of sugarcane resolution KCR | Sakshi
Sakshi News home page

తీపి కబురు

Published Tue, Jan 6 2015 3:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

తీపి కబురు - Sakshi

తీపి కబురు

ప్రయివేటీకరణ చెర వీడనున్న ఎన్‌డీఎస్‌ఎల్
⇒  సీఎం సమక్షంలో ఎట్టకేలకు వీడిన సందిగ్ధత
రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
చెరుకు ధరపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్
టన్నుకు రూ. 340 ప్రభుత్వమే భరిస్తుందని హామీ
బోధన్: బోధన్ ప్రాంత రైతులు, కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపికబురు అందించారు. ‘నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్’కు ప్రయివేటు చెర విడిపించేందుకు భరోసా ఇచ్చారు. పుష్కర కాలంగా ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభు త్వ పరం చేస్తామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామ ని టీఆర్‌ఎస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీ నెరవేరేలా ఓ అడుగు ముందుకు పడింది.

సోమవారం సీఎం హైదరాబాద్‌లోని సచివాల యంలో బోధన్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, మెదక్ జిల్లాకు చెందిన ఎన్‌డీఎస్‌ఎల్ యూనిట్ల పరిధిలోని రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీ బీ పా టిల్, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బోధన్, మెట్‌పల్లి, మెదక్ ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, వి ద్యాసాగర్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి ఇందులో పా ల్గొన్నారు.

ఈ సందర్భంగా చక్కెర ఫ్యాక్టరీ భవితపై నిర్ణయం తీసుకునేందుకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయా న్ని బోధన్ చెరుకు ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షు డు కెపీ శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో ‘సాక్షి’కి తెలిపారు. కొ ద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో రైతులు ఎంపీ కవితను కలిసి చెరుకు ధర, ఫ్యాక్టరీ భవిత అంశాలపై చర్చించారు. ఆమె చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
 
సమావేశాలు ఇలా
ఫ్యాక్టరీ భవిత గురించి చర్చించేందుకు మూడు ఫ్యాక్టరీల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 7న మెట్‌పల్లిలో, 10న మెదక్‌లో, 11న బోధన్‌లో సమావేశాలు నిర్వహిస్తారు. బోధన్ సమావేశానికి ఎంపీ కవిత హాజరవుతారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించాలా? రైతుల భాగస్వామ్యంతో నడుపాలా అనే అంశంపై అభిప్రాయాలు సేకరించనున్నారు.

పొరుగున ఉన్న మహారాష్ట్రలో సహకార పద్ధతిన నడుస్తున్న ఫ్యాక్టరీల నిర్వహణపై అధ్యయనం చే యాలని సీఎం సూచించినట్టు రైతు నాయకులు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు బరువు పడకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆధునీకరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. 2014-15 క్రషింగ్ సీజన్‌కుగాను ఎన్‌డీఎస్‌ఎల్  యాజమాన్యం టన్నుకు రూ. 2260 ధర చెల్లిస్తామంటోంది. రైతులు రూ. 2600 చెల్లిం చాలని కోరుతున్నారు. దీనికీ సీఎం అంగీకరించి, రెండు మూడు రోజులలో జీఓ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
 
12 ఏళ్లుగా నాటకీయ పరిణామాలు
ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఖ్యాతి పొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం పాలకులు 1938లో నిర్మించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉండగా ఇది ఓ వెలుగు వెలిగింది. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించిం ది.రైతులకు లాభసాటి ధర అందించింది. 2002లో చంద్రబాబు దీనిని ప్రయివేటీ కరించారు. వారికే నిర్వహణ అధికారం కట్టబెట్టారు.

దీంతో రైతులు, కార్మికులు తీవ్ర కష్టాల పాలయ్యారు. వందలాది మంది కార్మికులను ఉద్యోగాలు కోల్పోయారు. రై తులు లాభసాటి ధర అందక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రయివేటీకరణను రద్దు చేయాలని రైతులు, కార్మికులు దశాబ్ద కాలం నుంచీ పోరాడుతున్నారు. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డి, పలువురు రైతు, కార్మిక సం ఘాలు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు. ఇపుడు ఈ పోరాటం ఫలిం చబోతోంది.
 
2004లో వైఎస్‌ఆర్ హయాంలో సభా సంఘం
2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో అవినీతి,అక్రమాల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని నియమించారు. 2006 ఆగస్టు 31న ఇది నివేదిక ఇచ్చింది. ఫ్యాక్టరీని తిరిగి స్వా దీనం చేసుకోవాలని సిఫారసు చేసింది.  ఆయన మరణానంతరం ఈ అంశం కోర్టు విచారణకు వ చ్చిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఫ్యాక్టరీ స్వాధీనం అంశాన్ని  పట్టించుకోలేదు. దాంతో విషయం మరుగున పడిపోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వడంతో రైతులు, కార్మికులలో హర్షం వ్యక్తం అవుతుంది.
 
సీఎంతో జరిగిన సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్‌రెడ్డి,ఉపాధ్యక్షుడు శివరాజ్‌పాటిల్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బి. సుబ్బారావు, మారుతీపటేల్, ఆర్ విఠల్, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డితోపాటు మరో 30 మంది రైతులు, మెట్‌పల్లి, మెదక్‌కు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement