పొలంలో పనిచేసుకుంటున్న ముగ్గురు మహిళలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని తుర్కవడగం గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముగ్గురు మహిళా కూలీలు పొలంలో పనిచేస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది.
దీంతో పనిచేస్తున్న హాజీబేగం(40), అమినాబేగం(22), పద్మ(40) వేపచెట్టు కిందికి పరుగులు తీశారు. అదే సమయంలో వేపచెట్టు సమీపంలో పిడుగుపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.