ట్రాక్టర్ బోల్తా.. 20 మంది కూలీలకు గాయాలు | 20 Workers were injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. 20 మంది కూలీలకు గాయాలు

Published Mon, May 2 2016 11:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

20 Workers were injured in road accident

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం వద్ద సోమవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా వారిలో ఎం.రామలక్ష్మి, టి.లలిత, ఎన్.నాగుదర్గకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సప్పగూడెం నుంచి జమ్మిగూడెం గ్రామంలో మొక్కజొన్న కంకులు విరిచే పనికి వెళుతుండగా ట్రాక్టర్ ఇంజన్ నుంచి ట్రక్కు లింక్ విడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement