tractor Roll over
-
నాన్నా.. మమ్మల్ని చూడు!
గుంటూరు, ప్రత్తిపాడు: ‘నాన్న లే.. ఒక్కసారి మమ్మల్ని చూడు. పెద్దోడా.. చిన్నోడా.. అంటూ ఇంక మమ్మల్ని ఎవరు పిలుస్తారు. లే నాన్నా’ అంటూ కన్న కొడుకులు తండ్రి మృతదేహం వద్ద బోరున విలపించిన ఘటన నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా దుగ్గిలి మండలం రాతన గ్రామానికి చెందిన చాకలి వీరేష్ (43), లక్ష్మి దంపతులు. వీరి కుమారులు వినోద్, శేఖర్. వీరికి 15 ఏళ్ల వయసుంటుంది. కలిసి కొద్ది నెలల కిందట వ్యవసాయ కూలి పనుల నిమిత్తం కుటుంబం మొత్తం ప్రత్తిపాడుకు వచ్చారు. లక్ష్మి మిర్చి కోతకు పొలం వెళ్లింది. కుమారులు కూడా మరో చోట మిర్చి కోతకెళ్లారు. అదుపుతప్పి నక్కవాగులో తిరగబడ్డ ట్రాక్టర్ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వీరేష్ ఒక్కడే ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ముందు టైర్ ఉన్నట్టుండి పేలింది. ట్రాక్టర్ పూర్తిగా అదుపు తప్పి నక్కవాగులోకి దూసుకువెళ్లి తిరగబడింది. భూమ్మీద ఉండాల్సిన నాలుగు చక్రాలు ఆకాశం వైపు చూసేంతగా జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న వీరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారులిద్దరూ ఘటనా స్థలానికొచ్చి తండ్రి మృతదేహం వద్ద బోరున విలపించారు. ‘నాన్నా లే.. మమ్మల్ని చూడు నాన్నా..’ అంటూ కన్నీటిపర్యంతమవడం చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు ఏఎస్ఐ కె శివశంకర్ సింగ్ పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. -
ట్రాక్టర్ అదుపు తప్పి యువకుడు మృతి
శ్రీకాకుళం , రేగిడి: తల్లిదండ్రులు కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను చక్కగా చదివించుకున్నారు. అయితే... వారికి ఉద్యోగాలు వస్తే భవిష్యత్ బాగుంటుందని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం నానా ప్రయత్నాలు చేసినా.. ఎక్కడా ఆసరా దొరకక పోవడంతో తన స్వశక్తితో బతకాలని ఆలోచనతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసుకున్నాడు ఆ యువకుడు. సరదాగా జీవితం సాగిపోతున్న తరుణంలో ఆ ట్రాక్టరే అతని పాలిట మృత్యువైంది. వివరాల్లోకి వెళ్తే... రేగిడి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన కుదిగాన శివ(21) ఉంగరాడమెట్ట వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సోమవారం తన ట్రాక్టర్‌కు ఆయిల్ నింపుకొని, తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. బంక్ దాటిన కొద్ది దూరంలోనే రహదారి పక్కన ఉన్న పెద్ద గోతిలో ట్రాక్టర్ చక్రాలు దిగడంతో ఖాళీగా ఉన్న ట్రక్కు కాస్త అదుపు తప్పి, అందులోకి దూసుకుపోయింది. ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న శివ రోడ్డుపైకి ఎగిరి పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పాలకొండ సీఐ జి.శ్రీనివాస్, ఎస్ఐ కె.వెంకటేష్ హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకొని, బాధితుడిని 108 ద్వారా రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్పటికే అతను మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. జాబిస్తే ఘోరం జరిగేది కాదు! ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహం కోసం ఎన్నికల్లో లేనిపోని హామీలను ఇచ్చి ప్రజలను వంచించారు. తాను అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతకు ఒక్కజాబు కూడా ఇవ్వలేదు. ఇందులో భాగంగానే రెడ్డిపేటకు చెందిన కుదిగాన శివ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. జాబ్ వస్తుందని వేయికళ్లతో ఎదురుచూశాడు. తీరా ఇప్పటికీ జాబు రాలేదు సరికదా.. నిరుద్యోగ భృతి కూడా అందని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో నిరాశ చెంది స్వశక్తితో ఆరు మాసాల క్రితం కొనుగోలు చేసుకున్న ట్రాక్టర్‌ను నడుపుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే... కుటుంబం అంతా సంతోషంగా ఉన్న సమయంలో కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కుదిగాన గౌరీశ్వరి, శ్రీనివాసరావు బోరున విలపిస్తున్నారు. శివ అందరి దగ్గర ఎంతో కలివిడిగా తిరుగుతుండే వాడని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. -
రక్తమోడిన రహదారులు
శాంతినగర్ (అలంపూర్): వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన వడ్డేపల్లి మండలం పైపాడు శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా.. మెన్నిపాడు గ్రామానికి చెందిన బోయ నారాయణకు వడ్డేపల్లి మండలం జిల్లెడిదిన్నె గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహం గురించి మాట్లాడిన అనంతరం తిరుగు ప్రయాణమవ్వగా అలంపూర్–రాయచూర్ ప్రధాన రహదారిపై పైపాడు స్టేజీ సమీపంలోకి రాగానే వాహన వేగం అతిగా ఉండటంతో అదుపుతప్పింది. సమీపంలోని పంట పొలంలోకి దూసుకుళ్లింది. డ్రైవర్ నాగేష్ అప్రమత్తమై చేసిన ప్రయత్నం విఫలమై ఇంజన్, ట్రాలీ బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 20 మంది పడిపోయారు. వారిలో బోయ మద్దిలేటి (55), బోయ వెంకటేశ్వరమ్మ (30) ట్రాలీ కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నాగేష్, అతని కొడుకు మధు, శేషమ్మ, రంగమ్మ, వెంకటేశ్వరమ్మలకు సైతం తీవ్ర గాయాలు తగిలాయి. స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అసువులు బాసిన బోయ వెంకటేశ్వరమ్మ, మద్దిలేటి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు శాంతినగర్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. మరో ప్రమాదంలో యువకుడు తిమ్మాజీపేట (నాగర్‌కర్నూల్): మండలంలోని మరికల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో వడ్డె సురేష్(19) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ ద్వారా కరిగెట చేస్తుండగా ట్రాక్టర్ తిరగడడి బోల్తా పడింది. ట్రాక్టర్ మీద పడటంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్క గ్రామాల రైతులు గమనించి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుం బ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఆటో, బైకు ఢీకొన్న సంఘటనలో.. మహబూబ్‌నగర్ క్రైం : ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో మహిళ మృతిచెందింది. హన్వాడ మండలం చిరుమల్కుచ్చతండాకు చెందిన కృష్ణయ్య, అతని భార్య వెంకటమ్మ (65) గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. పట్టణంలోని టీడీగుట్ట వద్దకు రాగానే హన్వాడ వైపు నుంచి మహబూబ్‌నగర్ వస్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వెంకటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికులు మొదట జనరల్ ఆస్పత్రి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ రాజేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు భూత్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పక్కన నిలిపాడు. కారులో ఉన్న కల్పన అనే మహిళ రోడ్డుపై నిల్చొని ఉండగా అదే సమయంలో కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న యువకులు ఢీ కొట్టి బోల్తాపడ్డారు. దీంతో కల్పన ఎడమ చేయి, కుడి కాలు విరిగిపోగా, మోటర్ సైకిల్‌పై ఉన్న మణికంఠ, శ్రీనులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. గాయపిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మణికంఠ, శ్రీను పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలాఉండగా ఢీ కొట్టిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ వాసులుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. -
వెంటాడిన మృత్యువు
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కుప్పిలి సమీపంలో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పిలి, బుడగట్లపాలెం గ్రామాల పరిధిలో చేపల చెరువుల కోసం నెల రోజులుగా కొత్తగా విద్యుత్ లైన్లు వేస్తున్నారు. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈ పనులను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభాలను తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ట్రాక్టర్ ట్రాలీపై తొమ్మిది మంది కూలీలు కూర్చున్నారు. కుప్పిలి సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ గోపీ బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ట్రాలీలో కూర్చున్న కూలీలు కిందకు దూకేశారు. ఈ సమయంలో కింజరాపు నర్సింహులు (45) అనే వ్యక్తిపై స్తంభాలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనది శ్రీకాకుళం రూరల్ మండలం కంచుభూమయ్యపేట గ్రామం. మిగిలిన కూలీల్లో మెండ చిన్నారావు, రాజారావు, రమణలకు గాయాలయ్యాయి. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి పోలీసులకు, 108 అంబులెన్సుకు తెలియజేశారు. వెంటనే అంబులెన్సు సిబ్బంది వచ్చి క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు సంఘటన స్థల్నా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి తరలించారు. గాయపడిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీపావళి పండగ ముందు ప్రమాదం జరగడంతో ఆయా కుటుంబాలు పెను విషాదంలో కూరుకుపోయాయి. -
ట్రాక్టరు బోల్తా.. యువకుడి మృతి
రుద్రవరం (కర్నూలు): మండలంలోని పెద్దకంబలూరులో శుక్రవారం ట్రాక్టరు బోల్తాపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ చిన్నపీరయ్య యాదవ్ వివరాల మేరకు.. పెద్దకంబలూరుకు చెందిన గువ్వల నరసింహుడు తన మేనల్లుడైన యర్రగుడి గ్రామానికి చెందిన శివశంకర్(19)ను చిన్నప్పుడే తీసుకెళ్లి పెంచాడు. శివశంకర్ కూడా మేనమామకు ఇల్లు, వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇందులో భాగంగా ఉదయం ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని చెరువుకట్టమీదకు చేరుకోగానే ట్రాక్టరు అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో అతడు ట్రాక్టర్ కింద పడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు యువకుల దుర్మరణం
బీబీనగర్ (భువనగిరి) : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెం దారు. ఈ ఘటన మండలంలోని వెంకిర్యాల గ్రా మ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోరి పడమటిసోమవారం గ్రామానికి చెందిన దంతు మల్లేశ్ (26) వెంకిర్యాల గ్రామానికి చెందిన పహిల్వాన్‌పురం యాదయ్య వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం వెంకిర్యాల గ్రామంలోని ఎస్సీలకు చెందిన దశదినకర్మ ఉండడంతో స్నానా లు చేయడానికి ట్యాంకర్‌ను పంపిం చాలని యా దయ్యతో మాట్లాడుకున్నారు. దీంతో యాదయ్య డ్రైవర్ మల్లేశాన్ని ట్రాక్టర్‌కు ట్యాంకర్‌ను వేసుకుని వెంకిర్యాల గ్రామ శివారులోని చె రువు కట్ట వద్ద గల శ్మశాన వాటికకు వెళ్లాలని చెప్పాడు. దీంతో మల్లేశం ట్యాంకర్లో నీటిని నింపుకుని తన మేనల్లుడు ఉప్పట్ల శ్రీరాంలును(18) తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పోలాల్లోకి దూసుకెళ్లి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న మల్లేశంతో పాటు శ్రీరాములుకు తీవ్ర గా యాలయ్యాయి. వారిని ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. డ్రైవింగ్ నేర్చుకుంటానని వచ్చి.. ట్రాక్టర్ డ్రైవర్ మల్లేశం మేనల్లుడైన శ్రీరాములు పడమటిసోమారంలో నివసిస్తున్నాడు. ఖాళీగా ఉండడంతో తాను కూడా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పడంతో మల్లేశం తన ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. మద్యం సేవించి అజాగ్రత్తగా మల్లేశం ట్రాక్టర్‌ను నడుపడం వల్లే ప్రమాదం చో టు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒకే గ్రా మానికి చెందిన ఇద్దరు మామా అల్లుడులు మృ తిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కృష్ణ తెలిపారు. -
కూలి పనులకొచ్చి కానరాని లోకాలకు..
మదనపల్లె క్రైం : కూలి పనుల కోసం ఊరు గాని ఊరు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం అలుముకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ, గుట్టకాడపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద ఆదివారం జరిగింది. రూరల్ పోలీసులు, బాధితుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మేళ్లచెరువుకు చెందిన ఏసురత్నం(57) చిన్నచిన్న చెరువులు, కుంటలకు రాతి కట్టడం పనులు చేయడంలో దిట్ట. అతను తన కుమారుడు జయపాల్(21), కుమార్తె మణికుమారి(18)తో పాటు అదే గ్రామానికి చెందిన మరో రెండు కుటుంబాల వారిని వెంటతీసుకుని కర్నూలుకు వచ్చాడు. అక్కడున్న స్నేహితుడు శంకర్‌దాదా(57)తో కలిసి ఆరు నెలల క్రితం మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీకి వచ్చారు. క్రిష్ణాపురం సమీపంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద గుడారాలు వేసుకుని ఏడాదిగా పనులు చేసుకుంటున్నారు. ఆదివారం వారంతా పనుల్లోకి దిగారు. ట్యాంకు పైభాగంలో రాతి కట్టడం, మోల్డింగ్ దిమ్మెల నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లో లగేజి వేసుకుని కట్టపైకి వెళుతున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ట్రాలీలో కూర్చున్న కూలీలంతా కింద పడ్డారు. మరికొందరు కిందకు దూకేశారు. ట్రాలీలో ఉన్న సెంట్రింగ్ సామగ్రి మీద పడడంతో మణికుమారి(18) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఏసురత్నం(57), ఆయన కుమారుడు జయపాల్(21), అతని స్నేహితుడు శంకర్‌దాదా(57) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహచర సిబ్బంది వేరొక వాహనంలో హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించాలని డాక్టర్లు సూచించారు. అక్కడికి వెళ్లే లోపే అతను మృతి చెందాడు. శంకర్దాదాకు భార్య కేశమ్మ, ఆరుగురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
ట్రాక్టర్ ప్రమాదంపై అధికారుల విచారణ
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధి పడమటితండాలో ఏఎమ్మార్పీ లింక్ కెనాల్లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘట నలో తొమ్మిది మంది మృతిచెందిన కేసుపై ఆదివారం అధికారులు విచారణ జరిపారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖ అధికారులు, పడమటితండావాసుల సమక్షంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన ప్రాంతాన్ని నిర్ధారించేందుకు, ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో మిషన్ భగీరథ గుంత ఉండడంతో ప్రమాదానికి గుంత కారణమా కాదా అనే కోణంలో కొలతలు తీసుకున్నారు. పడమటితండావాసుల నుంచి వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. విచారణ జరిపిన వారిలో సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ భగీరథ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈలు నగేశ్, వెంకటేశ్వర్లు, అజిత్, పలువురు తండావాసులు ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా..ముగ్గురి మృతి
చిన్నంబావి: చిన్నంబావి మండలం వెలుగొండలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రాలీపై కూర్చున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు వెలుగొండ గ్రామానికి చెందిన చిన్నరాములు(42), ముస్టి రాములు(45), బయ్య హుసేనయ్య(47)లుగా గుర్తించారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి అనే రైతు పొలానికి స్తంభాలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్ళిబృందం ట్రాక్టర్ బోల్తా
► ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు రాయదుర్గం(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలం తమ్మేపల్లి వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్ గురువారం ఉదయం బోల్తాపడింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108లో క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు కర్ణాటకకు చెందినవారని, పెళ్ళికి ట్రాక్టర్లో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా.. 20 మంది కూలీలకు గాయాలు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం వద్ద సోమవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా వారిలో ఎం.రామలక్ష్మి, టి.లలిత, ఎన్.నాగుదర్గకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సప్పగూడెం నుంచి జమ్మిగూడెం గ్రామంలో మొక్కజొన్న కంకులు విరిచే పనికి వెళుతుండగా ట్రాక్టర్ ఇంజన్ నుంచి ట్రక్కు లింక్ విడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి
పాలకొండ రూరల్/సీతంపేట : సీతంపేట మండలం సరిహద్దుగూడ ప్రాంతంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలకొండ నుంచి ట్రాక్టర్‌తో ఇసుకను తీసుకువెళ్తుండగా సరిహద్దుగూడ గ్రామానికి సమీపించగానే ట్రాక్టర్ ఘాట్ రోడ్డు దిగుతుండగా అదుపు తప్పి చెట్టుకు ఢీకొని లోయలో పడింది. ఇసుక తొట్టెపై కూర్చున్న సవర తోటయ్య(25) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ బాపయ్య(32)ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. తోటయ్యకు భార్య అలివేలు, ఒక కుమార్తె ఉన్నారు. అంతకు ముందు తీవ్రంగా గాయపడ్డ బాపయ్య, సుగయ్యలను పాలకొండ ఏరియూ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. సుగయ్యను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పోస్ట్‌మార్టానికి నిరాకరణ చర్చి నిర్మాణానికి ఇసుక తీసుకువస్తుండగా మృతి చెందిన తోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎస్ఐ శ్రీనివాసరావు, సర్పంచ్ సారుుకుమార్, చర్చి పాస్టర్ వసంత్‌కుమార్ వారికి నచ్చజెప్పి ఒప్పించారు. కూలికని వెళ్లి... రోజూలాగే తోటయ్య, బాపయ్య కూలికని ట్రాక్టర్‌తో వెళ్లారు. సాయంత్రం వేళ ఇంటికి వస్తారని ఎదురు చూసిన వారి కుటుంబ సభ్యులకు వారి మృతి వార్త అందింది. తమ కుటుంబ పెద్దలు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. ఇక తమ దిక్కెవరూ అంటూ రోదించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించారుు. ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. పాలకొండ డివిజన్ పరిధిలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. కాసుల కక్కుర్తితో ఇసుక ట్రాక్టర్ల యాజమానులతో పాటు మరి కొంత మంది నాటు బళ్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విలువైన కలపతో పాటు ఇతర ముడి సరకులు వక్రమార్గాన పక్కదారి పడుతున్నాయి. వీటన్నింటిని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్, ఐటీడీఏ అధికారులు సైతం ఇటువంటి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపకపోవటం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని పలువురు సూచిస్తున్నారు. -
వెంటాడిన మృత్యువు
- బోయకొండ గంగమ్మకు మొక్కులు చెల్లించి వస్తూ ... - ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరి మృతి - 35 మందికి గాయాలు - బోడేవారిపల్లెలో విషాదఛాయలు వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండాలని ఆశపడ్డారు. తమ కోర్కెలు నెరవేర్చాలని రెండు ట్రాక్టర్ల ద్వారా బోయకొండ గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. విందు భోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు బయలుదేరారు. అయితే వారిని మృత్యువు వెంటాడింది. మార్గమధ్యంలో ఓ ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇద్దరు మృతిచెందారు. 35 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌడేపల్లె మండలం బోడేవారిపల్లెలో ఆదివారం విషాదాన్ని నింపింది. చౌడేపల్లె : చౌడేపల్లె మండలం బోడేవారిపల్లె వాసులకు బోయకొండ గంగమ్మ అంటే అపారమైన భక్తి. ప్రతి ఏటా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామస్తులంతా రెండు ట్రాక్టర్లలో బోయకొండకు వెళ్లారు. అమ్మవారికి జంతుబలులిచ్చి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో పక్షిరాజపురం సమీపంలోని గాజుమాకులమిట్ట వద్ద చిన్నపాటి లోయలోకి ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పీ.వెంకట్రమణకుమారుడు పీ.వెంకటేష్,(26), ఆంజనేయులు కుమారుడు పీ.బాలాజీ(25) ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. మరో 35 మంది గాయపడ్డారు. స్థానికులు, భక్తులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెలికితీయడానికి తీవ్రం గా శ్రమించారు. ట్రాక్టర్ క్యాబిన్ లో కింద చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న వెంకటేష్ అనే యువకుడిని అతి కష్టంమీద ప్రాణాలతో బయటకు తీశారు. క్షతగాత్రులను 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు డీటీసీ ప్రసాద్ ఆధ్వర్యంలో మదనపల్లె ఎంవీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ శ్రీనివాసులు, ఈవో ఏకాంబరం, స్థానిక యువకులు జేసీబీ సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
కూలీ బతుకులు ఛిద్రం
అతివేగంతో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురి దుర్మరణం పొట్ట కూటి కోసం సొంత గ్రామంలో ఉపాధి దొరకక పండు మిరపకాయలు ఏరేందుకు వెళ్తున్న గిరిజనులు రెప్పపాటులో జరిగిన ప్రమాదంతో ఛిద్రమయ్యారు. బయలుదేరిన పది నిమిషాలకే బతుకు చాలించారు. డ్రైవర్ అతివేగం..కనిపించని ఎటువంటి హెచ్చరిక బోర్డులు ..భారీ మూలమలుపులు.. అంతా స్పీడ్ ఎందుకయ్యా...తగ్గించుకో అన్నారు కూలీలు..అయినా వినలేదు.. అతని నిర్లక్ష్యమే ముగ్గురి నిండు ప్రాణాలు తీసింది. 20మందికిపైగా గాయాలపాల్జేసింది. పనికి వెళ్తేనే పూట గడిచే ఆ గిరిజన కూలీల కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. మఠంపల్లి మండలం అవిరేణికుంట తండా స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఓ డైవరు.. చిన్నగపోని కొడుకా.. ఆడోళ్లు..ముసలోల్లమున్నం..భయమైతోంది. అన్నా ఆ ట్రాక్టర్ డ్రైవర్ పెడచెవినపెట్టాడు..వాహన వేగాన్ని ఇంకా పెంచాడే కానీ.. వారి మాటను వినిపించుకోలేదు.. తండా నుంచి 60 మందికి పైగా ఎక్కించుకుని బయలు దేరిన పది నిమిషాల్లోనే ట్రాక్టర్ రెండు కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది.. ఇంతలోనే భారీ మూలమలుపు.. కళ్లు మూసి తెరిచేలోపు ట్రాక్టర్ ట్రాలీ ఇంజన్ నుంచి విడిపోయి బోల్తాకొట్టింది.. ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇదీ.. మఠంపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీరుతెన్ను. - మఠంపల్లి మఠంపల్లి మండలం కాలవపల్లి తండాకు చెందిన గిరి జనులు మేళ్లచెరువు మండలం పీక్లానాయక్‌తండాలో మిరపకాయలు ఏరేందుకు నిత్యం వెళ్తుంటారు.. ఆరోజు ఏ తోటలో కూలికి వెళ్తారో ఆ తోట యజమాని ట్రాక్టర్లో కూలీలను తీసుకెళ్లి మళ్లీ తండాలో విడిచిపెడతారు. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 7 గంటలకు తండాకు వచ్చిన ట్రాక్టర్లో సుమారు 60 మంది మహిళలతో పాటు కొందరు యువకులు ఎక్కి బయలుదేరారు. పదినిమిషాల్లోనే.. ట్రాక్టర్ తండా నుంచి బయలుదేరిన పదినిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. మఠంపల్లి మండలం అవిరేణికుంటతండా స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్ద ప్రధాన రహదారిపై ట్రాక్టర్ బోల్తాపడడంతో కాలవపల్లి తండాకు చెందిన భూక్యా జిజానీ (47), బాణోతు అంబాలి (36), భూక్యా సుజాత (30) అక్కడికక్కడే మృతిచెందగా మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో భూక్యా విజయ, కల్యాణిల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆహాకారాలు.. ఆర్తనాదాలు వేగంగా వస్తున్న ట్రాక్టర్ అవిరేణికుంటతండా మూలమలుపులో బోల్తాకొట్టడంతో ఒక్కసారిగా ఆహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటా యి. ట్రాలీ ఇంజన్ నుంచి విడిపోయి కుడిపక్కకు బోల్తాకొట్టింది. అయితే ట్రాలీలో 60 మందికి పైగా ఉండడంతో వారిలో కొందరు వేగానికి ఎగిరి రోడ్డు పక్కకు పొలాల్లో పడిపోయారు. మరికొందరు రోడ్డుపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఇంకొందరు ట్రాలీ కిం దనే ఉండిపోయారు. వెనుక మరో ట్రాక్ట ర్లో వస్తున్న కూలీలు ట్రాలీని లేపి చూడగా ముగ్గు రు మహిళలు అప్పటికే చనిపోగా, తీవ్రగాయాలతో మరికొందరు రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు. వెంటనే వారిని 108 వాహనంలో హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతులంతా నిరుపేదలే ... ప్రమాదంలో మృతిచెందిన కాలవపల్లితండాకు చెందిన భూక్యా జిజానీకి 9 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో తన ఐదుగురు పిల్లలను కూలీ నాలీ చేసి పోషించుకుంటుంది. వారిలో ఇద్దరు వికలాంగులు కూడా ఉన్నారు. గత ఏడాది ఒక వికలాంగురాలు మృతిచెందింది. జిజానీ మృతితో ఆ కుటుంబం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. అదేవిధంగా అదే తండాకు చెందిన బాణోతు సైదా, అంబాలీ దంపతులు నిరుపేద కూలీలు. వీరికి ఇద్దరు మగపిల్లలు. రోజు కూలీ చేస్తేనే పూట గడుస్తుంది. అంబాలీ అకాలమరణంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వీరితో పాటు ప్రాణాలు కోల్పోయిన తండాకు చెందిన గిరిజన యువతి సుజాతకు పాప, బాబు ఉన్నారు. సుజాత కూలికి వెళ్తుండగా, భర్త శ్రీనునాయక్ గిరిజన తండాలలో ఫొటోలు తీస్తూ జీవిస్తున్నారు. సుజాత మృతిచెందడంతో పసి పిల్లలు తల్లి కోసం ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ముగ్గురు మహిళలు ప్రమాదంలో మృత్యువాత పడడం, పలువురు క్షతగాత్రులవడంతో తండాలో విషాదచాయలు అలుమున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె. హుజూర్నగర్ సీఐ సురేందర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాకు దిక్కెవరు దేవుడా .. ప్రమాదంలో మృతిచెందిన కాలవపల్లితండాకు చెందిన జిజానీది నిరుపేద కుటుంబం. మృతురాలి భర్త దేవ్లా 9 ఏళ్ల క్రితం కాలం చేశాడు. ఏడాది క్రితం వికలాంగురాలైన కూతురు తనువుచాలించింది. జిజానీ రెక్కల కష్టంతో మరో నలుగురు పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రమాదంలో జిజానీ కూడా మృత్యువాత ప డడంతో ఆ కుటుంబం వీధినపడింది. జిజానీకి వికలాం గుడైన బలరాంనాయక్, ఇంటర్ చదువుతున్న రామా, బా బునాయక్, సుజాత సం తా నం. వీరిలో బాబునాయక్ కూ లికి వెళ్తుండగా, సుజాతకు పెళ్లి చేసింది. అయితే ఆలనాపాల నా చూసే తల్లి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ‘నాకు దిక్కెవరు దేవుడా’అంటూ రో దించిన తీరు అందరినీ కలచివేసింది. ప్రభుత్వం బల రాంనాయక్‌ను ఆదుకోవాలని పలువురు కోరారు. అవగాహన లేమి.. కానరాని హెచ్చరిక బోర్డులు మఠంపల్లి నుంచి జాన్‌పహాడ్ దర్గా వరకు ఇటీవల రూ.20 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు నిర్మించారు. రోడ్డు సాఫీగా ఉండడం తో డ్రైవర్ వాహనవేగాన్ని పెంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు డ్రైవర్ పక్క మండలానికి చెందిన వ్యక్తి కావడంతో ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో అవగాహన లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యం కూడా మరొక కారణంగా తేటతెల్లమవుతోంది. కోట్లాది రూపాయ ల ఖర్చుతో రోడ్డు నిర్మించిన అధికారులు ఎక్కడా ఒక స్పీడ్ బ్రేకర్ కానీ , మూ లమలుపుల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. ఎంత చెప్పినా వినలేదు తాము వేగం తగ్గించమని ఎంత చెప్పినా డ్రైవర్ వినిపిం చుకోలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. రెప్ప మూసి తెరిచేలోపు.. తలా ఓ దిక్కు చెల్లాచెదురుగా పడి ఉన్నాం. డ్రైవర్ మాట వింటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. - లచ్చిరాంనాయక్, ప్రమాద బాధితుడు -
ట్రాక్టర్ మీద పడి ఒకరు మృతి
దస్తురాబాదు (కడెం) : మండలంలోని దస్తురాబాదు గ్రామం వద్ద సోమవారం ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్సై భీమయ్య కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ లైనింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దస్తురాబాద్ గ్రామానికి చెందిన మారవేని రాజిరెడ్డి ట్రాక్టర్‌ను ఈ పనుల్లో పెట్టారు. ప్రస్తుతం కాలువపై బ్యాంకింగ్ కోసమని సమీప ప్రాంతం నుంచి ట్రాక్టరుతో మట్టి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం డ్రైవర్ ముద్దంగుల శ్రీనివాస్ మట్టి తీసుకొని కాలువపై ట్రాక్టరుకున్న ట్రాలీ జాక్‌ను పైకి లేపి మట్టిని పోస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది.దీంతో డ్రైవర్ శ్రీనివాస్ (35) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని స్వగ్రామం దస్తురాబాదు. ఇతడికి భార్య తిరుపతమ్మ, పిల్లలు గౌతం, సాయికుమార్ ఉన్నారు. మృత దేహంపై పడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై భీమయ్య తెలిపారు. కాగా సంఘటనా స్థలాన్ని గ్రామ సర్పంచ్ జి.గంగామణి సందర్శించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి దుర్మరణం
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: విద్యుత్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మండలంలోని చిన్నఅబ్బీపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో ఇదే మండల పరిధిలోని అబ్బాసాహెబ్పేటకు చెందిన వల్లూరు వెంగయ్య (27), కొత్తపేట నివాసి పీతల కొండలరావు (30) ప్రాణాలు విడిచారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..గుడిపాడు పంచాయతీ మజరా అబ్బాసాహెబ్పేటకు చెందిన వల్లూరు వెంగయ్య అనే రైతు తన పొలంలోని మోటార్‌కు విద్యుత్ స్తంభాలు తీసుకొచ్చేందుకు మండలంలోని కొత్తపేటకి చెందిన కొండలరావు, కోలా మస్తాన్, కోలా చిన్నకొండయ్య, కోలా మల్యాద్రి అనే కూలీలను వెంటబెట్టుకుని తన గ్రామవాసైన వల్లూరు వెంకట్రావు ట్రాక్టర్లో వెళ్లారు. అనుమసముద్రం వద్ద నాలుగు విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్లోకి ఎక్కించారు. అబ్బాసాహెబ్పేటకు వస్తూ మార్గమధ్యంలో చిన్నఅబ్బీపురం బస్టాండ్ దాటిన తర్వాత వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. గొల్లెం ఊడి ట్రక్కు బోల్తాపడింది. ట్రక్కులో స్తంభాలపై కూర్చున్న నలుగురు కూలీల్లో మస్తాన్, చిన్నకొండయ్య, మాల్యాద్రి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వల్లూరు వెంగయ్య, కొండలరావులపై స్తంభాలు పడటంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. మృతదేహాలను గ్రామస్తులు రాత్రికే రాత్రే ఊరికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి శనివారం వెళ్లి పరిశీలించారు. స్తంభాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు శవపంచనామా నిర్వహిస్తామన్నారు. విషాదఛాయలు మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వల్లూరు వెంగయ్యకు మూడేళ్ల క్రితమే సుశీలతో వివాహమైంది. తనకిక దిక్కెవరిని సుశీల చేస్తున్న రోదన చూపరులను కంటితడి పెట్టించింది. కొత్తపేటకు చెందిన కొండలరావుకు భార్య, కుమారుడు మనోహర్, కుమార్తె మమత ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. విద్యార్థి మృతి
తాళ్లూరు, న్యూస్‌లైన్: కరువది మేజర్ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని శివరామపురానికి చెందిన వెన్నపూస నాగిరెడ్డి పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఐఐటీ చదువుతున్నాడు. కళాశాల సెలవు కావడంతో పొలాన్ని బ్లేడుతో చదును చేసేందుకు ట్రాక్టర్‌ను కరువది మేజర్ కాలువ రోడ్డుపై నుంచి తీసుకెళుతున్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పొక్లెయిన్ సాయంతో ట్రాక్టర్‌ను బయటికి లాగారు. శోకసంద్రంలో శివరామపురం శ్రీనివాసరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుని మృతితో నాగిరెడ్డి దంపతులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.