కూలీ బతుకులు ఛిద్రం | Three died in tractor roll over | Sakshi
Sakshi News home page

కూలీ బతుకులు ఛిద్రం

Published Thu, Mar 19 2015 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

కూలీ బతుకులు ఛిద్రం

కూలీ బతుకులు ఛిద్రం

అతివేగంతో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురి దుర్మరణం
పొట్ట కూటి కోసం సొంత గ్రామంలో ఉపాధి దొరకక పండు మిరపకాయలు ఏరేందుకు వెళ్తున్న గిరిజనులు రెప్పపాటులో జరిగిన ప్రమాదంతో ఛిద్రమయ్యారు. బయలుదేరిన పది నిమిషాలకే బతుకు చాలించారు.  డ్రైవర్ అతివేగం..కనిపించని ఎటువంటి హెచ్చరిక బోర్డులు ..భారీ మూలమలుపులు.. అంతా స్పీడ్ ఎందుకయ్యా...తగ్గించుకో అన్నారు కూలీలు..అయినా వినలేదు.. అతని నిర్లక్ష్యమే ముగ్గురి నిండు ప్రాణాలు తీసింది. 20మందికిపైగా గాయాలపాల్జేసింది. పనికి వెళ్తేనే పూట గడిచే ఆ గిరిజన కూలీల కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.

మఠంపల్లి మండలం అవిరేణికుంట తండా స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.    ఓ డైవరు.. చిన్నగపోని కొడుకా.. ఆడోళ్లు..ముసలోల్లమున్నం..భయమైతోంది. అన్నా ఆ ట్రాక్టర్ డ్రైవర్ పెడచెవినపెట్టాడు..వాహన వేగాన్ని ఇంకా పెంచాడే కానీ.. వారి మాటను వినిపించుకోలేదు.. తండా నుంచి 60 మందికి పైగా ఎక్కించుకుని బయలు దేరిన పది నిమిషాల్లోనే ట్రాక్టర్ రెండు కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది.. ఇంతలోనే భారీ మూలమలుపు.. కళ్లు మూసి తెరిచేలోపు ట్రాక్టర్ ట్రాలీ ఇంజన్ నుంచి విడిపోయి బోల్తాకొట్టింది.. ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇదీ.. మఠంపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీరుతెన్ను.       
- మఠంపల్లి

మఠంపల్లి మండలం కాలవపల్లి తండాకు చెందిన గిరి జనులు మేళ్లచెరువు మండలం పీక్లానాయక్‌తండాలో మిరపకాయలు ఏరేందుకు నిత్యం వెళ్తుంటారు.. ఆరోజు ఏ తోటలో కూలికి వెళ్తారో ఆ తోట యజమాని ట్రాక్టర్‌లో కూలీలను తీసుకెళ్లి మళ్లీ తండాలో విడిచిపెడతారు.  ఇదే క్రమంలో బుధవారం ఉదయం 7 గంటలకు తండాకు వచ్చిన ట్రాక్టర్‌లో సుమారు 60 మంది మహిళలతో పాటు కొందరు యువకులు ఎక్కి బయలుదేరారు.

పదినిమిషాల్లోనే..
ట్రాక్టర్ తండా నుంచి బయలుదేరిన పదినిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. మఠంపల్లి మండలం అవిరేణికుంటతండా స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్ద ప్రధాన రహదారిపై  ట్రాక్టర్ బోల్తాపడడంతో కాలవపల్లి తండాకు చెందిన భూక్యా జిజానీ (47), బాణోతు అంబాలి (36), భూక్యా సుజాత (30) అక్కడికక్కడే మృతిచెందగా మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో భూక్యా విజయ, కల్యాణిల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ఆహాకారాలు.. ఆర్తనాదాలు
వేగంగా వస్తున్న ట్రాక్టర్ అవిరేణికుంటతండా మూలమలుపులో బోల్తాకొట్టడంతో ఒక్కసారిగా ఆహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటా యి. ట్రాలీ ఇంజన్ నుంచి విడిపోయి కుడిపక్కకు బోల్తాకొట్టింది. అయితే ట్రాలీలో 60 మందికి పైగా ఉండడంతో వారిలో కొందరు వేగానికి ఎగిరి రోడ్డు పక్కకు పొలాల్లో పడిపోయారు. మరికొందరు రోడ్డుపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఇంకొందరు ట్రాలీ కిం దనే ఉండిపోయారు. వెనుక మరో ట్రాక్ట ర్లో వస్తున్న కూలీలు ట్రాలీని లేపి చూడగా ముగ్గు రు మహిళలు అప్పటికే చనిపోగా, తీవ్రగాయాలతో మరికొందరు రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు. వెంటనే వారిని 108 వాహనంలో హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

మృతులంతా నిరుపేదలే ...
ప్రమాదంలో మృతిచెందిన కాలవపల్లితండాకు చెందిన భూక్యా జిజానీకి 9 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో తన ఐదుగురు పిల్లలను కూలీ నాలీ చేసి పోషించుకుంటుంది. వారిలో ఇద్దరు వికలాంగులు కూడా ఉన్నారు. గత ఏడాది ఒక వికలాంగురాలు మృతిచెందింది. జిజానీ మృతితో ఆ కుటుంబం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. అదేవిధంగా అదే తండాకు చెందిన బాణోతు సైదా, అంబాలీ దంపతులు నిరుపేద కూలీలు. వీరికి  ఇద్దరు మగపిల్లలు. రోజు కూలీ చేస్తేనే పూట గడుస్తుంది.  అంబాలీ  అకాలమరణంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వీరితో పాటు ప్రాణాలు కోల్పోయిన తండాకు చెందిన గిరిజన యువతి సుజాతకు  పాప, బాబు ఉన్నారు. సుజాత కూలికి వెళ్తుండగా, భర్త శ్రీనునాయక్ గిరిజన తండాలలో ఫొటోలు తీస్తూ జీవిస్తున్నారు. సుజాత మృతిచెందడంతో పసి పిల్లలు తల్లి కోసం ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ముగ్గురు మహిళలు ప్రమాదంలో మృత్యువాత పడడం, పలువురు క్షతగాత్రులవడంతో తండాలో విషాదచాయలు అలుమున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె. హుజూర్‌నగర్ సీఐ సురేందర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాకు దిక్కెవరు దేవుడా ..
ప్రమాదంలో మృతిచెందిన కాలవపల్లితండాకు చెందిన జిజానీది నిరుపేద కుటుంబం. మృతురాలి భర్త దేవ్లా 9 ఏళ్ల క్రితం కాలం చేశాడు. ఏడాది క్రితం వికలాంగురాలైన కూతురు తనువుచాలించింది. జిజానీ రెక్కల కష్టంతో మరో నలుగురు పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రమాదంలో జిజానీ కూడా మృత్యువాత ప డడంతో ఆ కుటుంబం వీధినపడింది. జిజానీకి   వికలాం గుడైన బలరాంనాయక్, ఇంటర్ చదువుతున్న రామా, బా బునాయక్, సుజాత సం తా నం. వీరిలో బాబునాయక్ కూ లికి వెళ్తుండగా, సుజాతకు పెళ్లి చేసింది. అయితే ఆలనాపాల నా చూసే తల్లి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ‘నాకు దిక్కెవరు దేవుడా’అంటూ రో దించిన తీరు అందరినీ కలచివేసింది.  ప్రభుత్వం బల రాంనాయక్‌ను ఆదుకోవాలని పలువురు కోరారు.

అవగాహన లేమి.. కానరాని హెచ్చరిక బోర్డులు
మఠంపల్లి నుంచి జాన్‌పహాడ్ దర్గా వరకు ఇటీవల రూ.20 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు నిర్మించారు. రోడ్డు సాఫీగా ఉండడం తో డ్రైవర్ వాహనవేగాన్ని పెంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు డ్రైవర్ పక్క మండలానికి చెందిన వ్యక్తి కావడంతో ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో అవగాహన లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యం కూడా మరొక కారణంగా తేటతెల్లమవుతోంది. కోట్లాది రూపాయ ల ఖర్చుతో రోడ్డు నిర్మించిన అధికారులు ఎక్కడా ఒక స్పీడ్ బ్రేకర్ కానీ , మూ లమలుపుల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు.

ఎంత చెప్పినా వినలేదు
తాము వేగం తగ్గించమని ఎంత చెప్పినా డ్రైవర్ వినిపిం చుకోలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు.  రెప్ప మూసి తెరిచేలోపు.. తలా ఓ దిక్కు చెల్లాచెదురుగా పడి ఉన్నాం. డ్రైవర్ మాట వింటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో.
- లచ్చిరాంనాయక్, ప్రమాద బాధితుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement