ట్రాక్టర్ మీద పడి ఒకరు మృతి | One dead lying on the tractor | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ మీద పడి ఒకరు మృతి

Published Tue, Jan 20 2015 5:40 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ట్రాక్టర్ మీద పడి ఒకరు మృతి - Sakshi

ట్రాక్టర్ మీద పడి ఒకరు మృతి

దస్తురాబాదు (కడెం) : మండలంలోని దస్తురాబాదు గ్రామం వద్ద సోమవారం ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్సై భీమయ్య కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ లైనింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దస్తురాబాద్ గ్రామానికి చెందిన మారవేని రాజిరెడ్డి ట్రాక్టర్‌ను ఈ పనుల్లో పెట్టారు.

ప్రస్తుతం కాలువపై బ్యాంకింగ్ కోసమని సమీప ప్రాంతం నుంచి ట్రాక్టరుతో మట్టి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం డ్రైవర్ ముద్దంగుల శ్రీనివాస్ మట్టి తీసుకొని కాలువపై ట్రాక్టరుకున్న ట్రాలీ జాక్‌ను పైకి లేపి మట్టిని పోస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ తిరగబడింది.దీంతో డ్రైవర్ శ్రీనివాస్ (35) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని స్వగ్రామం దస్తురాబాదు.

ఇతడికి భార్య తిరుపతమ్మ, పిల్లలు గౌతం, సాయికుమార్ ఉన్నారు. మృత దేహంపై పడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై భీమయ్య తెలిపారు. కాగా సంఘటనా స్థలాన్ని గ్రామ సర్పంచ్ జి.గంగామణి సందర్శించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement