
మృతి చెందిన శివశంకర్
రుద్రవరం (కర్నూలు): మండలంలోని పెద్దకంబలూరులో శుక్రవారం ట్రాక్టరు బోల్తాపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ చిన్నపీరయ్య యాదవ్ వివరాల మేరకు.. పెద్దకంబలూరుకు చెందిన గువ్వల నరసింహుడు తన మేనల్లుడైన యర్రగుడి గ్రామానికి చెందిన శివశంకర్(19)ను చిన్నప్పుడే తీసుకెళ్లి పెంచాడు. శివశంకర్ కూడా మేనమామకు ఇల్లు, వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇందులో భాగంగా ఉదయం ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు.
గ్రామ సమీపంలోని చెరువుకట్టమీదకు చేరుకోగానే ట్రాక్టరు అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో అతడు ట్రాక్టర్ కింద పడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment