అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలం తమ్మేపల్లి వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్ గురువారం ఉదయం బోల్తాపడింది.
► ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
రాయదుర్గం(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలం తమ్మేపల్లి వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న ట్రాక్టర్ గురువారం ఉదయం బోల్తాపడింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108లో క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు కర్ణాటకకు చెందినవారని, పెళ్ళికి ట్రాక్టర్‌లో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.